E-Paper
Advertisement

DMart: డిమార్టులో టాయిలెట్లు ఎందుకు ఉండవు? అర్జంట్ అయితే?

DMart: డిమార్టులో టాయిలెట్లు ఎందుకు ఉండవు? అర్జంట్ అయితే?
Advertisement

DMart Public Washrooms: దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ మార్కెట్ చైన్ లలో డిమార్ట్ ముఖ్యమైనది. ఇందులో ధరలు అత్యంత చౌకగా ఉంటాయి. కిరాణా సరుకుల నుంచి మొదలుకొని దుస్తుల వరకు అన్ని రకాల వస్తువులు ఇందులో లభిస్తాయి. అన్ని వస్తువులను కొనుగోలు చేసేందుకు డిమార్ట్ వన్ స్టాఫ్ కావడంతో ఎక్కువ మంది ఇక్కడ షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతారు. తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే, డిమార్ట్ లో ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇందులో వినియోగదారుల కోసం వాష్ రూమ్స్ ఉండవు. కారణం ఏంటంటే..

డిమార్ట్ స్టోర్లలో పబ్లిక్ టాయిలెట్లు ఎందుకు లేవు?

 

⦿ ఖర్చు తగ్గించుకోవడం

Advertisement

డిమార్ట్ అనేది ఓ కీలక అంశాన్ని ఫాలో అవుతుంది. అనవసర ఖర్చులను వీలైనంత తగ్గించుకుని, ఆ ఆదా వినియోగదారులకు అందించాలని భావిస్తుంది. ఇతర స్టోర్లతో పోల్చితే డిమార్ట్ లో చౌకగా సరుకులను అందించేందుకు ప్రయత్నిస్తారు.

⦿ టాయిలెట్స్ నిర్వహణ ఖర్చు  

పబ్లిక్ టాయిలెట్లను నిర్మించడంతో పాటు మెయింటెయిన్ చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. వారికి స్థలం, పైపులు, వాటర్ ట్యాంకులు, మంచి ఫిట్టింగ్‌లు అవసరం. వాటర్ బిల్లులు, లైట్లు, ఫ్యాన్లకు పవర్, సోప్, టాయిలెట్ పేపర్,  క్లీనర్లకు అదనపు ఖర్చు ఆదా చేసుకునేందుకు టాయిలెట్స్ ఏర్పాటు చేయలేదు.

⦿ క్లీనింగ్ సిబ్బంది

Advertisement

ప్రతిరోజూ డిమార్ట్ లోకి వేలాది మంది కస్టమర్లు వస్తారు. టాయిలెట్స్ ఉంటే, త్వరగా మురికిగా మారుతాయి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి కార్మికులు అవసరం. అదనపు ఖర్చు పెరిగిపోతుంది.

⦿ మరమ్మతులు, సమస్యలు

టాయిలెట్లు కొన్నిసార్లు దెబ్బతింటాయి. రకరకాల సమస్యలు ఏర్పడుతాయ. వాటికి మరమ్మతులు చేయడానికి డబ్బు ఖర్చు అవుతుంది.

ఈ ఖర్చులను ఆదా చేసేందుకు డిమార్ట్ తన స్టోర్లలో కస్టమర్ల కోసం టాయిలెట్స్ ఏర్పాటు చేయలేదు. ఈ డబ్బును ఆదా చేసి, వినియోగదారులకు మరింత తక్కువ ధరలకు వస్తువులను అందించే ప్రయత్నిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా  డిస్కౌంట్ స్టోర్లు కూడా ఇదే పని చేస్తాయి. టాయిలెట్లు, ఆట స్థలాలు, కేఫ్‌ల లాంటి అదనపు సౌకర్యాలకు బదులుగా వారు తక్కువ ధరలపై దృష్టి పెడతారు.

ఒకవేళ కస్టమర్లకు అత్యవసరం అయితే?

డిమార్ట్ లో వస్తువులను కొనుగోలు చేయడానికి వెళ్లే ముందు ఇంట్లోనే వాష్ రూమ్ కు వెళ్లడం మంచిది. లేదంటే సమీపంలోని టాయిలెట్స్ ఉపయోగించాలి. ఒకవేళ అత్యవసరం అయితే, డిమార్ట్ సిబ్బందికి పరిస్థితి చెప్పాలి. కొన్నిసార్లు వారు తాము ఉపయోగించే వాష్ రూమ్ ను యూజ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. అలా అని కచ్చితంగా సిబ్బంది ఎస్ చెప్పాలనే రూల్ ఏమీ లేదు. అందుకే, డిమార్డ్ అదనపు సౌకర్యాల కంటే తక్కువ ధరల మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. అందుకే, లక్షలాది మంది వినియోగదారులు డిమార్ట్ లో షాపింగ్ చేస్తారు. కిరాణా సామాగ్రితో పాటు రోజువారీ వస్తువులపై డబ్బు  పెద్ద మొత్తంలో ఆదా చేస్తారు.

Read Also: సొంతూరిలోనే లక్షలు సంపాదించే బిజినెస్‌ – ఇంత వరకు ఎవ్వరూ చెప్పని వ్యాపారం ఇదే!

Related News

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

Big Stories

Advertisement
×