E-Paper
Advertisement

అమ్మబాబోయ్… ప్రేమను నిరూపించుకోవడానికి సినిమాను మించిన స్టంట్

అమ్మబాబోయ్… ప్రేమను నిరూపించుకోవడానికి సినిమాను మించిన స్టంట్
Advertisement

Adventure Documentary: ఎవరినైనా ప్రాణంగా ప్రేమించినప్పుడు, ప్రేమించిన వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా వెనకాడము. కానీ అంత ఇష్టం ఉన్నప్పుడు చావడం కాదు, ఇష్టపడిన వాళ్ళకు నచ్చినట్టుగా, వాళ్ళు మెచ్చేలా బతికి చూపించాలి. అలాగే వాళ్ళ ప్రేమ కథ గురించి నలుగురు మాట్లాడుకునేంత గొప్పగా ఉండాలి. కానీ ప్రపంచం అంతా మాట్లాడుకోవాలి అంటే వీళ్ళు చేసిన అడ్వెంచర్ చేసి చూపించారు. అదేంటో తెలియాలంటే ‘స్కైవాకర్స్: ఎ లవ్ స్టోరీ’ (Skywalkers A Love Story 2024) అనే ఈ డాక్యుమెంటరీని చూడాల్సిందే. మరి ఈ డాక్యుమెంటరీ కథ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

వాన్యా బీర్కస్ రష్యాలో బిల్డింగ్‌లు ఎక్కుతూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన రూఫ్‌టాపర్. జిమ్నాస్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఏంజెలా నికోలౌ కూడా ఈ రంగంలోకి ప్రవేశిస్తుంది. మొదట్లో ఒకరికొకరు కాంపిటీషన్ గా ఫీల్ అవుతారు. ఆ తర్వాత పార్టనర్స్ అవుతారు. ఇద్దరూ కలిసి స్టంట్లు చేయడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఎత్తైన బిల్డింగ్‌ల అంచున నిలబడి తీసుకునే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ సాధిస్తాయి.

Advertisement

అయితే, కోవిడ్-19 లాక్‌డౌన్ రావడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కావడంతో వారి స్పాన్సర్‌షిప్‌లు తగ్గిపోయి, ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి. అలాగే కొత్త రూఫ్‌టాపర్స్ రావడంతో వీరి క్రేజ్ తగ్గుతుంది. కోల్పోయిన గుర్తింపును, స్పాన్సర్లను తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే తమ బంధాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఒక షాకింగ్ పని చేయాలనుకుంటారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఉన్న, ప్రపంచంలోనే రెండవ అత్యంత ఎత్తైన స్కైస్క్రాపర్ అయిన ‘మెర్డెకా 118’… అంటే 118 అంతస్తుల భవనం పైకి ఎక్కి, దాని చివరన ఉన్న 160 మీటర్ల స్పైర్ పై ఒక భయంకరమైన ఆక్రోబాటిక్ స్టంట్ చేయాలని డిసైడ్ అవుతారు.

కఠినమైన సెక్యూరిటీని దాటుకుని, కెమెరాల కంటికి చిక్కకుండా, లాక్‌డౌన్‌లో ఉన్న ఆ బిల్డింగ్‌లోకి వారు ఎలా ప్రవేశించారనేది అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటుంది. గంటల తరబడి కాపలాదారులకు దొరకకుండా దాక్కుని, విపరీతమైన గాలి, వర్షం, అలసట, మరణ భయాన్ని జయించి వారు ఆ భవనం పైకి ఎలా చేరుకుంటారు? చివరకు ఆ భయంకరమైన స్టంట్‌ను ఎలా పూర్తి చేస్తారు? అన్నది తెలియాలంటే ఈ డాక్యుమెంటరీని చూడాల్సిందే.

తెలుగులో లేదు

Advertisement

ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనాల పైకి ఎలాంటి సేఫ్టీ గేర్ లేకుండా ఎక్కి, ఆకాశంలో బాలెన్స్ చేసి ఫోటోలు, వీడియోలు తీసుకునే ‘రూఫ్‌టాపింగ్’ స్టంట్లు చేసే రష్యన్ జంట ఏంజెలా నికోలౌ, వాన్యా బీర్కస్ ల నిజ జీవిత కథే ఈ డాక్యుమెంటరీ. జెఫ్ జింబాలిస్ట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైండ్ బ్లోయింగ్ డాక్యుమెంటరీ Netflixలో ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ లేదు. కాబట్టి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో చూడొచ్చు. ఎత్తులంటే భయం లేని వారిని సైతం కుర్చీ అంచున కూర్చోబెట్టే స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ ఉన్న ఈ డాక్యుమెంటరీ అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది.

Read Also: ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

Tags

Related News

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..ఎక్కడ ?ఎప్పుడంటే?

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

Big Stories

Advertisement
×