E-Paper
Advertisement

Jagan Mohan Reddy: చంద్రబాబుకు దేవుడంటే భయం లేదు.. భక్తి అస్సలే లేదు: జగన్

Jagan Mohan Reddy: చంద్రబాబుకు దేవుడంటే భయం లేదు.. భక్తి అస్సలే లేదు: జగన్
Advertisement

Jagan Mohan Reddy: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా దెబ్బతీశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అత్యంత నిష్ఠతో నిర్వహించాల్సిన టీటీడీ పరిపాలనను స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని ధ్వజమెత్తారు.

నిష్కలంక వ్యక్తిత్వం ఉండాల్సిన చైర్మన్ పదవిలో అనేక ఆరోపణలు ఉన్న వ్యక్తిని కూర్చోబెట్టడం ఆలయ పవిత్రతను కాలరాయడమేనని విమర్శించారు. ఒక మహిళ తనను మోసం చేశాడంటూ ఎన్నికలకు ముందే ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా.. అదే వ్యక్తిని చైర్మన్‌గా నియమించడం చంద్రబాబు నైజానికి నిదర్శనమని జగన్ ఆక్షేపించారు.

Advertisement

లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని జగన్ ఆరోపించారు. నెయ్యి నాణ్యత బాగోలేదని టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా.. అవే ట్యాంకర్లు మళ్లీ చంద్రబాబు హయాంలోనే వేరే పేర్లతో లోపలికి రావడం దురదృష్టకరమన్నారు. ఈ విషయాన్ని సీబీఐ సమర్పించిన చార్జిషీట్లలో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు. తాను తప్పులు చేస్తూ వాటిని ఇతరుల మీదకు నెట్టి రాజకీయ దుమారం రేపడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. దేవుడి పట్ల భయం.. భక్తి లేని వారు మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు.

తిరుమల లడ్డూ నెయ్యి సరఫరాను చంద్రబాబు తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. 2014-24 మధ్య కాలంలో కిలో నెయ్యి ధర సుమారు రూ. 300 వరకు ఉండగా.. ఇప్పుడు తన సొంత సంస్థ హెరిటేజ్‌కు చెందిన ఇందాపూర్ డెయిరీకి రూ. 658లకు కట్టబెట్టారని విమర్శించారు.

Advertisement

కిలోపై భారీగా లాభాలు ఆర్జిస్తూ టీటీడీ ఖజానాకు గండి కొడుతున్నారని మండిపడ్డారు. భక్తి, శ్రద్ధ, నిష్ఠ లేని చంద్రబాబు పాలనలో తిరుమల ప్రతిష్ట దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తన వ్యాపార ప్రయోజనాల కోసమే లడ్డూ నెయ్యిపై రాజకీయ కుట్రలు చేస్తున్నారని జగన్ స్పష్టం చేశారు.

Read Also: ఏపీ మండలిలో లడ్డూ రగడ.. మండలి చైర్మన్ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Related News

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

Big Stories

Advertisement
×