E-Paper
Advertisement

Holidays List: జనవరి సెలవుల లిస్టు వచ్చిసిందోచ్.. బ్యాంకులు కేవలం 15 రోజులే, అదెలా?

Holidays List: జనవరి సెలవుల లిస్టు వచ్చిసిందోచ్.. బ్యాంకులు కేవలం 15 రోజులే, అదెలా?
Advertisement

Holidays List: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -ఆర్బీఐ సెలవుల జాబితాను ప్రకటించింది. 2026 జనవరి నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు రానున్నాయి. అందులో జాతీయ, రాష్ట్ర పండుగలు, వీకెండ్ వంటి సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు అన్నిరాష్ట్రాలకు ఒకేలా ఉండవని, పలు రాష్ట్రాల్లో స్థానిక పండుగల ఆధారంగా మారుతాయని స్పష్టం చేసింది.

జనవరిలో సెలవుల జాబితా వచ్చిసిందోచ్

Advertisement

ప్రస్తుతం రోజుల్లో చాలామంది బ్యాంకింగ్ లేదా టీచర్ ఉద్యోగాలు చేయాలని కోరుకుంటారు. పెద్దగా ఒత్తిడి ఉండదు, ఆపై కావాల్సినన్ని సెలవులు ఉంటాయి. అందుకే ఆయా ఉద్యోగాలకు జనం ఎగబడతారు. వచ్చే ఏడాది అంటే 2026-జనవరి నెలకు సంబందించి సెలవుల జాబితాను ఆర్‌బీఐ ప్రకటించింది. దేశావ్యాప్తంగా బ్యాంకులకు రెండు వారాలు సెలవులు రానున్నాయి.

వచ్చేఏడాది 2026- జనవరిలో దేశవ్యాప్తంగా బ్యాంకులు 15 రోజులు మూసి వేయబడతాయి. జనవరి 1 నూతన సంవత్సర దినోత్సవంతో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా కుటుంబసభ్యులు వేడుకలతో సరదాగా గడుపుతారు. జనవరి 2 న మన్నం జయంతి కావడంతో ఆయా ప్రాంతానికి సెలవు రానుంది. జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కొన్ని రాష్ట్రాలకు సెలవు రానుంది.

Advertisement

బ్యాంకులు కేవలం 15 రోజులు మాత్రమే

జనవరి 14 మకర సంక్రాంతి కారణంగా సెలవు రానుంది. భారతదేశంలో ప్రధాన పంట పండుగలలో ఇది ఒకటి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ప్రధానమైన పండుగ. అలాగే ఆ రోజు మహారాష్ట్ర, గుజరాత్‌లలో గాలిపటాలు ఎగురవేయడం, సూర్య భగవానుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. జనవరి 15న ఉత్తరాయణ పుణ్యకాలం/పొంగల్/ సంక్రాంతి రానుంది.

జనవరి 16న తమిళనాడులో తిరువళ్లువర్ డే కావున సెలవు రానుంది. జనవరి 17న ఉజవర్ తిరునాళ్ కావడంతో ఆ రోజూ సెలవు రానుంది. జనవరి 23న అనగా శుక్రవారం వసంత పంచమి. అంతేకాదు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి, సరస్వతీ పూజ కూడా. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాలు జ్ఞానానికి దేవత సరస్వతి దేవిని పూజిస్తారు.

ALSO READ:  డీమార్టులో టాయిలెట్లు ఎందుకు ఉండవు?

ఈ నెల జనవరి 26న అనగా సోమవారం రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండా ఎగురవేసే వేడుకలు జరుపుకుంటారు. ఆ రోజు బ్యాంకులు మూసి వేయబడతాయి, ఆర్థిక లావాదేవీలకు తీవ్ర ప్రభావం చూపనుంది. బ్యాంక్ మూసివున్నా, ఆన్‌లైన్ సర్వీసులు, యూపీఐ, నెఫ్ట్, ఐఎంపీఎస్, మొబైల్ బ్యాంకింగ్ అందుబాటులో ఉంటాయి.

బ్యాంకులకు ఆరు రోజులు సెలవులు రానున్నాయి. జనవరి 4న ఆదివారం సెలవు. ఇక జనవరి 10న రెండో శనివారం, 11న ఆదివారం కావడంతో వరుసగా రెండురోజులు సెలవులు. జనవరి 18న ఆదివారం, 24న నాలుగో శనివారం, 25న ఆదివారం కావడంతో సెలువులు కలిసి రానున్నాయి.

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×