E-Paper
Advertisement

Thriller movie OTT: మొగుళ్ళకి తెలీకుండా తప్పుడు పని… మర్డర్ తో మైండ్ బ్లాక్ ట్విస్ట్… క్లైమాక్స్ కెవ్వు కేక

Thriller movie OTT: మొగుళ్ళకి తెలీకుండా తప్పుడు పని… మర్డర్ తో మైండ్ బ్లాక్ ట్విస్ట్… క్లైమాక్స్ కెవ్వు కేక
Advertisement

Thriller movie OTT : ఊహించని మలుపులు ఉండే సైకలాజికల్ థ్రిల్లర్లను ఇష్టపడితే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అస్సలు మిస్ చేసుకోవద్దు. మీకు కావాల్సినంత మజా ఇస్తుంది ఈ సినిమా. ఈ కథ ఇద్దరు స్నేహితులైన మహిళల చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు తమ భర్తలకు అబద్ధం చెప్పి, పరాయి మగాళ్లతో గడపడానికి వెళ్ళి చిక్కుల్లో పడతారు. ఇక క్లైమాక్స్ మరో లెవెల్ లో ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

2022లో విడుదలైన ఈ డచ్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘Faithfully Yours’. ఆండ్రే వాన్ డ్యూరెన్ దర్శకత్వంలో బ్రాచా వాన్ డోస్బర్గ్ (బోడిల్), ఎలిస్ షాప్ (ఇసాబెల్) లీడ్ రోల్స్ నటించారు. ఇది ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమా నెదర్లాండ్స్‌లో 1 లక్షకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోవడంతో గోల్డెన్ ఫిల్మ్ అవార్డు కూడా దక్కించుకుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో తెలుగు డబ్బింగ్‌తో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

బోడిల్, ఇసాబెల్ అని ఇద్దరు స్నేహితురాళ్లు ఉంటారు. వీళ్లకు భర్తలు ఉన్నా కూడా, బయట వేరే వాళ్లతో ఎంజాయ్ చేయడం అలవాటు. బాగా ముదురిపోయి ఉంటారు అన్నింటిలో. ఒక ప్లాన్ ప్రకారం వీళ్ళు బీచ్ హౌస్‌కి వెళ్తారు. అక్కడ ఒకరి ఫోన్ ఒకరు మార్చుకుని, భర్తలు అడిగితే ఒకరికొకరు మాట్లాడుతూ, కళ్లు కప్పి తమకు నచ్చిన వాళ్లతో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న టైమ్‌లో సీన్ రివర్స్ అవుతుంది. ఒకరోజు సడన్‌గా ఇసాబెల్ మాయమైపోతుంది. బోడిల్ అక్కడికి వెళ్లి చూసేసరికి ఇల్లు మొత్తం రక్తంతో నిండి ఉంటుంది. తన స్నేహితురాలు చనిపోయిందని అందరూ నమ్ముతారు కానీ, పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో బోడిల్ ఆడిన డ్రామాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి.

మొగుడికి అసలు నిజం చెప్పలేక, పోలీసులకు అబద్ధం చెప్పలేక బోడిల్ బుక్కైపోతుంది. తన గుట్టు ఎక్కడ రచ్చవుతుందో అని భయం భయంగా గడుపుతూ, అబద్ధాల ఊబిలో కూరుకుపోతుంది. క్లైమాక్స్ అయితే దిమ్మతిరిగి బొమ్మ కనపడుతుంది అందరికి. అసలు ఇసాబెల్ ఎలా మిస్సింగ్ అయింది ? నిజంగానే ఆమె చనిపోయిందా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? వీళ్ళ మొగుళ్ళ పరిస్థితి ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : భయపెట్టే చావులు…ఇన్వెస్టిగేషన్ లో ట్విస్టులు… గుండెల్లో దడ పెట్టించే మలయాళం హారర్ థ్రిల్లర్

Tags

Related News

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×