BSNL New Offer: BSNL దిగ్గజ టెలికాం దిగ్గజాలు జియో, ఎయిర్ టెల్ లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్త కొత్త ప్లాన్స్ తో షాక్ మీద షాక్ ఇస్తోంది. తాజాగా మరో కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది. పాత ధరకే వినియోగదారులకు డబుల్ బెనిఫిట్స్ అందిస్తోంది. రూ. 299 ప్రత్యేక ప్లాన్తో రోజుకు 1.5GB డేటాను అందించేది. ఇప్పుడు ఈ ప్లాన్ బెనిఫిట్స్ డబుల్ అయ్యాయి. గత సంవత్సరం జూలైలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ధరలను పెంచాయి. ఈ నేపథ్యంలో చౌకైన ప్లాన్ల కోసం ప్రజలు BSNL వైపు మొగ్గు చూపారు. BSNL కస్టమర్లకు చక్కటి ఫ్లాన్స్ ను అందిస్తూ ఆకట్టుకుంటుంది. అందులో భాగంగానే డబుల్ ధమాకా ఆఫర్ ను తీసుకొచ్చింది. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటంటే..
BSNL డబుల్ ధమాకా స్పెషల్..
BSNL డబుల్ ధమాకా ప్లాన్ ధర రూ. 299. ఈ ప్లాన్ రోజువారీ ఇంటర్నెట్ పరిమితి రెట్టింపు చేసింది. గతంలో ఈ ప్లాన్ రోజుకు 1.5GB డేటాను అందించగా, ఇప్పుడు ఇది రోజుకు 3GB డేటాను అందిస్తుంది. అంటే, రూ. 299 ప్లాన్‌లో మీరు మొత్తం నెలలో 90 GB డేటాను పొందే అవకాశం ఉంటుంది.
BSNL డబుల్ ధమాకా వ్యాలిడిటీ ఎన్ని రోజులు?
BSNL డబుల్ ధమాకా చెల్లుబాటు 30 రోజులు. అంటే, మొత్తం 30 రోజులకు, వినియోగదారులు ప్రతిరోజూ 3GB డేటాను ఉపయోగిస్తారు. ఈ రీఛార్జ్ ప్యాక్ మొత్తం 30 రోజుల చెల్లుబాటు అవుతుంది. వినియోగదారులు నెల 28వ రోజున మరొక రీఛార్జ్ చేయవలసిన అవసరం లేదు.
BSNL డబుల్ ధమాకా ఇతర ప్రయోజనాలు
BSNL డబుల్ ధమాకా ప్యాక్ 3GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. ప్రస్తుతం, జియో, ఎయిర్ టెల్ ఈ ధరతో ఇంత చక్కటి ఫ్లాన్ అందించలేకపోతున్నాయి.
Read Also: రోజూ 3 జీబీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ.. BSNL క్రేజీ ప్లాన్..
BSNL మరొక చౌకైన ప్లాన్
BSNL రూ. 299 ప్లాన్ ఒకవేళ కాస్త ఎక్కువ ధర అనిపిస్తే, రూ. 199 ప్లాన్ ను వాడుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 30 రోజులు. దీనిలోమీరు రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 100SMS పొందుతారు. రూ. 200 కంటే తక్కువ ధరలో ఎక్కువ డేటా , అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను కోరుకునే వారికి ఈ ప్లాన్ సరైనది. సో, మీ వినియోగానికి తగినట్లుగా రూ. 199, రూ. 299 ప్లాన్‌ల మధ్య ఎంచుకోవచ్చు. తక్కువ ధరలు బెస్ట్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ప్లాన్ ట్రై చేయండి!
Read Also: యూట్యూబ్ ద్వారా కళ్లు చెదిరే ఆదాయం.. సింపుల్ గా ఈ టిప్స్ పాటిస్తే చాలు!