Nazriya Nazim:క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సౌత్ ఇండియా ఆడియన్స్‌ని కట్టిపడేసిన నటి నజ్రియా నజీమ్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కోలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. తమిళ నటుడు సూర్య హీరోగా, మలయాళ డైరెక్టర్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సీన్’ సినిమా ద్వారా ఏకంగా 12 ఏళ్ల తర్వాత ఆమె తమిళ తెరకు రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇటీవల దుబాయ్ లోని ఒక ప్రముఖ మాల్‌లో జరిగిన ప్రాజెక్ట్ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న నజ్రియా.. ధరించిన అత్యంత ఖరీదైన డిజైనర్ డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వివరాలు చూద్దాం..
ఈ ప్రమోషనల్ ఈవెంట్‌లో మాట్లాడిన నజ్రియా.. 12 ఏళ్ల విరామం తర్వాత తమిళ సినిమాలో నటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తనను నమ్మి ఈ మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు జిత్తు మాధవన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. కో-స్టార్స్ సూర్య, నస్లేన్‌ల నుంచి మంచి సపోర్ట్ లభించిందని, ఈ సినిమాలో పనిచేయడం తన కెరీర్‌లోనే ఒక అద్భుతమైన అనుభవమని చెప్పారు. వర్కవుట్ అయిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ నవంబర్ 6న థియేటర్లలోకి రాబోతోందని, అందరూ తప్పక చూడాలని ఆమె కోరారు.
ఈ ఈవెంట్‌లో నజ్రియా ధరించిన డ్రెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ‘ఆరోకా’ డిజైన్ చేసిన ‘చార్ట్రూస్ రుచెడ్ డ్రెస్’లో ఆమె దేవకన్యలా మెరిసిపోయారు. ఇక లైట్‌వెయిట్ షిఫాన్, స్మూత్ మోడల్ శాటిన్ లైనింగ్‌తో పాటు నెక్‌లైన్ దగ్గర అమర్చిన లేస్ డిటైలింగ్, షిఫాన్ స్కార్ఫ్ ఆమె లుక్‌కు మరింత గ్లామర్‌ను తెచ్చిపెట్టాయి. ఈ అవుట్‌ఫిట్‌లో నజ్రియా కనిపించిన తీరుకు ఫ్యాషన్ ప్రియులు ఫిదా అయిపోయారు.
also read:నాలోనే ఆ సమస్య ఉందనుకున్నాను – కీర్తి సురేష్
అయితే అందరినీ ఆశ్చర్యపరిచిన అసలు విషయం ఏంటంటే ఆ డ్రెస్ ఖరీదే! సాధారణంగా హీరోయిన్లు విభిన్నమైన అవుట్‌ఫిట్స్ వేసుకున్నప్పటికీ, నజ్రియా ధరించిన ఈ ఆరోకా బ్రాండ్ డిజైనర్ డ్రెస్ ధర దాదాపు రూ 89,700 వరకు ఉంటుందని సమాచారం. ఇక ఈవెంట్ కోసమే దాదాపు రూ.90 వేల విలువైన డ్రెస్ ధరించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘ఫ్యాషన్ వేరే లెవెల్.. ధర కూడా అంతే!’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక మొత్తానికి చూస్తే, 12 ఏళ్ల తర్వాత గ్రాండ్‌గా తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్న నజ్రియా నజీమ్, ఇటు తన కంబ్యాక్ సినిమాతోనూ, అటు మైండ్ బ్లాంక్ అయ్యే ఖరీదైన డ్రెస్ ఫ్యాషన్‌తోనూ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. నవంబర్ 6న విడుదల కానున్న ‘సీన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.