E-Paper
Advertisement

మొన్నటిదాకా మేం ప్రయత్నం చేసినం.. సాధ్యమే కాలేదన్న హరీశ్‌! అక్కడ నీళ్లే లేవు.. అందుకే మేడిగడ్డకు మార్చామని వాదన!

మొన్నటిదాకా మేం ప్రయత్నం చేసినం.. సాధ్యమే కాలేదన్న హరీశ్‌! అక్కడ నీళ్లే లేవు.. అందుకే మేడిగడ్డకు మార్చామని వాదన!
Advertisement

తుమ్మిడిహట్టి పై మహారాష్ట్ర సీఎంతో సానుకూల చర్చలు జరిగిన నేపథ్యంలో.. హరీశ్‌ హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టారు. వితండవాదం చేశాడు. తన వైరాగ్యాన్ని ప్రదర్శించాడు.  పొంతన లేని మాటలు మాట్లాడాడు. సంబంధం లేని వివరణలిచ్చాడు. ఆ ఒక్క ప్రెస్‌మీట్‌లోనే పలు రకాల వాదనలు చేసి.. చూసే జనాలకు ఏదీ కరెక్టుగా చెప్పకుండా చివరగా మా కేసీఆర్‌ కట్టిన మేడిగడ్డే మీకు దిక్కు…! అని ఫినిషింగ్‌ టచ్ ఇచ్చి ముగించేశాడు.

అయితే ఆయన గతంలో కాంగ్రెస్‌ సర్కార్‌ ఈ తుమ్మిడిహట్టి విషయంలో ఇచ్చిన వివరణకు దీనికి పూర్తి భిన్నంగా అనిపించింది. అంతకు ముందు.. ‘మీరు వెళ్లి కలుస్తామంటే మహారాష్ట్ర సీఎం కలవడా? దీని కోసం లేఖ రాయాల్నా?’ అని వెటకారమాడిన హరీశ్‌.. ఇప్పుడు చర్చలు సఫలమయ్యాయనగానే మాట మార్చాడు.

Advertisement

ఆయన ప్రెస్‌మీట్‌ మొదలు పెట్టడం పెట్టడమే.. ‘మేము అధికారంలోకి వచ్చిన 42 రోజుల్లో మహారాష్ట్రతో చర్చలు జరిపాం.. మీకు మూడేండ్లు పట్టిందా?’ అని అన్నారు. అంటే.. ‘ఇంత లేటుగా పోతారా? ఎప్పుడో వెళ్లి దీనిపై మాట్లాడాల్సింది’ అనే అర్థం వచ్చింది హరీశ్‌ మాటల్లో. ‘మహారాష్ట్ర సీఎంతో కేసీఆర్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. వారు వినలేదు. ముంపు భారీగా ఉందని తిరస్కరించారు. అక్కడ ఈ ముంపు ప్రాంత ప్రజలు పెద్ద ఉద్యమం కూడా చేశారు. దీనికి ఫడ్నవీస్‌నే నాయకత్వం వహించారు…’ అని వివరించారు గతంలో హరీశ్‌.

ఇప్పుడేమంటున్నారు..? ‘అసలు అక్కడ నీళ్లు లేనే లేవు. మీ ప్రయత్నాలన్నీ వృథానే. అందుకే మేం మేడిగడ్డకు పోయి అక్కడ ప్రాజెక్టును నిర్మించాం..’ అని మళ్లీ సమర్థించుకునే ప్రయత్నం చేశాడు హరీశ్‌. ఒకవేళ కాంగ్రెస్‌ సర్కార్‌.. 148 మీటర్లకో.. 150 మీటర్లకో దీన్ని ఫైనల్ చేసుకుని వస్తే.. ‘ఆ పని మేం అప్పుడే చేసేవాళ్లం.. మనకు కావాల్సింది.. 152 మీటర్ల ఎత్తు.. దాని కోసమే మేం ట్రై చేసి చేసీ కాదని కానిచ్చేశాం!’ అని చెప్పేవాడేమో.

