Shreyas Iyer Dating Shahneel Gill: టీమిండియా కెప్టెన్ గిల్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో డేటింగ్ చేస్తుంటే… అతడి షహనీల్ గిల్ ( Shahneel Gill) మాత్రం ఇండియన్ క్రికెటర్ తో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీమిండియా టి20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తో షహనీల్ గిల్ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వార్తలు వారాలు అవుతున్నాయి. గిల్ కు తెలియకుండా ఈ ఇద్దరు దాదాపు రెండు నెలల నుంచి ప్రేమలో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ పబ్బులో ఇద్దరు స్టెప్పులు వేస్తూ.. సరదాగా గడిపిన వీడియో బయటకు వచ్చింది. దీంతో గిల్ సోదరితో శ్రేయస్ అయ్యర్ ప్రేమలో పడ్డాడని జోరుగా చర్చ మొదలైంది.
టీమిండియా క్రికెటర్, టి20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో అద్భుతంగా రాణించినందుకు గాను శ్రేయస్ అయ్యర్ కు టి20 కెప్టెన్సీ కూడా ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ క్రమంలో ఐర్లాండ్ తో పాటు ఇంగ్లాండ్ సిరీస్ లను శ్రేయస్ అయ్యర్ కోల్పోయాడు. కానీ జింబాబ్వేను మాత్రం చిత్తు చేసి, శ్రేయస్ అయ్యర్ టైటిల్ తీసుకొని వచ్చాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. ఈ గ్యాప్ లో సోదరి షహనీల్ గిల్ తో శ్రేయస్ అయ్యర్ కు పరిచయం పెరిగిందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు చర్చ మొదలైంది.
ఈ క్రమంలోనే దాదాపు రెండు నెలల నుంచి ప్రేమలో మునిగి తేలుతున్నారట. అయితే ఈ లేత ప్రేమ గురించి ఇప్పటి వరకు కూడా తెలియదని సమాచారం. అందుకే ఈ విషయాన్ని చాలా గోప్యంగా శ్రేయస్ అయ్యర్ అలాగే గిల్ సోదరి దాస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. సమయం అలాగే సందర్భం చూసి కెప్టెన్ గిల్ కు ఈ విషయం చెప్పేందుకు శ్రేయస్ అయ్యర్ కూడా సిద్ధంగా ఉన్నాడట. టీమిండియాలో తన స్థానం పదిలం చేసుకున్న తర్వాత ఈ విషయం రివీల్ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో ఈ ఇద్దరి ప్రేమాయణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో కెప్టెన్ గిల్ దాదాపు 6 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు రహస్యంగా హోటల్స్ అలాగే పబ్బుల్లో నిత్యం తిరుగుతున్నట్లు కూడా ఫోటోలు వీడియోలు బయటకు రావడం చూసాం. కానీ ఇప్పటి వరకు.. ఇద్దరి ప్రేమాయణం పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వార్తలను కూడా ఏ ఒక్కరు ఖండించలేదు. దీంతో ఎన్నటికైనా సారా, కెప్టెన్ గిల్ పెళ్లి చేసుకోవడం గ్యారెంటీ అని చర్చ జరుగుతోంది.