E-Paper
Advertisement

కిలాడీ జంట లగ్జరీ లైఫ్ బిల్డప్.. తెరవెనుక కోట్లలో చీటింగ్.. నందూస్ వరల్డ్ జంట అసలు రంగు బట్టబయలు..?

కిలాడీ జంట లగ్జరీ లైఫ్ బిల్డప్.. తెరవెనుక కోట్లలో చీటింగ్.. నందూస్ వరల్డ్ జంట అసలు రంగు బట్టబయలు..?

UK Visa Scam: నందూస్ వరల్డ్.. టైంపాస్ కోసం యూట్యూబ్‌ ఓపెన్ చేసే తెలుగు వాళ్లందరికీ.. యూకేలో సెటిలైన ఈ తెలుగు కపుల్ బాగా తెలుసు. తెలుగు డిజిటల్ మీడియాలో, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలో.. నందూస్ ఫ్యామిలీ ప్రత్యేక ముద్ర వేసింది. నందూస్ వరల్డ్ ఛానల్ ద్వారా.. రమా నందన, ఆమె భర్త మధుకర్ అందించే కంటెంట్ ప్రతి ఇంటా నవ్వులు పూయిస్తోంది. భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, సరదా సంభాషణలు, అలకలు, ఒకరినొకరు ఆటపట్టించుకునే తీరు, యూకేలో వాళ్లు అటెండ్ చేసే ఫంక్షన్లు, ఫ్రెండ్స్, బంధువులతో గడిపే సరదా క్షణాలు.. ఇలా వాళ్ల ఫ్యామిలీకి చెందిన ప్రతీది.. తమ వీడియోల్లో ఎంతో సహజంగా చూపిస్తారు.

సినిమాలో అవకాశం..

ఈ వీడియోలు చాలా మందిని ఎంటర్‌టైన్ చేస్తున్నాయ్. ముఖ్యంగా రమా నందన హస్కీ వాయిస్.. నందూస్ వరల్డ్ ఛానెల్‌కి బిగ్ హైలైట్. అంతేకాదు, ఈ కపుల్స్ టైమింగ్, రమానందన ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులని బాగా అట్రాక్ట్ చేశాయ్. అలా చాలా మంది వీళ్ల వీడియోలకి ఫ్యాన్స్ అయ్యారు. ఈ ఏడాదే మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనూ.. నందు మెరిసింది. దాంతో ఆవిడకు మరింత పాపులర్ ఇమేజ్‌ దక్కింది. అయితే, ఇప్పుడిదే ఫ్యామిలీపై వస్తున్న వీసా మోసాల ఆరోపణలతో అంతా ఖంగుతిన్నారు.

నిరుద్యోగులే టార్గెట్‌గా..

నందూస్ వరల్డ్ పేరుతో పాపులర్ అయిన జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమా నందనపై సోషల్ మీడియాలోనూ, తెలుగు రాష్ట్రాల్లో వీసా స్కామ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ్. యూకేలో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకొని, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ వీసా పేరుతో లక్షల రూపాయలు వసూలు చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా చలామణి అవుతూ, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న నందూస్ వరల్డ్ జంట ఈ భారీ మోసానికి తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితుల ఫోన్లకు అందుబాటులో లేకుండా పోవడంతో.. సోషల్ మీడియా అంతా వీరి గురించే చర్చ నడుస్తోంది.

Also read: ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

యూకేలో ఉద్యోగాలు..

యూకేలో స్థిరపడాలనేది ఎంతో మంది నిరుద్యోగుల కల. దీని కోసం వీసా పొందేందుకు అత్యంత కీలకమైన సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇప్పిస్తామంటూ ఈ జంట నమ్మించినట్లుగా తెలుస్తోంది. తమకున్న సోషల్ మీడియా క్రేజ్, గ్లామర్, సినిమా పరిచయాలను అడ్డం పెట్టుకుని బాధితులకు నమ్మకం కలిగించినట్లుగా చెబుతున్నారు. తమకు యూకేలో ఐదారు కంపెనీలతో డైరెక్ట్ అటాచ్‌మెంచ్ ఉందని, తలచుకుంటే ఎవరికైనా సీఓఎస్ వీసాలు ఇప్పించగలమని చెప్పారని స్వయంగా వారే కొన్ని కంపెనీలను కూడా పెట్టారనే ప్రచారం సాగుతోంది. అలా ఒక్కొక్కరి నుంచి 15 నుంచి 20 లక్షల దాకా వసూలు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. యూకేలో ఉద్యోగాలిప్పిస్తామని, వీసా రెన్యువల్ చేయిస్తామని వసూళ్లకు పాల్పడుతున్నారనేది మేజర్ అలిగేషన్. ఇండియా నుంచి యూకే వెళ్లాలనుకునేవారికి, ఇప్పటికే యూకేలో ఉండి వీసా రెన్యువల్ చేసుకోవాలనుకునే వారికి సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ జాబ్ వీసా ఇప్పిస్తామని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేశారనేది ప్రధాన ఆరోపణ.

