E-Paper
Advertisement

గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఇకపై ఆ కోడ్ లేకపోతే సిలిండర్ రానట్లే!

గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఇకపై ఆ కోడ్ లేకపోతే సిలిండర్ రానట్లే!
Advertisement

LPG Cylinder: భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) గ్యాస్ సిలిండర్ సరఫరాకు సంబంధించి కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. భారత్ గ్యాస్ సిలిండర్ బుకింగ్, డెలివరీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఉద్దేశించిన డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC)ను ఇకపై తప్పనిసరి చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఇకపై భారత్ గ్యాస్ యూజర్లు.. సిలిండర్ డెలివరీ సమయంలో డీఏసీ కోడ్ ను తప్పనిసరిగా డెలివరి బాయ్ తో షేర్ చేసుకోవాలని బీపీసీఎల్ సూచించింది. లేనిపక్షంలో గ్యాస్ సిలిండర్ ను తిరిగి వెనక్కి పంపనున్నట్లు హెచ్చరించింది.

అసలేంటీ డీఏసీ కోడ్ ?

కొత్త నిబంధనల ప్రకారం.. వినియోగదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే వారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఒక డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) లేదా ఒక ఓటీపీ వస్తుంది. గ్యాస్ డెలివరీ బాయ్ ఇంటికి సిలిండర్ తీసుకొచ్చినప్పుడు ఈ కోడ్‌ను అతనికి చెప్పాల్సి ఉంటుంది. అతను తన యాప్‌లో ఈ కోడ్‌ను ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేశాకే సిలిండర్ అందజేస్తారు.

బీపీసీఎల్ కొత్త అడ్వైజరీ

Advertisement

భారత్ గ్యాస్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా కమర్షియల్ డెలివరీల కోసం ‘డీఏసీ’ (DAC) సదుపాయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. సిలిండర్ ఖచ్చితమైన కస్టమర్‌కు సురక్షితంగా చేరడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. కస్టమర్లు సిలిండర్ చేతికి అందిన తర్వాత మాత్రమే ఈ డీఏసీ లేదా ఓటీపీని డెలివరీ బాయ్‌తో పంచుకోవాలని సూచించింది. డెలివరీ పూర్తయిన తర్వాత డిజిటల్ క్యాష్ మెమో మొబైల్‌కు వస్తుందని తెలియజేసింది.

హెచ్‌పీసీఎల్ హెచ్చరిక

Advertisement

డీఏసీ ప్రక్రియ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో హెచ్‌పీసీఎల్ తన కస్టమర్లను అప్రమత్తం చేసింది. సైబర్ మోసాల బారిన పడకుండా పాటించాల్సిన జాగ్రత్తలు సూచించింది. అసలైన మెసేజ్‌లను గుర్తించడం ఎలాగో తెలియజేసింది. తాము పంపే మెసేజ్ ఎల్లప్పుడూ VM-HPGASc-S అనే అధికారిక ఐడీ నుండి మాత్రమే వస్తుందని స్పష్టం చేసింది. అందులో 4 అంకెల ఓటీపీ (OTP) ఉంటుందని పేర్కొంది. దీనిని సిలిండర్ డెలివరీ సమయంలో మాత్రమే ఉపయోగించాలని కస్టమర్లకు దిశానిర్దేశం చేసింది.

ఈ మార్పు ఎందుకు?

సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, సరైన లబ్ధిదారుడికే గ్యాస్ చేరుతోందని నిర్ధారించుకోవడానికే చమురు సంస్థలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఒకరి పేరు మీద ఉన్న సిలిండర్‌ను మరొకరికి అక్రమంగా విక్రయించకుండా ఈ విధానం అడ్డుకట్టవేయనుంది. అలాగే సిలిండర్ డెలివరీ ట్రాకింగ్ సిస్టమ్ లోని లోపాలను సైతం డీఏసీ ప్రక్రియతో తొలగించవచ్చని గ్యాస్ సరఫరా సంస్థలు భావిస్తున్నాయి.

Also Read: ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా ‘నెట్‌ఫ్లిక్స్’ ఉచితం!

మొబైల్ నెంబర్ అప్‌డేట్ తప్పనిసరి!

ఈ కొత్త విధానం వల్ల వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే వారి గ్యాస్ కనెక్షన్‌కు యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఒకవేళ నెంబర్ మారినట్లయితే వెంటనే గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి లేదా వారి అధికారిక యాప్/వెబ్‌సైట్ ద్వారా నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ మెుబైల్ నెంబర్ అప్ డేట్ కాకపోతే ఓటీపీ రాదు. ఫలితంగా సిలిండర్ డెలివరీ నిలిచే ప్రమాదం ఉందని.. కాబట్టి ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్ పీ గ్యాస్ యూజర్లు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

Also Read: బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Related News

ఆధార్, ఫోన్ నంబర్‌తో.. మీ UAN నంబర్‌ను క్షణాల్లో కనుక్కోండిలా

ఆషాడ వేళ పసిడి షాక్.. ఆశలకి బ్రేక్ వేస్తూ మళ్ళీ పైపైకి బంగారం ధరలు!

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

Big Stories

Advertisement
×