E-Paper
Advertisement

అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న అక్కినేని హీరో… ఇప్పటీకి బాధగా ఉందంటూ!

అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న అక్కినేని హీరో… ఇప్పటీకి బాధగా ఉందంటూ!
Advertisement

Akkineni Sumanth : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా కథను ఒక హీరోని ఉద్దేశించి సిద్ధం చేస్తే కొన్ని కారణాలవల్ల ఆ హీరోలు ఆ కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది హీరోలు బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నారు. ఇలా మిస్ చేసుకున్న సినిమాల విషయంలో ఇప్పటికీ కొంతమంది హీరోలు ఎంతో పశ్చాత్తాప పడుతూ ఉంటారు. తాజాగా అక్కినేని సుమంత్ సైతం కొన్ని సినిమాలను రిజెక్ట్ చేయడంతో ఇప్పటికి బాధపడుతున్నానని తెలిపారు.

సుమంత్ మహేంద్రగిరి వారాహి..

అక్కినేని కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమంత్(Sumanth) గత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఇటీవల ఈయన వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇక త్వరలోనే సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన మహేంద్రగిరి వారాహి(Mahendrgiri Varahi) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 11వ తేదీ విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు సుమంత్ తన కెరియర్ గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు.

తాతయ్య సొంత కొడుకులా పెంచారు…

Advertisement

చిన్నప్పుడే అమ్మానాన్నలు అమెరికా వెళ్లి స్థిరపడటంతో తాతయ్య నాగేశ్వరరావు తనని పెంచి సొంత కొడుకు లాగా చూసుకున్నారని తెలిపారు. తాతయ్య గారి నుంచి తాను ఎన్నో మంచి విషయాలను నేర్చుకున్నానని తెలిపారు. తన మామయ్య నాగార్జున గురించి కూడా మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సినిమాలకు సంబంధించి ఎన్నో విషయాలను సలహాలను మామయ్య ద్వారా నేర్చుకున్నానని తెలియజేశారు. మామయ్య సలహాలు తనకు కెరియర్ పరంగా చాలా ఉపయోగపడ్డాయని సుమంత్ తెలిపారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన కెరియర్ లో వదులుకున్న సినిమాల గురించి కూడా సుమంత్ ప్రస్తావనకు తీసుకువచ్చారు.

నువ్వే కావాలి కథ బాగా నచ్చింది..

తనకు తరుణ్ హీరోగా నటించిన నువ్వే కావాలి సినిమాలో మొదట అవకాశం వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల “నువ్వే కావాలి” (Nuvvekavali)సినిమా చేయటానికి వీలుకాని నేపథ్యంలో రిజెక్ట్ చేశానని తెలిపారు. ఈ సినిమా కథ నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి ఒక మంచి సినిమాని వదులుకోవడం ఇప్పటికి చాలా బాధ కలిగిస్తుందని సుమంత్ తెలియజేశారు. అదే విధంగా అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేశముదురు(Desamuduru) సినిమా స్టోరీ కూడా ముందు తనకే చెప్పారని అయితే ఈ పాత్రకు తాను సూట్ అవ్వనని అనిపించి రిజెక్ట్ చేసినట్టు తెలిపారు. ఈ పాత్రలో నేను కనుక నటించి ఉంటే అల్లు అర్జున్(Allu Arjun) తో వచ్చినంత క్రేజ్ బహుశా నేను చేసి ఉంటే వచ్చేది కాదేమో అంటూ సుమంత్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: కళ్ళుచెదిరే రేంజ్ లో ” వారణాసి” తెలుగు థియేట్రికల్ బిజినెస్.. టాలీవుడ్ లోనే హైయెస్ట్!

Related News

సూరి, సుహాస్ ‘మండాడి’ ట్రైలర్ రిలీజ్!

ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటి పనులు చేస్తా – అక్కినేని సుమంత్

కళ్ళుచెదిరే రేంజ్ లో ” వారణాసి” తెలుగు థియేట్రికల్ బిజినెస్.. టాలీవుడ్ లోనే హైయెస్ట్!

సినిమా ఖర్చుల్లో బిగ్ స్కామ్?.. బోగస్ బిల్లులతో కోట్ల గోల్‌మాల్!

హ్యాపీ బర్తడే మోక్షజ్ఞ.. కొత్త మూవీ అనౌన్స్మెంట్ కి ఈ రోజైనా మోక్షం లభిస్తుందా?

తమిళ్ ఇండస్ట్రీలో మళ్లీ ‘మీటూ’ మంటలు.. బాంబు పేల్చిన సింగర్!

డిజాస్టర్ హీరోయిన్ తో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ… సాహసం చేస్తున్న నందమూరి హీరో?

Big Stories

Advertisement
×