2023లో 15 లక్షలు..

నందూస్ వరల్డ్ జంటపై.. ఏపీకి చెందిన మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి.. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లండన్‌లో చదువుకుంటున్న సమయంలో తనకు మధుకర్ పరిచయమయ్యారని, వీసా రెన్యువల్ చేయిస్తానని, తన భార్యకు యూకేలో ఉద్యోగం, సీఓఎస్ ఇప్పిస్తామని నమ్మించారని భాదితుడు చెబుతున్నారు. ఇండియాలోని తమ డెస్టినీ కన్సల్టెన్సీ బ్రాంచ్‌లో డబ్బులు చెల్లిస్తే వీసా రెన్యువల్‌ చేయిస్తామని చెప్పడంతో.. శివక్రాంతి కుమార్ వారు సూచించిన డెస్టినీ కన్సల్టెన్సీ ఖాతాల్లోకి 2023లో 15 లక్షలు బదిలీ చేశానన్నారు. అయితే, వారు పంపిన సీఓఎస్ డాక్యుమెంట్ నకిలీదని తేలిందని బాధితుడు ఆరోపించారు. డబ్బులు వెనక్కి అడిగితే 2 లక్షలు మాత్రమే ఇచ్చి, మిగతా డబ్బులు ఇవ్వకుండా ఫోన్లు ఎత్తడం లేదని ఫిర్యాదులో తెలిపారు. ఈ కేసులో మధుకర్‌ని ఏ1 గా, రమా నందనని ఏ2గా, మోహన్‌రావుని ఏ3గా చేర్చారు.

దాదాపు 50 మందికి పైగా..

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఒక్కొక్కరి దగ్గర 15 లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేస్తున్నారని, దాదాపు 50 మందికి పైగా ఇలానే మోసం చేశారని, ఈ స్కామ్ విలువ కోట్లలో ఉంటుందని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలని రమా నందన పూర్తిగా ఖండించారు. తమపై వ్యక్తిగత కక్షతో కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమకు ఎలాంటి కంపెనీలు లేవని చెప్పారు. తమ పేరు వాడుకొని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే నమ్మొద్దని, తాము కేవలం సమాచారం మాత్రమే ఇచ్చామని చెప్పారు. తమపై వస్తున్న ఆరోపణలని చట్టపరంగానే ఎదుర్కొంటామన్నారు. యూకేలో ఇప్పటికే కొంతమందిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ వ్యవహారాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Aso read: భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

వీడియోలు రిలీజ్..

నందూ వెర్షన్ ఎలా ఉన్నా వీళ్లపై నమోదైన వీసా చీటింగ్ కేసు వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయ్. డెస్టినీ కన్సల్టెన్సీ కంపెనీ పేరు నందు, ఆమె భర్త మధుకర్ మోసం చేశారని ఇబ్రహీంపట్నం పీఎస్‌ని ఇంకొంత మంది బాధితులు ఆశ్రయించారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాల వారే కాకుండా ఇతర రాష్ట్రాల వారు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.

కేసు రద్దు చేయాలని..

రమా నందన, మధుకర్ దంపతులు తమపై నమోదైన కేసుని రద్దు చేయాలంటూ.. హైకోర్టుని ఆశ్రయించారు. వీసాల పేరుతో మోసం చేశారనే ఆరోపణలన్నీ తప్పని, వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని.. నందు తరఫు లాయర్ వీడియో కూడా రిలీజైంది. మరోవైపు మధుకర్‌కు చెందిన డెన్టినీ కన్సల్టెన్సీ ద్వారా మోసపోయామంటూ.. కొందరు తమని ఆశ్రయించారని పోలీసులు చెబుతున్నారు. వారి వివరాలు సేకరిస్తున్నారు. ఈ వీసా మోసం కేసులో.. బాధితులు చాలా మందే ఉన్నట్లు తెలుస్తోంది.

