Engineer Backlogs Huge Salary| చాలామంది మంచి మార్కులు, ప్రముఖ కాలేజీలు ఉంటేనే కెరీర్‌లో విజయం సాధించగలమని భావిస్తారు. కానీ ఈ ఇంజనీర్ కథ ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంది. 11 బ్యాక్‌లాగ్స్, నెలకు కేవలం రూ.8,000 జీతంతో ప్రారంభమైన ఆయన ప్రయాణం, పట్టుదల, సరైన నిర్ణయాలతో చివరకు రూ.50 లక్షల ప్యాకేజీ వరకు చేరుకుంది.
రెడ్డిట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక టైర్-3 కాలేజీలో చదువుకున్న ఒక యువకుడు 11 సబ్జెక్టుల్లో ఫెయిలైనా పట్టుదలతో ఈ రోజు ఒక అమెరికన్ కంపెనీలో సీనియర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. పైగా ఆయన ప్యాకేజీ అక్షరాల రూ.50 లక్షలు. వినడానికి ఆసక్తకరంగా ఉన్న దీని వెనుక ఎంతో కృషి ఉంది.
ఆ ఇంజనీర్ ఒక టైర్-3 కాలేజీలో చదువుకున్నారు. చదువు సమయంలో ఆయనకు అనేక సబ్జెక్టుల్లో బ్యాక్‌లాగ్స్ వచ్చాయి. చివరి సంవత్సరానికి వచ్చేసరికి మొత్తం 11 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. ఫైనల్ సెమిస్టర్‌లో ఆరు బ్యాక్‌లాగ్స్ ఆయన క్లియర్ చేశారు. తర్వాత లక్నోలోని ఒక చిన్న స్టార్టప్‌లో ఎంబెడెడ్ డెవలపర్‌గా ఉద్యోగం ప్రారంభించారు. అయితే, అప్పటికి మరో ఐదు బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేయాల్సి ఉంది. ఉద్యోగం చేస్తూనే పరీక్షలకు సిద్ధమయ్యారు. ఆరు నెలల్లో మిగిలిన ఐదు బ్యాక్‌లాగ్స్ కూడా విజయవంతంగా క్లియర్ చేశారు. చివరకు 2022లో తన ఇంజినీరింగ్ డిగ్రీని పూర్తి చేశారు.
ఇంజినీరింగ్ సమయంలో ఆయనకు బ్యాక్‌లాగ్స్ ఉన్నా.. ఎలాగైనా సరే ఉద్యోగం పొందాలనే పట్టుదలతో ఆయన ఒక జాబ్ సాధించాడు. కానీ జీతం మాత్రం రూ.8,000. మొదటి ఉద్యోగంలో ఎక్కువ జీతం కంటే అనుభవం, నేర్చుకోవడం ముఖ్యమని ఆయన భావించారు. లక్నో స్టార్టప్‌లో దాదాపు 11 నెలలు పనిచేశారు. ఈ సమయంలో ఎంబెడెడ్ సిస్టమ్స్, డివైస్ డ్రైవర్స్ పై పని చేశారు.
అలాగే యాక్టో, కస్టమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్‌మెంట్‌పై అనుభవం సంపాదించారు. డివైస్ ఫ్లాషింగ్ వంటి టెక్నికల్ పనులను కూడా నేర్చుకున్నారు. ఈ అనుభవం తరువాతి కెరీర్‌లో ఆయనకు ఎంతో ఉపయోగపడింది.
తర్వాత ఆయన హైదరాబాద్‌లో సుమారు రూ.6 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం పొందారు. అయితే, ఆ ఉద్యోగంలో పని ఎక్కువగా సైబర్‌సెక్యూరిటీ వైపు మారింది. ఆయనకు ఎంబెడెడ్ సిస్టమ్స్, లినక్స్ పై మరింతగా పనిచేయాలనే ఆసక్తి ఉండేది. అందుకే తన టెక్నికల్ ఆసక్తులకు సరిపోయే మరో అవకాశాన్ని ఎంచుకున్నారు.
తర్వాత ఆయన బెంగళూరులోని ఒక గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలో చేరారు. అక్కడ టెలివిజన్, గేమింగ్ కన్సోల్ విభాగాల్లో పనిచేశారు. ఆ సమయంలో ఆయన వార్షిక ప్యాకేజీ సుమారు రూ.8 లక్షలకు చేరింది. దాదాపు మూడున్నర సంవత్సరాలు అక్కడ పనిచేస్తూ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. అనుభవం పెరిగేకొద్దీ ఆయన ప్యాకేజీ సుమారు రూ.12 లక్షలకు చేరింది.
తర్వాత ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చి ఒక ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీలో చేరారు. ఈ ఉద్యోగంతో ఆయన ప్యాకేజీ సుమారు రూ.20 లక్షలకు పెరిగింది. అక్కడ కొరియన్ ఆటోమొబైల్ కంపెనీతో కూడా పనిచేసే అవకాశం వచ్చింది. అయితే, టెక్నికల్‌గా ఎదగడానికి సరైన అవకాశాలు లేవని భావించి నాలుగు నెలలకే ఉద్యోగం మార్చారు. తన కెరీర్ లక్ష్యాలకు ఉపయోగపడే అవకాశాల కోసం ఆయన ప్రయత్నం కొనసాగించారు.
Also Read: లారీ డ్రైవర్ కుమారుడు.. కాలేజీ చదువులో ఫెయిల్.. కట్ చేస్తే రూ.800 కోట్ల కంపెనీ ఓనర్
కెరీర్ కోసం ఆయన చేసిన కఠిన ప్రయత్నాల వల్ల చివరకు ఒక అమెరికా కంపెనీలో సీనియర్ ఇంజినీర్ ఉద్యోగం లభించింది. ఈ ఉద్యోగంలో ఆయనకు సుమారు రూ.50 లక్షల ప్యాకేజీ లభించింది.
రూ.8,000 నెలవారీ జీతంతో ప్రారంభమైన కెరీర్ ఇప్పుడు భారీ స్థాయికి చేరుకుంది. తన విజయానికి నిరంతర అభ్యాసం, పట్టుదల, అనుభవం, సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆయన రెడ్డిట్ పోస్ట్‌లో వివరించారు.
ఆయన ప్రయాణం.. చదువులో ఎదురైన సమస్యలు కెరీర్ విజయాన్ని నిర్ణయించవని తెలియజేస్తోంది. ప్రారంభంలో వచ్చిన ఇబ్బందులు మన భవిష్యత్తును నిర్ణయించవని ఆయన కథ నిరూపిస్తోంది.
“మీ ప్రారంభ స్థానం మీ గమ్యాన్ని నిర్ణయించదు” అని ఆయన చెప్పిన మాటలు ఈ ప్రయాణానికి సరైన ఉదాహరణ
Also Read: లోన్ యాప్‌లో అప్పు తీసుకుంటున్నారా? జాగ్రత్త ఫేక్ యాప్స్‌తో ప్రమాదం.. ఈ జాగ్రత్తలు పాటించండి