E-Paper
Advertisement

అదిరిపోయిన బిగ్ బాస్ 10 హౌస్.. మ్యాజిక్ కీతో ఆటను మలుపు తిప్పిన నాగార్జున!

అదిరిపోయిన  బిగ్ బాస్ 10 హౌస్.. మ్యాజిక్ కీతో ఆటను మలుపు తిప్పిన నాగార్జున!
Advertisement

Bigg Boss 10 Telugu Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కార్యక్రమం మరికొన్ని గంటలలో ప్రారంభం కాబోతోంది ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా నాగార్జున స్టైలిష్ లుక్ లో ఎంట్రీ ఇస్తూ.. ఈరోజు బిగ్ బాస్ దశాబ్దంలోకి అడుగు పెట్టింది. దశావతారంగా మారింది.. అధ్యాయం కొత్తది, అవతారం గొప్పది అంటూ గొప్ప ఎలివేషన్స్ ఇస్తూ ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ఒక రోబోతో కలిసి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున (Nagarjuna)అక్కడ ఉన్న మ్యాజికల్ రూమ్ ని చూస్తూ చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఇదివరకు ఏ సీజన్లో కూడా ఇలాంటి కాన్సెప్ట్ తాను చూడలేదని తెలిపారు.

ఆటో రాంప్రసాద్ కు నో ఎంట్రీ..

లక్షల అప్లికేషన్లు దాటుకొని ఎన్నో పరీక్షలు తట్టుకొని టాప్ 13 అగ్నిపరీక్ష కంటెస్టెంట్లు మన ముందు ఉన్నారు అంటూ అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్ ను చూపిస్తూ వారితో కలిసి నాగార్జున ముచ్చటించారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా స్టేజ్ పైకి దేబ్జానీ, సుధీర్ రెడ్డి, ఝాన్సీ వంటి వారితో నాగార్జున మాట్లాడే హౌస్ లోకి పంపించారు. ఇక ఈ ప్రోమోలో భాగంగా నాగార్జున ఒక కీ చూపిస్తూ ఇది వాళ్ళ తలరాతను మారుస్తుంది దీని పేరే మ్యాజిక్ కీ. మీ టాలెంట్ బట్టే ఉంటుంది అంటూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నలుగురు కంటెస్టెంట్లకు టాస్క్ ఇవ్వటం గమనార్హం. ఒక కంటెంట్ స్టేజ్ పైన ఎంటర్టైన్మెంట్ చేయని నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ లేదు వెనక్కి వెళ్ళిపోవచ్చు అంటూ పంపించారు ఆ కంటెస్టెంట్ ఆటో రాంప్రసాద్ అని తెలుస్తుంది. అయితే ఇదంతా నిజం కాదని ప్రోమో స్టంట్ అని తెలుస్తుంది. ఇక్కడ కూడా ఆటో రాంప్రసాద్ ఫేస్ రివీల్ చేయకపోవడం గమనార్హం.

నాగార్జున పై పంచ్ వేసిన కార్తీ..

Advertisement

ఇక ఈ ప్రోమో వీడియోలో భాగంగా బిగ్ బాస్ వేదికపైకి సర్దార్ 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా నటుడు కార్తి, ఆర్ సూర్య కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక కార్తి స్టేజ్ పైకి రాగానే ఈ సినిమాలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నారు అంటూ నాగార్జున అడగడంతో వెంటనే కార్తీ(Karthi) అన్నయ్యకు హీరోయిన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంటూ తనదైన శైలిలోని పంచ్ వేశారు. ప్రోమో చివరిలో భాగంగా కేవలం తెలుగు బిగ్ బాస్ గురించి మాత్రమే కాకుండా తమిళ ,కన్నడ, మలయాళ బిగ్ బాస్ హోస్టులను కూడా వర్చువల్ గా చూపించి సర్ప్రైజ్ చేశారు.

Advertisement

ఈ నాలుగు భాషలలో కూడా బిగ్ బాస్ కార్యక్రమం ఈరోజు ప్రారంభం కాబోతుండడం విశేషం. ఇక ఈ కార్యక్రమంలోకి గుప్పెడంత మనసు రిషి, వినాయకుడు ఆటో రాంప్రసాద్ తో పాటు సుధీర్ రెడ్డి వంటి కంటెస్టెంట్లు అందరినీ కూడా చూపించారు అయితే కొంతమంది ఫేస్ రివిల్ చేయకపోయినప్పటికీ వారిని చాలా సునాయసనంగా గుర్తించవచ్చు. మరికొంత సేపట్లో ప్రారంభం కాబోతున్న ఈ కార్యక్రమం ప్రేక్షకులకు పదింతల వినోదాన్ని అందిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న అక్కినేని హీరో… ఇప్పటీకి బాధగా ఉందంటూ!

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Big Stories

Advertisement
×