Advertisement

గ్రావిటీ ద్వారా నీళ్లే రావని ఇప్పుడు కొత్త రాగమందుకున్నాడాయన. ప్రాణహిత- చేవెళ్లను డిజైన్‌ చేసింది.. తుమ్మిడిహట్టి వద్ద అని డిసైడ్‌ చేసింది.. మోటార్లతో ఎత్తిపోసే పనిని తగ్గించుకునేందుకు. గ్రావిటీని వినియోగించుకునేందుకు. వేల కోట్ల రూపాయల విద్యుత్‌ బిల్లుల భారం నుంచి తప్పించుకునేందుకు.

బాజాప్తా కేసీఆర్‌ అసెంబ్లీలోనే చెప్పాడు. ‘మేం కావాలనే మేడిగడ్డ వద్ద దీన్ని కడుతున్నాం. ఇక్కడైతే నీళ్లు సమృద్ధిగా ఉంటాయని లెక్కలేశామ’ని. మరి ఆ విషయాన్ని సూటిగా చెప్పలేని హరీశ్‌.. దీనిపై ఇప్పటి వరకు మాట్లాడిన మాటలన్నీ పొంతన లేకుండానే ఉన్నాయి. మేడిగడ్డనే శరణ్యమన్నాడు చివరకు. అవునూ.. కాదని ఎవరన్నారు..? సర్కార్‌ కూడా దీని రిపేర్లు చేయించేందుకు రెడీ అయ్యింది. టెండర్లు కూడా పూర్తయ్యాయి. వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరంను వినియోగించుకుంటామని కూడా చెబుతున్నారు.

దీన్ని పడావుగా పెడితే అది సర్కార్‌ మూర్ఖత్వమే అవుతుంది.అది వారికీ తెలుసు. ‘మేడిగడ్డను మీరే బాంబులు పెట్టి పేల్చి ఉంటార’నే ప్రేలాపలను కూడా మధ్యలో మాట్లాడారు బీఆర్‌ఎస్‌ నేతలు. అంటే మేడిగడ్డ కూలడం వల్ల వినియోగానికి పనికి రాకుండా అయ్యిందనే విషయాన్ని పరోక్షంగా ఒప్పుకున్నారు.

ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువేనని నిన్న మొన్నటి వరకు పదే పదే వల్లెవేస్తూ వచ్చిన బీఆర్‌ఎస్‌ పెద్దలకు, ముఖ్యులకు .. ఈ మహారాష్ట్రతో చర్చలు.. సఫలం అనే న్యూస్‌ మింగుడుపడనట్టుంది. ‘ఇదేంటీ..? మధ్యలో ఈ తుమ్మిడిహట్టి వచ్చి పడిందేమిటీ?’ అనే వైరాగ్యమైతే హరీశ్‌ మాటల్లో స్పష్టంగా కనిపించింది.

Tags

Related News

2016 ఒప్పందంలో బిగ్ మిస్టెక్.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ అసలు రూట్ మ్యాప్ ఇదే?

తెలంగాణలో బీజేపీ బిగ్ ప్లాన్.. కాంగ్రెస్‌ను నిలదీసేందుకు వేసిన ప్లాన్ ఇదే?

ఫలించిన రేవంత్‌ దౌత్యం! తుమ్మిడిహెట్టి రీ డిజైన్‌తో జఠిల సమస్యను పరిష్కరించే దిశగా..! కేసీఆర్ చేతులెత్తేసిన చోటే..తాను సాధించే దిశగా అడుగులు..!

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్.. కేటీఆర్ సంచలన ప్రకటన!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తు వద్దే వద్దు..! అతన్ని చూసి ఇక్కడ ఓట్లేసే సీన్ లేదు..!?

ఆకాశంలో రెక్కలు విప్పి ఎగిరే చేప.. దీని వెనుక ఉన్న అద్బుత రహస్యం ఇదే?

కూటమిలో కుమ్ములాట.. బరిలోకి దిగేదెవరు? ఇంకా క్లారిటీ ఇవ్వని పెద్దలు!

Big Stories

Advertisement
×