E-Paper
Advertisement

Airtel Cheapest Plans 2026: మీకు తెలియని చౌకైన రీఛార్జ్ ప్లాన్స్.. ఫ్రీ ఓటీటీ, అపరిమిత కాల్స్.. రోజూ 2GB డేటా!

Airtel Cheapest Plans 2026: మీకు తెలియని చౌకైన రీఛార్జ్ ప్లాన్స్.. ఫ్రీ ఓటీటీ, అపరిమిత కాల్స్.. రోజూ 2GB డేటా!
Advertisement

Airtel Cheapest Plans 2026: దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల్లో భారతీ ఎయిర్ టెల్ ఒకటి. తోటి సంస్థలతో పోలిస్తే ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్స్ కాస్త ప్రియంగా ఉంటాయన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. బీఎస్ఎన్ఎల్, జియో, వొడాఫోన్ ఇండియాతో పోలిస్తే.. ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్, 5G డేటా ప్యాక్స్, ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ కాస్త ఖరీదైనవిగా అనిపిస్తుంటాయి. అయితే ఎయిర్ టెల్ తన యూజర్ల కోసం అతి చౌకైన ప్లాన్స్ ను సైతం అందిస్తోంది. అతి తక్కువ ఖర్చులో లభిస్తున్న ఎయిర్ టెల్ టాప్ – 5 రీఛార్జ్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

రూ.155 ప్లాన్.. కాల్స్ కు మాత్రమే

కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికి మాత్రమే ఈ ప్లాన్ ను ఎయిర్ టెల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 24 రోజుల వ్యాలిడితో అపరిమితంగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. నామమాత్రంగా 1GB డేటాను ఈ ప్లాన్ లో అందిస్తారు. అలాగే 300 ఎస్ఎంఎస్ లను ప్లాన్ మెుత్తం కాలానికి వినియోగించుకోవాల్సి ఉంటుంది.

రూ.199 బేసిక్ ఎంట్రీ ప్లాన్

Advertisement

తక్కువ బడ్జెట్ లో సిమ్ యాక్టివ్ గా ఉంచుకోవాలని భావించేవారికి ఈ ప్లాన్ కూడా మరో బెస్ట్ ఛాయిస్. 28 వ్యాలిడిటీతో ఎయిర్ టెల్ ఈ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. నిర్ణీత కాలం వరకూ అపరిమిక కాల్స్, 2GB డేటా (ప్లాన్ కాలానికి), ప్రతీరోజూ 100 ఎస్ఎంఎస్ లు పొందవచ్చు.

రూ. 299 రోజూవారి డేటా ప్లాన్

ప్రతిరోజూ కొంత డేటాతో పాటు అపరిమిత కాల్స్ కోరుకునేవారికి ఇది చాలా పాపులర్ ప్లాన్. 28 రోజుల వ్యాలిడిటి కలిగిన ఈ ప్లాన్ లో రోజూ 1.5GB డేటాను పొందవచ్చు. అలాగే రోజుకు 100 SMSలు, అపోలో 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.

రూ. 359 స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్

Advertisement

అపరిమిత కాల్స్, డేటాతో పాటు అదనపు ప్రయోజనాలు కోరుకునేవారి కోసం ఈ ప్లాన్ ను ఎయిర్ టెల్ లాంచ్ చేసింది. 30 రోజుల వ్యవధి కలిగిన ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే ప్రతీ రోజూ 2GB డేటా పొందొచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలతో పాటు అదనంగా ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ ప్లే సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. దీని ద్వారా ఓటీటీ కంటెంట్ ను ఉచితంగా చూసేందుకు వీలు కలుగుతుంది.

Also Read: Smart Fans Mar 2026: మార్చిలో రాబోయే ఏఐ స్మార్ట్ ఫ్యాన్లు.. వై-ఫై కనెక్టివిటీ, వాయిస్ అసిస్టెంట్.. నెక్ట్స్ లెవెల్ ఫీచర్లు భయ్యా!

రూ. 455 ప్లాన్ ఎక్కువ వ్యాలిడిటీ

తక్కువ డేటాతో ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునేవారు దీనిని పరిశిలించవచ్చు. దాదాపు 3 నెలల (84 రోజులు) వ్యాలిడిటీతో ఈ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. అపరిమిత కాల్స్, 6GB డేటా (ప్లాన్ మెుత్తానికి), 900 ఎస్ఎంఎస్ లు.. వినియోగదారులకు లభిస్తాయి. వైఫై వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Also Read: Budget Dishwashers Under 20000: తక్కువ బడ్జెట్‌లో.. ట్రెండింగ్ డిష్ వాషర్లు.. ఫీచర్లు, లాభాలు ఇవే!

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×