E-Paper
Advertisement

విశ్వనగరం అసలు రూపం ముందుంచుతాం..! మా పార్టీ నినాదం ప్రశ్నిస్తాం.. పోరాడుతాం.. పరిష్కరిస్తాం..!

విశ్వనగరం అసలు రూపం ముందుంచుతాం..! మా పార్టీ నినాదం ప్రశ్నిస్తాం.. పోరాడుతాం.. పరిష్కరిస్తాం..!
Advertisement

సీఎం రేవంత్‌రెడ్డి ఫేక్‌ ముచ్చట్లు కట్టిపెట్టాలని, ఉత్తుత్తి ఎంవోయూలు చేసుకుని ప్రజల చెవిలో పువ్వు పెట్టడం మానుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత విమర్శించారు. పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రాజధాని రణభేరీ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం పచ్చి అబద్దాలు ఆడుతున్నారని, ఎంత మందికి ఉద్యోగాలిచ్చారో చెప్పాలన్నారు.

ప్రభుత్వం నిర్వహించబోయే గ్లోబల్‌ సమ్మిట్‌ను అడ్డుకుంటామన్నారు కవిత. ఉద్యోగాలు కల్పించకుండా.. సీఎం తమ్ముడి కంపెనీ కోసం పేదల భూములు లాక్కుంటున్నారని, దీన్ని అడ్డుకుని తీరుతామన్నారు. హైదరాబాద్‌ ఐటీ ఉద్యోగులకు ఉద్యోగ భధ్రత లేకుండా పోయిందని, వారికి ఐటీ పాలసీ ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారామె.

Advertisement

హైదరాబాద్‌ మహానగరాన్ని నిజాం ప్రభువు  ప్రపంచ పటంలో పెట్టారని గుర్తు చేశారు. చెత్తను ఎత్తేయడం కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదని, ఆటోలపై చెత్త ఎత్తే కార్మికుల పొట్ట కొట్టేలా ఈ కాంట్రాక్టును మొత్తం రాంకీ కంపెనీకి ఇస్తున్నారని మండిపడ్డారు. వెంటనే దీన్ని ఆపాలని,లేదంటే ఆ చెత్తంతా తీసుకొచ్చి సీఎం ఇంటి ముందు వేస్తామన్నారు. ఇప్పటికే వడ్లను సెక్రటేరియట్ ముందు పోసి పోరాటం చేశామని, మాతో పెట్టుకోవద్దని సర్కార్‌కు వార్నింగ్‌ ఇచ్చారామె.

అన్ని ప్రతిపక్షాల్లా మౌనంగా ఉండే పార్టీ టీఆరెస్‌ కాదని, ఈ పార్టీ కండువా అంటేనే జనంలో ఓ నమ్మకం, నాయకుల్లో ఓ బాధ్యత ఉంటుందన్నారు. జీహెచ్‌ఎంసీలో టీఆరెస్‌ అన్నిడివిజన్లలో పోటీ చేస్తుందని, గ్రేటర్‌పీఠంపై టీఆరెస్‌ జెండా ఎగురవేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కూరగాయలు, చేపలు అమ్ముకునే వారికి ఏసీ ఆటోలు ఇస్తామన్నారు. ప్రతి డివిజన్‌కు ఇరవై నాలుగ్గంటలు నడిచే ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement

విశ్వనగరమంటే…ఇది కాదని. మానవుని హక్కులు, వారి ఆరోగ్యానికి భధ్రత ఉండాలన్నారు. అది తమ పార్టీ అధికారంలోకి రాగానే చూసి చూపిస్తామన్నారు. నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామన్నారు. హైదరాబాద్‌ యూత్‌ స్టార్టప్‌ యూనిట్లు పెట్టుకునేలా వారికి రెండు లక్షల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు రుణాలిస్తామన్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరం లేదన్నారు.

రేవంత్‌రెడ్డి ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కారని, అవన్నీ అమలు కావడం లేదు.. మరి మనం ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రజలను ప్రశ్నించారు కవిత. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించాలని, పోరాడాలని, సమస్యలు పరిష్కారం అయ్యేవరకు వదలొద్దన్నారు. ఇదే తమ పార్టీ నినాదమని, యువత తమ పార్టీతో కలిసి రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గ్రేటర్‌ పరిధిలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా.. అక్కడ తమ పార్టీ లీడర్లు ఉంటారని, గల్లీ గల్లీలో తిరిగి మమేకమవుతారని, వారి మనసు గెలుచుకుని ఎన్నికల్లో గెలుపొందుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు కవిత.

Tags

Related News

కేటీఆర్‌ నోట మళ్లీ థర్ట్‌ ఫ్రంట్‌ మాట..! నాన్న కోసం నేషనల్‌ రాజకీయాలు ఎదురుచూస్తున్నాయట..! మళ్లీ చక్రంతిప్పనున్నారట!

జగన్ దూకుడు.. ఏ ధైర్యంతో అలా చేస్తున్నారు?

బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేస్తానని పదే పదే శపథం! అధికార పార్టీకన్నా ప్రతిపక్ష పార్టీపైనే ఎక్కువ ఫోకస్!

తెలుగు రాష్ట్రాల్లో సన్నవడ్లకు రికార్డు గిరాకీ.. ఎన్నడూ లేనంతగా ధర ఇచ్చి కొంటున్న పొరుగు రాష్ట్రాల దళారులు..!

భారీగా పెరిగిన సోనా మసూరి, బీపీటీ బియ్యం ధరలు.. క్వింటల్ ఎంతో తెలుసా?

తెలంగాణలో సోలార్ గ్రామాల ప్రాజెక్ట్ సిద్దం.. ఇందులో మీఊరి పేరు ఉందా..?

రేవంత్ సర్కార్‌పై BRS కరెంట్ వార్.. క్షేత్రస్థాయిలోకి హరీష్ రావు టీమ్!

Big Stories

Advertisement
×