యూట్యూబ్ వీడియోల్లో రాయల్టీ..

యూట్యూబ్ వీడియాల్లో రమా నందన, మధుకర్ చాలా లగ్జరీగా కనిపిస్తారు. వాళ్లకు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నట్లు, విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు బిల్డప్ ఇచ్చారు. కార్లు, ఖరీదైన ఇళ్లు, ఇంటీరియర్ చూపిస్తూ.. చాలా పొద్ద పొజిషన్‌లో ఉన్నామని కలరింగ్ ఇచ్చారు. వీటికి తోడు యూట్యూబ్ సెలబ్రిటీ అనే స్టేటస్ ఉండనే ఉంది. లక్షలాది మంది ఫాలోవర్లు ఉండటం వల్ల.. ఇంతమంది చూసే ఛానెల్ ఉన్నవాళ్లు మోసం చేయరనే గుడ్డి నమ్మకం సాధారణ ప్రజల్లో ఏర్పడింది. అలా.. తమకున్న డెస్టినీ కన్సల్టెన్సీతో యూకే వీసాలు ఇప్పిస్తామంటూ, సీఓఎస్ లెటర్లు ఇప్పిస్తామని నమ్మించారు. ఆల్రెడీ తాము చాలా మందిని పంపించామని చెప్పారు. దాంతో అనేక మంది నమ్మారు.

Also Read: సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

15 నుంచి 20 లక్షలు..

ముఖ్యంగా విదేశాలకు వెళ్లి స్థిరపడాలనే మధ్యతరగతి ప్రజల బలహీనతను ఈ జంట క్యాష్ చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయ్. సాధారణంగా వీసా ప్రాసెస్ చాలా ఆలస్యమవుతుంది. కానీ, వీరు తమకున్న ఇన్‌ఫ్లుయెన్స్‌తో చాలా త్వరగా, ఈజీగా వీసాలిప్పిస్తామని నమ్మించారని కొందరు చెబుతున్నారు. మంచి భవిష్యత్ ఉంటుందనే ఆశతో బాధితులు తమ ఇళ్లు, నగలు తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి మరీ వీళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. అలా ఒక్కొక్కరి దగ్గర 15 నుంచి 20 లక్షల దాకా వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఓ గ్రూప్‌గా ఏర్పడ్డి..

మోసపోయామని గ్రహించిన బాధితులంతా.. ఓ గ్రూప్‌గా ఏర్పడ్డారు. నందు, మధుకర్ జంటపై చట్టపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే.. పోలీస్ స్టేషన్‌లో వీరిపై కేసు నమోదైంది. తాము డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఈ జంట పంపిన ఫేక్ సీఓఎస్ కాపీలు, వాట్సాప్ చాటింగ్‌లను ఒక దగ్గరకు చేర్చి.. పోలీసులకు బలమైన ఆధారాలు అందిస్తున్నారు. వీరు చేసిన మోసం అందరికీ తెలియజేయాలని.. బాధితులంతా ధైర్యంగా ముందుకొస్తున్నారు. సోషల్ మీడియాలో వీరి గురించి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. తమ డబ్బులు తిరిగిచ్చే వరకు వదిలిపెట్టేది లేదని బాధితులు హెచ్చరిస్తున్నారు.

బీ కేర్ ఫెల్..

సైబర్, ఇమ్మిగ్రేషన్ మోసాల్లో ఒకసారి డబ్బులు పోతే, వాటిని లీగల్‌గా రికవరీ చేయడం చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఈ సెలబ్రిటీ జంట తమపై వస్తున్న ఆరోపణలపై మరోసారి సోషల్ మీడియా ముందుకొచ్చి అసలు విషయాలపై క్లారిటీ ఇచ్చి బాధితులకు న్యాయం చేస్తే తప్ప అసలేం జరిగిందనేది క్లారిటీ రాదు. ఏదేమైనా సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చూసి, సెలబ్రిటీల్లా కనిపించే వారిని గుడ్డిగా నమ్మితే ఏం జరుగుతుందో ఈ ఎపిసోడ్‌తో అర్థమవుతుంది. ఎవరిని పడితే వాళ్లని నమ్మి వారి ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Also read: తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Related News

Trading Scam: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ. 25 కోట్ల భారీ స్కామ్.. షాక్‌లో బాధితులు..?

Ameenpur Lake: డేంజర్ బెల్స్.. మాయమైపోతున్న అమీన్‌పూ‌ర్ పెద్ద చెరువు..?

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

Big Stories

×