E-Paper
Advertisement

PCB మ‌రో దిక్కుమాలిన కండీష‌న్‌.. ‘పాడెల్’ ఆడితేనే జ‌ట్టు ఛాన్స్‌

PCB మ‌రో దిక్కుమాలిన కండీష‌న్‌.. ‘పాడెల్’ ఆడితేనే జ‌ట్టు ఛాన్స్‌
Advertisement

Padel Mandate To Pakistan Cricketers: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. 2027 వన్డే వరల్డ్ కప్ లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దీని కోసం ఇప్పటికే పాకిస్తాన్ క్రికెటర్లకు ఇంగ్లీష్ క్లాసులు ప్రారంభించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… హిట్టర్లుగా మార్చేందుకు అమెరికాలో ట్రైనింగ్ ఇప్పిస్తోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ ప్లేయర్లు పాడెల్ గేమ్ ఆడితేనే (Padel Mandate To Pakistan Cricketers) అంతర్జాతీయ జట్టులోకి తీసుకుంటామని కొత్త కండీషన్ పెట్టింది. ప్లేయర్లు ఫిట్నెస్ గా ఉండేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాహోర్ లోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ ఇస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఇకపై ప్రతీ క్రికెటర్ పాడెల్ ఆడాల్సిందేనని ఆదేశాలు దారి చేసింది. దీంతో పాకిస్తాన్ క్రికెటర్లు తలలు పట్టుకుంటున్నారు. క్రికెట్ ఆడ‌ట‌మే ఎక్కువ అనుకుంటే, ఇప్పుడు పాడెల్ ఏంట్రా అంటున్నారు.

Also Read: Sikandar Raza Warns Team India: మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

ప్రతి ఒక్క క్రికెటర్ పాడెల్ ఆడాల్సిందే.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌ట‌న‌

Advertisement

పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ జట్టులో ఉండాలంటే పాడెల్ ఆడాల్సిందేనని కొత్త కండిషన్ పెట్టింది PCB. ఈ మేరకు తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన సీనియర్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే పాకిస్తాన్ జట్టును తయారు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే పాడెల్ ఆటను ఆడాల్సిందేనని కండిషన్ పెట్టినట్లు వివరించారు. ఇప్పటికే చాలామంది పాకిస్తాన్ క్రికెటర్లు పాడెల్ ఆడుతున్నారని గుర్తు చేశారు.

మిగిలిన ప్లేయ‌ర్లు కూడా అలవాటు చేసుకోవాలన్నారు. అయితే పాకిస్తాన్ క్రికెటర్లు వివిధ నగరాలలో ఉంటారు కాబట్టి.. వాళ్లకు పాడెల్ ఆడే అవకాశం దొరకడం లేదని వివరించారు. ఈ సమస్య నేపథ్యంలో తామే లాహోర్ లోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రత్యేక పాడెల్ కోర్టును నిర్మించామన్నారు. ఇకపై ప్రతి ఒక్క క్రికెటర్ పాడెల్ ఆడాల్సిందేనని గుర్తు చేశారు. ఈ పాడెల్ ఆడడం వల్ల క్రికెటర్ల ఏకాగ్రత, ఫిట్నెస్ మెరుగుపడుతుందన్నారు. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే 2027 వరకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు బలంగా తయారవుతుందన్నారు.

PCB నిర్ణయం పై తీవ్రస్థాయిలో విమర్శలు

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తాజాగా తీసుకున్న పాడెల్ నిర్ణయం పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. 2027 వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే…. పాకిస్తాన్ ప్లేయర్లతో ఎక్కువ శాతం వన్డేలు ఆడిపించాలని సూచనలు చేశారు. అంతేకానీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు, పాడెల్ ఆడాలంటూ కండిషన్లు పెట్టడం కరెక్ట్ కాదని కౌంటర్లు పేల్చుతున్నారు.

Also Read: MI London vs Sunrisers Leeds, 1st Match: కావ్య పాప‌కు బిగ్ షాక్‌…స‌న్ రైజ‌ర్స్ మ్యాచ్ లు చూడకుండా కుట్ర‌లు !

 

 

Related News

ఐపీఎల్ ప‌ర‌మ చెత్త లీగ్…అందులో ఆడ‌టం కంటే, ఇంట్లో కూర్చోండి

స్పెయిన్ ఆట‌గాడి నిర్ల‌క్ష్యం..కింద ప‌డి రెండు ముక్క‌లైన‌ ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ?

కొంప‌ముంచిన ధర్మేంద్ర ప్రధాన్…గంభీర్ మెడ‌పైకి క‌త్తి? ఢిల్లీలో కొత్త టెన్ష‌న్‌

ఓరేయ్ వైభ‌వ్..నువ్వు మ‌గాడివైతే జింబాబ్వేపై సెంచ‌రీ కొట్టు !

బౌలింగ్ స‌రిగ్గా చేయ‌లేద‌ని ధోని ప‌చ్చిబూతులు తిట్టాడు, లైవ్ మ్యాచ్ లోనే అవ‌మానించాడు

AB డివీలియర్స్ లాగా ఆడి, టీమిండియాను చిత్తుగా ఓడిస్తా

టీమిండియా చేతిలో ఓడినందుకు మాపై కుళ్ళిన గుడ్లు, టమోటాలు విసిరారు

Big Stories

Advertisement
×