E-Paper
Advertisement

Iran Warning Trump: ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్.. మూల్యం తప్పదని ఘాటు హెచ్చరిక

Iran Warning Trump: ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్..  మూల్యం తప్పదని ఘాటు హెచ్చరిక
Advertisement

Iran Warning Trump: ఇరాన్-అమెరికా వార్ నేపథ్యంలో ప్రతీరోజు మీడియా ముందుకొస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇక ఇరాన్ పనైపోయిందని ఒకసారి, వారి సైన్యం తోక ముడిచిందని మరోసారి ఇలా రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్‌గా కౌంటరిచ్చింది ఇరాన్. ట్రంప్ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

Advertisement

ఇరాన్-అమెరికాల మధ్య యుద్ధం మొదలై వారం గడిచిపోయింది. రెండోవారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆయా దేశాలు యుద్ధం వ్యూహాన్ని మార్చాయి. ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజాని మరోసారి కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు. ఇరాన్‌ సుప్రీం ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.

ఖమేనీకి అత్యంత సన్నిహితుల్లో అలీ లారిజానీ కూడా ఒకరు. తమ నాయకుడి మృతికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు. ట్రంప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని తేల్చి చెప్పేశారాయన. అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో అగ్రనాయకుడితోపాటు అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ప్రస్తావించారు.

Advertisement

తగిన మూల్యం తప్పదని అలీ లారిజాని ఘాటు హెచ్చరిక

ఇది సాధారణ విషయం కాదని, తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని రాసుకొచ్చారు. ఈ ప్రాంతంలో అమెరికా-ఇజ్రాయెల్‌ స్థావరాలపై మా దాడులు కొనసాగుతున్నాయని అన్నారు. వారికి తాము తీవ్ర నష్టాలను కలిగించామని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో వెనిజులాలో అమెరికా సైన్యం ప్రమేయాన్ని ప్రస్తావించారు. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించడానికి దారి తీసిందన్నారు.

వెనిజులా మాదిరిగా తక్కువ సమయంలో యుద్ధాన్ని ముగించాలని అమెరికా భావించినప్పటికీ అది విఫలమైందన్నారు. యుద్ధం నేపథ్యంలో అనేకమంది అమెరికా సైనికులను బంధించామని మరో పోస్టులో రాసుకొచ్చారు. వారిని జైళ్లలో ఉంచామన్నారు. ఇరాన్‌ దాడుల్లో ఆరుగురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారంటూ ట్రంప్‌ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు.

ALSO READ: నార్వే రాజధాని ఓస్లో.. యూఎస్ ఎంబసీ వద్ద పేలుడు

ఆ దేశ ప్రభుత్వ అబద్ధాలు, మోసాలకు మరో నిదర్శనమన్నారు. నిజానికి అమెరికా సైనికులు దాదాపు 500 కంటే ఎక్కువ మంది చనిపోయారని అన్నారు. చాలా మంది అమెరికా సైనికులను ఖైదీలుగా తీసుకున్నట్లు తెలిపారు. కానీ అమెరికా మాత్రం చంపామని చెబుతున్నారని వివరించారు. సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేరని అన్నారు. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రకటనలను లారిజానీ కౌంటర్ ఇవ్వడం ఇది రెండోసారి.

Related News

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

Big Stories

Advertisement
×