E-Paper
Advertisement

BSNL Plan: 2 జీబీ డేటా.. 28 రోజుల వ్యాలిడిటీ.. మరీ ఇంత తక్కువ ధరకా?

BSNL Plan: 2 జీబీ డేటా.. 28 రోజుల వ్యాలిడిటీ.. మరీ ఇంత తక్కువ ధరకా?
Advertisement

BSNL Rs. 199 Plan: సరికొత్త, సరసమైన ప్లాన్స్ తో BSNL ప్రైవేట్ టెలికాం కంపెనీలను సవాల్ విసురుతోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ కంపెనీ రూ.200 కంటే తక్కువ ధర కలిగిన  సూపర్ ప్లాన్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. BSNL తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ ప్లాన్ వివరాలను ప్రకటించింది.  ప్రైవేట్ ప్రొవైడర్ల నుండి ఇలాంటి ప్లాన్‌ల కంటే తమ ఆఫర్ ఎంత చౌకగా ఉందో హైలైట్ చేసింది. ఈ ప్లాన్‌ లో అపరిమిత కాలింగ్, ఉచిత SMS సౌకర్యం కూడా అందిస్తోంది.

రూ. 199తో కొత్త ప్లాన్ ప్రకటన

Advertisement

BSNL X హ్యాండిల్ ద్వారా తన కొత్త రూ.199 ప్లాన్ ను పరిచయం చేసింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి టెలికాం సర్కిల్‌ లో ఈ ప్లాన్ అందుబాటులో ఉన్నట్లు BSNL వెల్లడించింది. సబ్‌ స్క్రైబర్లకు అపరిమిత కాలింగ్ లభిస్తుంది. అంతేకాదు, ఉచిత నేషనల్ రోమింగ్‌, రోజువారీ 2GB డేటా, 100 ఉచిత SMSలు అందిస్తుంది. నెల రోజుల్లో మొత్తం 60GB డేటా లభిస్తుంది.

ప్రైవేట్ కంపెనీలతో BSNL ప్లాన్ పోలిక

Advertisement

BSNL దాని రూ.199 ప్లాన్‌ ను ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోల్చింది. రూ.199తో ఒక ప్రైవేట్ ప్రొవైడర్ చౌకైన ప్లాన్ కేవలం 14 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఇది అపరిమిత కాలింగ్, ఉచిత నేషనల్ రోమింగ్, 2GB రోజు వారీ డేటా, 100 ఉచిత SMS వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అంటే, BSNL ప్లాన్ అదే ధరకు 16 అదనపు రోజుల చెల్లుబాటును అందిస్తుంది. మరొక టెలికాం కంపెనీ రూ.379కి 30 రోజుల ప్లాన్‌ ను అందిస్తుంది. అపరిమిత కాలింగ్, ఉచిత నేషనల్ రోమింగ్, 2GB రోజువారీ డేటా, 100 ఉచిత SMSలను అందిస్తుంది. ఇది BSNL ఆఫర్ కంటే రూ.180 ఎక్కువ ఖరీదైనది. మరో ప్రైవేట్ ప్రొవైడర్ రూ.365కి 28 రోజుల చెల్లుబాటుతో రోజువారీ 2GB డేటా ప్లాన్‌ను అందిస్తుంది.

Read Also: BSNL డబుల్ ధమాకా.. పాత ధరకే సూపర్ బెనిఫిట్స్!

BSNL BiTV ప్రీమియం ప్లాన్

BSNL BiTV అనే కొత్త ప్రీమియం ప్లాన్‌ ను కూడా ప్రవేశపెట్టింది.  దీని ధర నెలకు రూ.151, అంటే రోజుకు దాదాపు రూ.5. ఈ ప్లాన్‌తో, వినియోగదారులు 450 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్స్, 25 ప్రముఖ స్ట్రీమింగ్ సేవలను పొందవచ్చు. ఈ ప్లాన్‌ తో వచ్చే అదనపు ఫీచర్లు, ప్రయోజనాలను కంపెనీ వెల్లడించలేదు. మొత్తంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNL ప్రైవేట్ టెలికాం సంస్థలు ధీటైన ప్లాన్స్ ను పరిచయం చేస్తూ వినియోగదారులను మరింతగా ఆకట్టుకుంటుంది.

Read Also:  BSNL డబుల్ ధమాకా.. పాత ధరకే సూపర్ బెనిఫిట్స్!

Related News

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

Big Stories

Advertisement
×