E-Paper
Advertisement

2024 Aston Martin Vantage Launched : వాంటేజ్ నుంచి స్పోర్ట్స్ కార్.. ధర ఎంతో తెలుసా?

2024 Aston Martin Vantage Launched : వాంటేజ్ నుంచి స్పోర్ట్స్ కార్.. ధర ఎంతో తెలుసా?
Advertisement

2024 Aston Martin Vantage Launched : పవర్‌‌ఫుల్ ఇంజన్, లేటెస్ట్ ఫీచర్లతో వచ్చే కార్లకు దేశంలో భారీ డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా సూపర్ కార్లకు పేరుగాంచిన ఆస్టన్ మార్టిన్ భారతీయ మార్కెట్‌లో కొత్త కారును లాంచ్ చేసింది. కంపెనీ తన కొత్త వాంటేజ్‌ని దేశంలో అధికారికంగా ప్రారంభించింది. కంపెనీ ఈ కారులో అనేక గొప్ప ఫీచర్లను అందించింది. దీనితో పాటు చాలా శక్తివంతమైన ఇంజన్ కూడా ఉంది. కారు ధర ఎలా ఉంటుంది. ఇంజన్ స్పెసిఫికేషన్లు తదితర విషయాల గురించి తెలుసుకోండి.

ఆస్టన్ మార్టిన్ న్యూ వాంటేజ్‌లో నాలుగు-లీటర్ V8 ట్విన్ టర్బో ఇంజన్‌ను సెట్ చేసింది. దీని కారణంగా ఇది 665 PS పవర్, 800 న్యూటన్ మీటర్ టార్క్‌ను రిలీజ్ చేస్తు్ంది. కొత్త వాంటేజ్ కేవలం 3.4 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 32 కిలోమీటర్లు దీని ఛాసిస్, పవర్‌ట్రెయిన్‌లు ఖచ్చితమైన 50:50 బరువు అందజేస్తాయి. దీని ద్వారా డ్రైవర్ వెహికల్ కండీషన్‌ను ఖచ్చితంగా ట్యూన్ చేయగలడు.

Advertisement

Also Read : పోరగాండ్ల మతిపోగొడుతున్న జీప్ రాంగ్లర్.. ఈ రోజే లాంచ్..!

కొత్త వాంటేజ్‌ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో అనేక గొప్ప ఫీచర్లను తీసుకొచ్చింది. కొత్త వాంటేజ్‌లో యాక్టివ్ వెహికల్ డైనమిక్స్, బిల్‌స్టెయిన్ డిటిఎక్స్ అడాప్టివ్ డంపర్‌లు, ఎలక్ట్రానిక్ రియర్ డిఫరెన్షియల్ (ఇ-డిఫ్) ఉన్నాయి. దీనితో పాటు మిచెలిన్ పైలట్ S5 టైర్లు, అత్యాధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఇంటీరియర్ ఉంటుంది.

Advertisement

ఆస్టన్ మార్టిన్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమెడియో ఫెలిసా మాట్లాడుతూ.. సూపర్ కార్ల ప్రపంచంలో నేటి టెక్నాలజీ, కాంపిటీషన్‌తో పోటీ పడాలంటే ఒక ఐకానిక్ బ్రాండ్‌ను రూపొందించడం చాలా ముఖ్యం. వాంటేజ్‌ పేరును కలిగి ఉన్న ఏ కారు అయినా గొప్ప చరిత్ర ఉంది. కాబట్టి ఈ  మోడల్‌కు దాని లుక్, ఇంజన్ పెర్ఫార్మెన్స్ పరంగా మార్కెట్‌లో తిరుగు ఉండదు.

Also Read : అద్భుతం చేసిన హీరో 125R.. అదిరిపోతున్న రెస్పాన్స్‌..!

కారు క్లాస్-లీడింగ్ పవర్, దాని స్పీడ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే వాంటేజ్‌ పూర్తి బ్యాలెన్స్‌డ్ ఫ్రంట్-ఇంజన్ రియర్-డ్రైవ్ ఛాసిస్‌‌ లేటెస్ట్ టెక్నాలజీతో స్పోర్ట్స్ కారును సృష్టించాము. బోల్డ్ స్టైలింగ్, సరికొత్త ఇంటీరియర్స్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ వాన్టేజ్‌ను ప్రతి అంశంలోనూ ప్రపంచ స్థాయికి చేర్చాయి. వాంటేజ్‌ ఆస్టన్ మార్టిన్ రూ. 3.99 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరగా ఉంది. కంపెనీ ఈ కారును డ్రైవర్-సెంట్రిక్ మరియు వేగవంతమైన వాంటేజ్‌గా పరిచయం చేసింది.

Tags

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×