BigTV English

Chandrababu Naidu: జగన్ అహంకారంతో చరిత్రహీనుడిగా మిగిలారు: చంద్రబాబు

Chandrababu Naidu: జగన్ అహంకారంతో చరిత్రహీనుడిగా మిగిలారు: చంద్రబాబు

Chandrababu Naidu Speech In Pathapatnam Prajagalam Sabha: ఏపీ సీఎం జగన్ అహంకారంతో చరిత్రహీనుడిగా మిగిలారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పాతపట్నం ప్రజాగళం సభలో పాల్గొన్న ఆయన శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మూడో సారి గెలిపించి పార్లమెంటు‌కి పంపించాలని అన్నారు.


ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నారు. రాష్ట్రం గెలవాలనే మూడు పార్టీలు కలసి పోరాడుతున్నాయని పేర్కొన్నారు. ఏపీ ప్రజల శ్రేయస్సు కోసమే కూటమిగా బరిలోకి దిగామని స్పష్టం చేశారు. జనసేనాని గురించి ప్రస్తావిస్తూ.. కేవలం సినిమాల్లోనే కాదు పవన్ కల్యాణ్ నిజజీవితంలో కూడా హీరోనేని తెలిపారు. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజా సేవ చేయడం కోసమని.. విధ్వంసం చేయడానికి కాదని అన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని.. అహంకారంతో చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని చంద్రబాబు మండిపడ్డారు.

సీఎం జగన్ అమరావతిని నాశనం చేశారని.. పోలవరాన్ని ముంచారని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయన్నారు. రైతుల పట్టాదారు పాసుపుస్తకాల మీద సీఎం జగన్ బొమ్మ ఎందుకు ఉంది అని ప్రశ్నించారు. తాము అధికాంలోకి వచ్చాక రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పంటలకు గిట్టుబాట ధర కల్పిస్తామని.. బీమా సదుపాయాన్ని అమలుచేస్తామన్నారు. సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందిస్తామన్నారు.


Also Read: అన్ని వర్గాలకు అనుకూలంగా కూటమి మేనిఫెస్టో.. పేదలకు ఇళ్ల స్థలాలు: చంద్రబాబు!

దేశంలో ఎక్కడ చూసినా శ్రీకాకుళం జిల్లా కార్మికులు ఉంటారని వారి బాధలు పట్టించుకునే వారే లేరని చంద్రబాబు నాయుడు అన్నారు. అధికారంలోకి రాగానే స్థానికంగానే వారికి ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు.

Related News

Fishermen Vs Police: హై టెన్షన్.. అనకాపల్లి హైవే క్లోజ్! మత్స్యకారులు Vs పోలీసులు

Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. విశాఖకు పదేళ్లు చాలు: లోకేష్

Anantapur: దారుణం.. ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు.. మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడి

YSRCP vs TDP: బొత్స ‘అంతం’ మాటలు.. జగన్ ప్లాన్‌లో భాగమేనా?

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

AP Govt: ఏపీలో నకిలీ మద్యానికి చెక్.. కొత్తగా యాప్ తీసుకురానున్న ప్రభుత్వం, అదెలా సాధ్యం

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

Big Stories

×