Anushka Shetty: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సత్తా చాటిన హీరోయిన్లలో అనుష్క శెట్టి( Anushka Shetty ) కూడా ఒకరు. సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ తో ఫుల్ బిజీ అయ్యింది. అరుంధతి సినిమాతో జేజమ్మగా మారింది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనుష్క టాలీవుడ్ జేజమ్మ అయ్యింది.. ఆ తర్వాత ఈమె బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమాలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో వెనక్కి చూడకుండా కొన్ని సినిమాలు చేసింది. అందులో ఏ ఒక్క సినిమా మంచి టాక్ ను ఇవ్వలేక పోవడంతో తెలుగులో కాస్త గ్యాప్ తీసుకొని నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా చేసింది. ఇప్పుడు మరో రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతుంది..
నేడు అనుష్క పుట్టినరోజు సందర్బంగా ఆమె నటిస్తున్న సినిమాల నుంచి పోస్టర్స్, టీజర్ ను ఒకేసారి రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ”ఘాటీ”. ‘వేదం’ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న సినిమా ఇది. అనుష్క పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ తాజాగా ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్ డిఫరెంట్ గా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే ఈరోజు సాయంత్రం ఈ మూవీ నుంచి టీజర్ రాబోతున్నట్లు ప్రకటించారు.. పోస్టర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చెయ్యగా, టీజర్ లో అనుష్క ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. అనుష్క నటిస్తున్న మరో సినిమా నుంచి అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.. డిఫరెంట్ హారర్ సినిమాతో అనుష్క శెట్టి సిద్ధమవుతోంది. ‘కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్’ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది అనుష్క శెట్టి. ఈ ఫాంటసీ హారర్ డ్రామాగా వస్తున్న కథనార్ సినిమాకు రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమత్తత్తు కథనార్ కథల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ మూవీ నుంచి మోషన్ పోస్టర్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అనుష్క చాలా అందంగా ఉంది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఎలా ఉందో మీరు ఒకసారి చూసేయ్యండి.. ఇక సినిమాను చూస్తుంటే మరో అరుంధతి సినిమా గుర్తుకు వస్తుంది. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న కథానార్ మూవీని మొత్తం 14 భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. 2024లో కథనార్ పార్ట్ 1 విడుదల కానుందని మేకర్స్ తెలిపారు.