E-Paper
Advertisement

మనీ మేనేజ్‌మెంట్..పెళ్లైన మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన ఆర్థిక విషయాలివే!

మనీ మేనేజ్‌మెంట్..పెళ్లైన మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన ఆర్థిక విషయాలివే!
Advertisement

Financial independence: ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇల్లు, ఆఫీసు రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో చాలా మంది సాటిలేని మేధస్సును ప్రదర్శిస్తున్నారు. అయితే.. ఆర్థిక విషయాలకు వచ్చే సరికి చాలా మంది స్త్రీలు ఇప్పటికీ ఇతరులపై ఆధారపడటం లేదా కొన్ని అనవసరమైన పొరపాట్లు చేయడం కనిపిస్తుంది.సంపాదిస్తున్నా లేకపోయినా, ప్రతి మహిళకు ఆర్థిక స్వేచ్ఛ , అవగాహన ఉండటం చాలా ముఖ్యం. భవిష్యత్తులో వచ్చే అనూహ్య సవాళ్లను ఎదుర్కోవడానికి వివాహిత స్త్రీలు మానుకోవాల్సిన 4 ప్రధాన ఆర్థిక పొరపాట్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

మహిళలు చేసే.. 4 ప్రధాన ఆర్థిక పొరపాట్లు:

Advertisement

కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించే మహిళలు, తమ సొంత ఆర్థిక భవిష్యత్తును మాత్రం నిర్లక్ష్యం చేస్తారు.కేవలం భర్త లేదా తండ్రి మీద ఆధారపడకుండా.. ప్రతి మహిళ తన ఆర్థిక స్థితిగతులపై పట్టు సాధించాలి. సాధారణంగా మహిళలు చేసే 4 పెద్ద పొరపాట్లు ఇవే..

1. ఆర్థిక బాధ్యతలను పూర్తిగా భర్తకే వదిలేయడం:
చాలా మంది మహిళలు “మా వారు చూసుకుంటారులే” అని ఇంటి బడ్జెట్, పెట్టుబడులు, ఇన్సూరెన్స్ వంటి విషయాలను పట్టించుకోరు. ఇది మొదటి పెద్ద పొరపాట్లు. కుటుంబ ఆదాయం ఎంత? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? లోన్లు ఏమైనా ఉన్నాయా? వంటి ప్రాథమిక విషయాలు భార్యకు కచ్చితంగా తెలిసి ఉండాలి. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో భర్త లేని పక్షంలో.. ఆర్థిక అవగాహన లేకపోతే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Advertisement

2. తనకంటూ ఒక ప్రత్యేకమైన ‘ఎమర్జెన్సీ ఫండ్’ లేకపోవడం:
సాధారణంగా మహిళలు ఇంట్లో చిన్న చిన్న పొదుపులు (డబ్బాలో దాచుకోవడం వంటివి) చేస్తారు. కానీ.. అది సరిపోదు. కనీసం 6 నెలల ఇంటి ఖర్చులకు సరిపడా డబ్బును ‘ఎమర్జెన్సీ ఫండ్’ రూపంలో సిద్ధంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా గృహిణులు తమ వ్యక్తిగత అవసరాల కోసం లేదా మెడికల్ ఖర్చుల కోసం ఇతరులను అడగాల్సిన పని లేకుండా కొంత మొత్తాన్ని తమ పేరు మీద బ్యాంకులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

3.రిటైర్మెంట్ ప్లానింగ్, ఇన్సూరెన్స్‌ :
పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం పొదుపు చేసే మహిళలు, తమ సొంత రిటైర్మెంట్ గురించి ఆలోచించరు. వృద్ధాప్యంలో ఎవరిమీద ఆధారపడకుండా ఉండాలంటే.. ఇప్పటి నుండే చిన్న మొత్తంలో మ్యూచువల్ ఫండ్స్ లేదా పీపీఎఫ్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. అలాగే.. తన పేరు మీద కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవాలి. కేవలం భర్త పాలసీపైనే ఆధారపడటం సరైంది కాదు.

Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?.. ఈ యాడ్ ఆన్స్ తో మీ డబ్బు ఆదా?

4. ఆస్తులు, నామినీ వివరాలు:
ఇంటి డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయి? బ్యాంకు అకౌంట్లకు నామినీగా ఎవరి పేరు ఉంది? వంటి విషయాలను తెలుసుకోకపోవడం మహిళలు చేసే మరో పొరపాట్లు. ప్రతి బ్యాంకు ఖాతాకు, ఇన్సూరెన్స్ పాలసీకి నామినీ వివరాలు అప్‌డేట్ అయ్యేలా చూసుకోవాలి. వీలైతే ఆస్తులను భార్యాభర్తలు ఇద్దరి పేరు మీద తీసుకోవడం వల్ల భవిష్యత్తులో లీగల్ సమస్యలు రాకుండా ఉంటాయి.

డబ్బును కేవలం ఖర్చు చేయడం మాత్రమే కాకుండా.. దానిని పెంచడం,సేవ్ చేయడం కూడా మహిళలు నేర్చుకోవాలి. ఆర్థిక స్వతంత్రత అనేది కేవలం ఉద్యోగం చేసే మహిళలకే కాదు, ప్రతి గృహిణికి అవసరం. నేడే మీ ఆర్థిక పరమైన పొరపాట్లను సరిదిద్దుకోండి.

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×