E-Paper
Advertisement

Bank Lockers Unsafe: బంగారం, విలువైన వస్తువులు బ్యాంక్‌లో పెడుతున్నారా? బ్యాంక్ లాకర్లు పూర్తిగా సురక్షితం కాదు.. ఎందుకంటే

Bank Lockers Unsafe: బంగారం, విలువైన వస్తువులు బ్యాంక్‌లో పెడుతున్నారా? బ్యాంక్ లాకర్లు పూర్తిగా సురక్షితం కాదు.. ఎందుకంటే

Bank Lockers Unsafe| ఇంట్లో విలువైన వస్తువులు, బంగారం, ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలు, దస్తావేజులు, వారసత్వ వస్తువులు ఉంటే వాటిని చాలా మంది భద్రత కోసం బ్యాంక్ లాకర్లలో పెడతారు. ఇలాంటి విలువైన వస్తువులు ఇంట్లో ఉండడం కంటే బ్యాంక్‌లో పెడితే సురక్షితంగా ఉంటాయని అందరూ నమ్ముతారు. కానీ దేశంలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు బ్యాంక్ లాకర్ల భద్రత పట్ల అనుమానం కలిగిస్తున్నాయి. బ్యాంక్ లాకర్ల నుంచి బంగారు ఆభరణాలు కనబడకుండా పోయాయి. ఇలాంటి చాలా కేసులు వచ్చాయి. దీంతో లాకర్ల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బ్యాంక్ లాకర్ల నుంచి మాయమైన బంగారు ఆభరణాలు

దేశ రాజధాని ఢిల్లీలోని కిర్తి నగర్‌లో నివసించే ఒక మహిళ తన బ్యాంక్ లాకర్‌లో ఉండాల్సిన రూ.60 లక్షల విలువైన ఆభరణాలు కనబడడం లేదని ఫిర్యాదు చేసింది. అలాగే లక్నో నగరంలో కూడా రూ.48 లక్షల విలువైన బంగారు ఆభరణాలు బ్యాంక్ లాకర్ నుంచి దొంగతనం జరిగినట్లు కేసు వచ్చింది. ఫరీదాబాద్‌లో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కుటుంబం తమ బంగారు, వెండి ఆభరణాలు లాకర్ నుంచి మాయమయ్యాని పోలిసులకు ఫిర్యాదు చేశారు. మరో కేసులో రూ.1.5 కోట్ల ఆభరణాలు దొంగిలించబడ్డాయని ఆరోపణలు వచ్చాయి. బెంగళూరులో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ లాకర్ల నుంచి బంగారం దొంగిలించి ఆన్‌లైన్ బెట్టింగ్‌కు ఖర్చు చేశాడని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులన్నీ ఇప్పటికీ దర్యాప్తులో ఉన్నాయి.

బ్యాంక్ లాకర్ల భద్రత ఎలా ఉంది?

విలువైన వస్తువులు ఇంట్లో పెట్టడం కంటే బ్యాంక్ లాకర్లలోనే సురక్షితంగా ఉంటాయని నిపుణులు ఇప్పటికీ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అందరూ తెలుసుకోవాలి. చట్ట ప్రకారం.. లాకర్‌లో ఉంచిన వస్తువులకు బ్యాంక్ పూర్తి బాధ్యత వహించదు. బ్యాంక్ లాకర్‌ను మాత్రమే బ్యాంక్ రక్షిస్తుంది, లోపలి వస్తువులను కాదు.

2022లో RBI బ్యాంక్ లాకర్ కొత్త నియమాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022లో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పుడు కొత్త ఒప్పందాలు తప్పనిసరి. లాకర్ ప్రతి ఆపరేషన్ (తెరిచిన, మూసివేసిన) తర్వాత SMS, ఈమెయిల్ అలర్ట్ రావాలి. CCTV ఫుటేజ్ కనీసం 180 రోజులు భద్రపరచాలి. ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లకు కఠిన సైబర్ భద్రత అవసరం. నష్టం జరిగితే అప్పుడు బ్యాంక్ బాధ్యత ఉంటుంది.

బ్యాంక్ లాకర్ పొందడం కష్టమవుతోంది

ఈ రోజుల్లో బ్యాంక్ లాకర్ల డిమాండ్ పెరుగుతోంది. కానీ బ్యాంకులు వాటి సంఖ్యను అంత త్వరగా పెంచలేవు. భద్రత, కాంప్లయన్స్ ఖర్చులు పెరిగాయి. చాలా బ్యాంకుల్లో వెయిటింగ్ లిస్ట్ ఉంది. లాకర్లు ఇవ్వడానికి కొన్ని బ్రాంచ్‌లు.. కస్టమర్లతో మంచి బ్యాంకింగ్ రిలేషన్స్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ కోరుతున్నాయి.

వస్తువులు పోతే బాధ్యత ఎవరిది?

లాకర్ గది, వాల్ట్ భద్రతకు మాత్రమే బ్యాంక్ బాధ్యత వహిస్తుంది. కస్టమర్ కీ, యాక్సెస్ వివరాలు రహస్యంగా ఉంచుకోవాలి. నగదు, ప్రమాదకర వస్తువులు బ్యాంక్ లాకర్‌ లోపల ఉంచకూడదు.

నష్టం జరిగితే ఏమవుతుంది?

దొంగతనం, అగ్నిప్రమాదం, బ్యాంక్ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల నష్టం జరిగితే బ్యాంక్ పరిహారం ఇస్తుంది. కానీ ఆ పరిహారం కూడా పరిమితంగా ఉంటుంది. పరిహారం గరిష్టంగా.. సంవత్సర లాకర్ రెంట్‌కు 100 రెట్లు మాత్రమే. ప్రకృతి విపత్తుల (వరదలు, భూకంపాలు) కారణంగా లాకర్‌కు, లోపల ఉన్న వస్తువులకు నష్టం జరిగితే బ్యాంక్ బాధ్యత వహించదు.

లాకర్ వస్తువులకు బీమా?

బ్యాంక్ లాకర్లకు ఇన్సూరెన్స్ కవర్ ఉండదు. నష్టం జరిగితే అప్పుడు లోపల ఉన్న వస్తువుల విలువ కస్టమర్లు నిరూపించాలి. వాటికి సంబంధించిన ఇన్వాయిస్‌లు బిల్లు (కొనుగోలు చేసిన బిల్లు), వాల్యుయేషన్ సర్టిఫికెట్లు, ఫోటోలు చూపించాలి. వస్తువులకు ప్రైవేట్ బీమా తీసుకోవడం మంచిది.

Also Read: యుపిఐ చెల్లింపుల సమయంలో మీ నెంబర్ కనిపిస్తోందా? బ్లాక్ చేయడానికి ఇలా చేయండి

లాకర్ ఉపయోగించేవారు చేసే సాధారణ తప్పులు

నామినేషన్ అప్‌డేట్ చేయకపోవడం, లాకర్‌ను రెగ్యులర్‌గా ఓపెన్ చేయకపోవడం, అలర్ట్‌లను పట్టించుకోకపోవడం వంటి నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యలు వస్తాయి. వస్తువుల జాబితా, ఫోటోలు, వాటి విలువ నిరూపించే సర్టిఫికెట్లు భద్రంగా ఉంచాలి. నామినీ రిజిస్టర్ చేసి, ఆధారపడదగిన బ్యాంక్ బ్రాంచ్ ఎంచుకోవాలి.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×