IND VS NZ Final : టీ 20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇవాళ ఫైనల్ మ్యాచ్ టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనుంది. వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ టీమిండియా కి కలిసి వస్తుందా..? లేక 2023 వరల్డ్ కప్ సమయంలోనే ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ మాదిరిగా రిపీట్ అవుతుందా..? అని టీమిండియా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Also Read : IND VS NZ Final : టీమిండియాకు మోడీ గండం? ప్రధాని ఫైనల్ మ్యాచ్ కు రావొద్దు అంటూ ట్రోలింగ్!
ఈ మ్యాచ్ లో విజయం సాధించి వరుసగా రెండోసారి టీ 20 వరల్డ్ కప్ టైటిల్ కైవసం చేసుకునేందుకు టీమిండియా పావులు కదుపుతోంది. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు టీ 20 వరల్డ్ కప్ గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియా అంచనాలు నిలబెట్టుకుంటూ ఫైనల్ వరకు చేరుకుంది. రెండోసారి టైటిల్ కైవసం చేసుకునేందుకు టీమిండియాకి కావాల్సింది కేవలం ఒకే ఒక్క విజయం. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ మ్యాచ్ కి హాజరు కావడం పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ స్టేడియానికి వస్తే టీమిండియా ఓడిపోతుందని కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. మోడీ రావద్దని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు. మరోవైపు టీమిండియా కి ప్రధా ని మోడీ గండం, అంపైర్ గండం, న్యూజిలాండ్ టీమ్ తో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదనే గండం, అహ్మదాబాద్ స్టేడియం ఓ గండంగా సోషల్ మీడియాలో టీమిండియా పై ట్రోలింగ్స్ కొనసాగుతున్నాయి.
టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియా కంటే న్యూజిలాండ్ జట్టు కే పాజిటివ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2026 టీ 20 వరల్డ్ కప్ లో టీమిండియా విజయం సాధిస్తే.. వరుసగా రెండో సారి టైటిల్ గెలిచిన జట్టుగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పటి వరకు ఏ జట్టు కూడా వరుసగా రెండు సార్లు టైటిల్స్ గెలుచుకోలేదు. ఒకవేళ టీమిండియా టైటిల్ గెలిస్తే.. ఓ రికార్డు అయితే సృష్టించడం పక్కా. సెమీ ఫైనల్ లో బలమైన ఇంగ్లండ్ జట్టును ఓడించినట్టుగానే ఫైనల్ లో కివీస్ ను ఓడించాలని టీమిండియా ప్లాన్ వేస్తోంది. ఇప్పటికే పలు సెంటిమెంట్లను సైతం పాటిస్తోంది. అభిషేక్ శర్మ స్థానంలో రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్ ను తీసుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచించినప్పటికీ ఎలాంటి మార్పులు లేకుండానే టీమిండియా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా కి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం కలిసి వస్తుందో లేదో వేచి చూడాలి మరీ.
Also Read : IND VS NZ Final: అభిషేక్ బతికిపోయాడు, మిస్టరీ స్పిన్నర్ పై వేటు..ఫైనల్స్ ఆడే టీమిండియా జట్టు ఇదే