BigTV English
Advertisement

Chevireddy Bhaskar Reddy: ఇవేం పనులు చెవిరెడ్డి పరువు తీస్తున్నావు.. వైసీపీ సీరియస్

Chevireddy Bhaskar Reddy: ఇవేం పనులు చెవిరెడ్డి పరువు తీస్తున్నావు.. వైసీపీ సీరియస్

మాజీ మంత్రి గల్లా అరుణ కూమారి అనుచరుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనదైన శైలిలో చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయం నడిపారు.. విభజించి పాలించే పద్ధతితో హడావుడి చేశారు . అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న టైపులో ఆయన వ్యవహారం నడిచింది. జగన్ హయాంలో ఆర్థికంగా కూడా బలోపేతం అయ్యారు. ఏపీ, తెలంగాణల్లో వైసీపీ, బీఆర్ఎస్‌ నేతలకు ఆప్తుడిగా వ్యవహరించాడు. సోషల్ మీడియాలో సొంత వ్యవస్థ ఏర్పాటు చేసుకుని సర్వేల పేరుతో రెండు పార్టీల అధోగతికి కారణమైన లీడర్ ఆయన

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాను అనుకున్నది అనుకున్నట్లు చేసిన చేవిరెడ్డికి .. అధికారం కోల్పోవడంతో బ్యాడ్ టైమ్ స్టార్ అయిందన్న టాక్ నడుస్తుంది. దానికి తగ్గట్లే సోషల్ మీడియా వేదికగా ఆయన వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు ఇప్పుడు బూమరాంగ్ అవుతున్నాయి . అసలక్కడ ఏమీ లేకుండానే.. కూటమి ప్రభుత్వ పాలనలో ఏదో జరిగిపోతుంది, బ్రహ్మాండం బద్దలు అయిపోతుందన్నట్లు ఆయన టీమ్ పెడుతున్న పోస్టులు ఆయనకే రివర్స్ అవుతూ సొంత పార్టీలో కూడా పరువు పోగొట్టుకుంటున్నారు.


ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి అంటూ తన టీమ్‌తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారు. అయితే ఎక్కడా ఎలాంటి అలికిడి లేకపోవడంతో సైలెంట్ అయ్యారు. మరోవైపు జిల్లాలోని ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువైందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారు. చివరకు దానికి సంబంధించి సోషల్ మీడియా అడ్మిన్ ల మీద కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చింది.

Also Read: జగన్, షర్మిల పంచాయితీ.. పవన్ తేలుస్తాడా..

తాజాగా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ హయాంలో నియమితులై ఇప్పటికీ పనిచేస్తున్న అధికారుల బదిలీలు జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తన వాడంటూ ఒక్కరు కూడా నియోజకవర్గంలో లేకపోవడంతో చెవి రెడ్డి ఇబ్బంది పడిపోతున్నారంట. దాంతో పాటు ఓటర్ల జాబితాకు సంబంధించిన కేసుతో పాటు తుడా నిధుల దుర్వినియోగంపై జరుగుతున్న విచారణలు కూడా తలనొప్పిగా మారుతున్నాయి . నకిలీ ఓటర్ల నమోదు కేసుపై సిఐడి విచారణ జరుగుతుంది.

ఓటర్ల జాబితా అవకతవకల్లో చెవిరెడ్డికి సహకరించిన అధికారులను ప్రభుత్వం పక్కన పెట్టింది. సీఐడీ విచారణతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వారంతా.. మీ వల్ల మేము ఇబ్బంది పడుతున్నామంటూ చెవిరెడ్డి చుట్టూ తిరుగుతూ మొత్తుకుంటున్నారంట. వాళ్లంతా అప్రూవర్లుగా మారితే తన పరిస్థితి ఏంటని టెన్షన్ పడిపోతున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కి తెరలేపుతన్నట్లు కనిపిస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టడానికి, ముఖ్యంగా ఎమ్మెల్యే పులివర్తి నాని కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకొని సోషల్ మీడియాలో రాజకీయం మొదలు పెట్టారు.

తాజాగా ఎర్రవారిపాలెం మండలంలో మైనర్ బాలిక పై అత్యాచారం జరిగిందని హడావిడి చేశారు. పదో తరగతి విద్యార్థిని పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా ఏదో గొడవ జరిగితే ఆ అమ్మాయిపై అత్యాచారం జరిగిందని వైసీపీ సోషల్ మీడియా తెగ హడావుడి చేసింది. చెవిరెడ్డికి చెందిన వైసిపి సోషల్ మీడియాలో ఆ అసత్య ప్రచారం మొదలవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒకింత కలకలం రేగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏదైనా దుర్ఘటనలు జరిగితే మైనర్ బాలిక సంబంధించిన ఫోటోలు గాని వీడియోలు గాని బహిర్గతం చేయకూడదు.

అయితే చెవి రెడ్డికి సంబంధించిన సోషల్ మీడియాలో ఎర్రవారిపాలెం కు చెందిన బాలిక వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేశారు. అమ్మాయిపై అత్యాచారం జరిగిపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.. ఈ నేపథ్యంలో రుయా ఆసుపత్రికి లో అమ్మాయికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే ఎలాంటి అత్యాచారం జరగలేదు.. కేవలం దాడి మాత్రమే జరిగిందని నిర్ధారించారు. అయితే అప్పటికే పెద్ద సంఖ్యలో వైసీపీనేతలు ఆస్పత్రి వద్ద చేరుకొని హడావిడి చేశారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, తిరుపతి ఇన్చార్జి భూమన అభినయ్ రెడ్డి ,మాజీమంత్రి రోజా, చెవిరెడ్డి చిన్న కుమారుడు దగ్గరుండి వ్యవహారాన్ని నడిపించారు.

అమ్మాయిని పరామర్శించిన వీడియోలను తెగ ఫోకస్ చేసుకున్నారు. అయితే ఎస్పీతో పాటు ప్రజా సంఘాలు వైసిపి తీరును తప్పు బట్డాయి‌. ఎస్పీ అయితే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు . ఈ యావత్తు తతంగానికి చెవిరెడ్డి టీమ్ సోషల్ మీడియాలో ప్రదర్శించిన అత్యుత్సాహమే కారణమని చివరికి తేలడంతో వైసీపీ పెద్దలు ఆయన్ని చీవాట్లు పెట్టారంట. హడావుడిగా ఆందోళన పేరుతో రోడ్డెక్కిన వైసీపీ నేతలు కూడా చెవిరెడ్డి నిర్వాకంపై చిర్రుబుర్రులాడారంట. అది ముందే ఎక్స్‌పెక్ట్ చేశారేమో చెవిరెడ్డి మాత్రం ఆ తతంగం నడిచినప్పుడు రుయా అసుపత్రి చుట్టుపక్కలకు కూడా రాలేదు.

 

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Big Stories

×