E-Paper
Advertisement

ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా ‘నెట్‌ఫ్లిక్స్’ ఉచితం!

ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా ‘నెట్‌ఫ్లిక్స్’ ఉచితం!
Advertisement

Flipkart Netflix Offer: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారుల కోసం ఒక అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. సినిమా, వెబ్ సిరీస్ ప్రియులకు ఇది నిజంగా పెద్ద పండగ లాంటి వార్త అనే చెప్పాలి. అయితే ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో ఉందా? దీన్ని ఎలా పొందాలో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది?

ఈ ఉచిత నెట్‌ఫ్లిక్స్ డీల్ ప్రధానంగా ఎంపిక చేసిన ఫ్లిప్‌కార్ట్ ప్లస్ (Flipkart Plus) మెంబర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. అది కూడా ఫ్లిప్ కార్ట్ నిర్ణయించిన కొన్ని అర్హత ప్రమాణాలను వారు నేరవేర్చాల్సి ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ ప్రకారం.. ఫ్రీగా నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ కోరుకునే వారు ఒక నెలలో కనీసం 4 ఆర్డర్లు అయిన కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా రూ.299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన వస్తువులను ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేసి ఉండాలి. ఈ ఆర్డర్లను ఫ్లిప్ కార్ట్ తో పాటు ఫ్లిప్ కార్ట్ మినిట్స్, ఫ్లిప్ కార్ట్ గ్రోసరి వంటి ఏ ఫ్లిప్ కార్ట్ ఫ్లాట్ ఫామ్ లో అయినా చేయవచ్చు.

నెట్ ఫ్లిక్ ను ఎలా పొందాలి?

Advertisement

అర్హత గల ఫ్లిప్ కార్డ్ యూజర్లు ఒక నెలలో 4 ఆర్డర్లను పూర్తి చేసిన తర్వాత.. నెట్ ఫ్లిక్స్ పొందేందుకు కొన్ని స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ముందుగా ఫ్లిప్ కార్ట్ యాప్ ను తెరిచి అందులో ‘మై అకౌంట్’లోకి వెళ్లాలి. అక్కడ ప్లస్ పేజీపై నొక్కి.. నెట్ ఫ్లిక్స్ బెనిఫిట్స్ విభాగంలోకి వెళ్లండి. అక్కడ ‘క్లైయిమ్ నౌ’ మీద క్లిక్ చేస్తే.. అది నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి కనెక్ట్ చేస్తుంది. నెట్ ఫ్లిక్స్ ఖాతా కోసం మీ ఈ-మెయిల్ ఐడీ లేదా ఫోన్ నెంబర్ నమోదు చేసి ఓటీపీని ఎంటర్ చేయండి. తద్వారా ఫ్లిప్ కార్ట్ యూజర్లు.. ఫ్రీగా నెట్ ఫ్లిక్స్ ను ఆస్వాదించవచ్చు.

Also Read: Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!

Advertisement

అయితే మీకు ముందుగానే నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఉన్నట్లయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ ఖాతా యాక్టివ్ గా ఉన్న ఈ-మెయిల్ లేదా మెుబైల్ నెంబర్ ఇస్తే.. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ నిరూపయోగంగా మారొచ్చు. కాబట్టి కొత్త ఈ-మెయిల్ లేదా మెుబైల్ నెంబర్ ఇవ్వడం ద్వారా.. నెట్ ఫ్లిక్స్ ఆఫర్ ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవచ్చు. నాల్గో ఆర్డర్ డెలివరీ అయిన తేదీ నుంచి ఈ నెట్ ఫ్లిక్స్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. నిర్దిష్ట కాలపరిమితి దాటక నెట్ ఫ్లిక్స్ కొనసాగాలంటే మీరు మరో 4 ఆర్డర్లను పూర్తి చేయాల్సి ఉంటుందని ఫ్లిప్ కార్ట్ వర్గాలు తెలిపాయి.

Also Read: అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×