E-Paper
Advertisement

Uday Krishna Reddy: ఖాకీవనంలో కామతురాణం.. ఉదయ్‌ కృష్ణారెడ్డి భవితవ్యం ఎటువైపు?

Uday Krishna Reddy: ఖాకీవనంలో కామతురాణం.. ఉదయ్‌ కృష్ణారెడ్డి భవితవ్యం ఎటువైపు?
Advertisement

Uday Krishna Reddy: ఖాకీవనంలో కామతురాణం.. లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి భవితవ్యం ఎటువైపు టర్న్‌ కాబోతుంది. నిజంగానే తప్పు చేశారా? లేదంటే మరేదైనా కోణం వుందా? ఇది డే1 నుంచి జరుగుతున్న చర్చనే. అలాగే సూసైడ్‌ అటెంప్ట్‌ వ్యహారం కూడా చర్చగా రచ్చగా మారింది.

తాగిన మైకంలో ఏం రాశానో..

Advertisement

స్పహాలోకి వచ్చిన ఉదయ్‌ కృష్ణారెడ్డి తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని, ఆవేదనతో మద్యం ఎక్కువగా తాగానంటూ క్లారిటీ ఇచ్చారు. మరి వైరలైన లెటర్‌ సంగతేంటి? తాగిన మైకంలో ఏం రాశానో తనకు తెలియదని డాక్టర్లు చెప్పారట. కట్‌ చేస్తే ఉదయ్‌ కృష్ణారెడ్డి హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జయ్యారు. మరోవైపు తనపై వచ్చిన అభియోగాలు అవాస్తవమంటూ తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఐతే ఉదయ్‌ కృష్ణారెడ్డి పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న ఆయన అభ్యర్థను కోర్టు తిరస్కరించింది. ఇక ఉదయ్‌ కృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేసిన ట్రైనీ ఐపీఎస్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు పోలీసులు.

ఏది నిజం..? ఎవరు నిజం..?

Advertisement

లేడీ ట్రైనీ ఐపీఎస్‌ ఫిర్యాదుతో అత్తాపూర్‌ పీఎస్‌లో ఉదయ్‌ కృష్ణారెడ్డిపై కేసు ఫైలయింది. తనను లైంగికంగా వేధించడమే కాకుండా తన ఫ్యామిలీకి వీడియోలు పంపి ఉదయ్‌ కృష్ణారెడ్డి తమను తీవ్ర మానసిక క్షొభకు గురి చేశాడని వాపోయారామె. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు డీసీపీ లావణ్య . మరోవైపు తప్పుడు ఆరోపణలు.. తప్పుడు సెక్షన్లతో తనపై తప్పుడు కేసు పెట్టారంటున్నారు ఉదయ్‌ కృష్ణా రెడ్డి. ఏది నిజం? ఎవరు నిజం? వైడ్‌ యాంగిల్‌లో జరుగుతోన్న ఎంక్వయిరీలో పోలీస్‌ అకాడమీలో బ్లూ ట్రూత్ ఏంటో రేపో మాపో తెరపైకి రాకతప్పదు.

చట్టం తన పనితాను చేసుకెళ్తుంది. కానీ ప్రజల ధన ప్రాణ మానాలను రక్షిస్తామని ప్రమాణం చేసే పోలీస్‌ అకాడమీలో లైంగిక వేధింపులు తెరపైకి రావడం వివాదాస్పదంగా మారింది. ఈ కేసు ఎలాంటి టర్న్‌ తీసుకుంటుంది? ఇంకా ఎలాంటి సంచలనాలు బయటకు వస్తాయనే చర్చ జరుగుతోంది.

Also Read: తీగ లాగితే ఐఏఎస్‌లనే తలదన్నే తిమింగలం పడింది! ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో బయటపడ్డ ఆస్తులు చూస్తే మైండ్ బ్లాకే!

Tags

Related News

OTP 6 అంకెలే ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా?

Transco DE: తీగ లాగితే ఐఏఎస్‌లనే తలదన్నే తిమింగలం పడింది! ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో బయటపడ్డ ఆస్తులు చూస్తే మైండ్ బ్లాకే!

ముందు నుయ్యి వెనుక గొయ్యి.. రాహుల్ ఎంట్రీతో కేంద్రానికి మ‌రింత జ‌ఠిలంగా ప్ర‌ధాన్ స‌మ‌స్య‌!

90 శాతం ఓట‌ర్ల‌పై స‌ర్ గురిపెట్టిందా? ఆ ఓట‌ర్లు త‌మ‌కు ఓటేయ‌ర‌నే ఈ విధాన‌మా? చ‌ర్చ‌కు తెర‌తీసిన సీఎం కామెంట్స్‌..!

సొంత గ‌డ్డ‌పై న‌న్నోడించే కుట్ర‌.. స‌ర్ ముసుగులో దొంగ ఓట్ల డ్రామా..!

మోడీ మొండికి పోతుండు.. తొండికి దిగుతుండు..! ప్ర‌ధాన్ కోసం విద్యార్థుల‌పై ప్ర‌ధాని ప్ర‌తాపం..

ఆరునూరైనా కేసీఆర్ సీఎం.. పోలీసుల తోలుతీసే ప‌నిపైనే మొద‌టి సంత‌కం..!

Big Stories

Advertisement
×