Stranger Things Season 5 : ప్రస్తుతం ఓటీటీల హవా పెరగడంతో సినిమాల కంటే ఎక్కువగా కొన్ని వెబ్ సిరీస్ లే మోస్ట్ అవైటెడ్ గా నిలిస్తున్నాయి. అందులో ‘స్ట్రేంజర్ థింగ్స్’ (Stranger Things) కూడా ఒకటి. ‘స్ట్రేంజర్ థింగ్స్’ (Stranger Things Season 5) సిరీస్ లో రాబోతున్న 5వ సీజన్ గురించి ఓటిటి లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ రిలీజ్ డేట్ తో పాటు మరిన్ని సర్ప్రైజ్ లను ప్రకటించి ‘స్ట్రేంజర్ థింగ్స్’ సిరీస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు నిర్మాతలు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ గురించే టాక్ నడుస్తోంది.
‘స్ట్రేంజర్ థింగ్స్’ సిరీస్ ఫ్రాంచైజీలో చివరి సీజన్ అయిన 5వ సీజన్ (Stranger Things Season 5) 2025లో తిరిగి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. నవంబర్ 6న “ఇన్ ది ఫాల్ ఆఫ్ 1987” పేరుతో ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5′ (Stranger Things Season 5)కి సంబంధించిన కొత్త టీజర్ విడుదలైంది. ఇదే చివరి సీజన్ కావడంతో అంచనాలు నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ అండ్ డఫర్ బ్రదర్స్ ఈ సిరీస్‌కి సంబంధించి చాలా అప్‌డేట్‌లను తాజాగా టీజర్ ద్వారా వెల్లడించారు. 5 ఎపిసోడ్‌ల టైటిల్స్‌తో పాటు చివరిగా విడుదల తేదీని టీజర్‌లో ప్రకటించారు. ఎపిసోడ్స్ టైటిల్స్ విషయానికి వస్తే.. ది క్రాల్’, ది వానిషింగ్ ఆఫ్, ది టర్న్‌బో ట్రాప్, ది సోర్సెరర్, షాక్ జాక్, ఎస్కేప్ ఫ్రమ్ కామజోట్జ్, ది బ్రిడ్జ్, ది రైట్‌సైడ్ అప్ అని పెట్టారు. ఇక్కద విశేషం ఏమిటంటే టైటిల్స్ అన్నీ అభిమానుల్లో ఒకరకమైన ఉత్కంఠను రేకెత్తించాయి. రెండవ టైటిల్ ది వానిషింగ్ ఆఫ్ ___, భిన్నమైన క్యూరియాసిటీని సృష్టించింది. ఎవరు వస్తారో, ఎవరు మాయమవుతారో అని ఇప్పుడు అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి టీజర్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
‘స్ట్రేంజర్ థింగ్స్’ సిరీస్‌లో బాబీ బ్రౌన్, నటాలియా పోర్ట్‌మన్, ఫిన్ వోల్ఫార్డ్, జో కేరీ తదితరులు నటించారు. ఇప్పటి వరకు నాలుగు సీజన్లు వచ్చాయి. వాటిని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇంతకుముందు ఒక BTS వీడియోను విడుదల చేసినప్పుడు విల్ బైర్స్ పాత్రలో నటించిన నోహ్ ష్నాప్ సిరీస్ గురించి తన ఉత్సాహాన్ని పంచుకున్నాడు. వచ్చే సీజన్ అత్యుత్తమ సీజన్‌గా నిలుస్తుందని అన్నారు. ఈ సిరీస్ నిర్మాతలు డఫర్ బ్రదర్స్ ఇటీవలే సగం షూటింగ్ పూర్తి చేశామని వెల్లడించారు. ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ (Stranger Things Season 5) షూటింగ్ 2024 క్రిస్మస్ నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.
‘స్ట్రేంజర్ థింగ్స్’ (Stranger Things) అనేది ఒక అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హారర్ డ్రామా సిరీస్. ఈ సిరీస్ మొదటి సీజన్ 2016 15 జూలై 15న విడుదలైంది. రెండవ సీజన్ 2017లో వచ్చింది. మూడవది 2019లో, నాల్గవది 2022లో వచ్చింది. ఇప్పుడు దాని చివరి సీజన్ వచ్చే ఏడాది రాబోతోంది. అయితే ‘స్ట్రేంజర్ థింగ్స్’లో ఇదే చివరి సీజన్ కాబోతోంది.