BigTV English

Akhanda2 Ott Deal: రికార్డు స్థాయిలో బాలయ్య ఆఖండ2 ఓటీటీ డీల్!

Akhanda2 Ott Deal: రికార్డు స్థాయిలో బాలయ్య ఆఖండ2 ఓటీటీ డీల్!

Akhanda 2 OTT Deal: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna) త్వరలోనే బోయపాటి శ్రీను (Boyapati Sreenu)దర్శకత్వంలో నటించిన అఖండ 2(Akhanda 2) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ విడుదల చేయాలని చిత్రబృందం భావించారు అయితే అదే రోజున పవన్ కళ్యాణ్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అఖండ సినిమాను తిరిగి వాయిదా వేశారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. ఇప్పటివరకు విడుదల గురించి నిర్మాతలు ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.


రూ. 85 కోట్లకు ఆఖండ 2 డిజిటల్ డీల్ ?

ఇక ఈ సినిమా నుంచి ఇదివరకే విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి .ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ భారీ స్థాయిలో పోటీ పడ్డాయని తెలుస్తోంది. అయితే గతంలో అమెజాన్ ఈ సినిమా హక్కులను కైవసం చేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ సినిమా హక్కులను మాత్రం జియో హాట్ స్టార్(Jio Hot Star) కైవసం చేసుకుంది. ఏకంగా 85 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ సినీ కెరియర్ లోని ఈ సినిమాకు భారీ స్థాయిలో డిజిటల్ డీల్ కుదిరినట్టు తెలుస్తోంది.


బాలయ్య సినీ కెరియర్ లోనే భారీ డీల్…

ఈ సినిమా విడుదల విషయానికి వస్తే.. డిసెంబర్ ఐదో తేదీ నుంచి ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా తప్పుకోవడంతో అదే రోజు అఖండ 2 సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా డిసెంబర్ 5వ తేదీ ఈ సినిమా థియేటర్లలో విడుదల కాగా వచ్చే ఏడాది సంక్రాంతికి ఓటీటీలో విడుదల చేయాలనే ఆలోచనలో జియో హాట్ స్టార్ కూడా ఉన్నట్టు సమాచారం. అయితే త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడించనున్నారు. రూ.85 కోట్లకు మేకర్స్ డీల్ ఫిక్స్ చేయడంతో ఇదే ఇటీవల తెలుగు సినిమాకు జరిగిన అతి పెద్ద డీల్ అని తెలుస్తోంది.

బోయపాటి.. బాలయ్య సూపర్ హిట్ కాంబో..

ఇక ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఎం.తేజస్విని సమర్పణలో రామ్ అచంట, గోపీ అచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి బాలయ్యతో పోటీ పడబోతున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేయడంతో సినిమాపై ఎంతో మంచి అంచనాలను పెంచేసింది. బాలకృష్ణ బోయపాటి కాంబో అంటేనే సూపర్ డూపర్ హిట్ అనే సంగతి మనకు తెలిసిందే. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో సింహ, లెజెండ్, అఖండ 2 వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అఖండ 2 పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: Allu Mega Familes: హమ్మయ్య ఎట్టకేలకు అల్లుకుపోయిన మెగా బంధం.. ఆల్ హ్యాపీస్!

Related News

The Door OTT: సుమారు ఐదు నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసిన భావన మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

OTT Movie : IMDbలో 9.4 రేటింగ్… ఈ లవ్ స్టోరీని ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : IMDbలో 9.9 రేటింగ్ ఉన్న పంజాబీ సిరీస్… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు… మస్ట్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : అజ్ఞాత వ్యక్తి నుంచి గిఫ్ట్స్… అమ్మాయే కదాని కిడ్నాప్ చేస్తే, నరకం చూపించే లేడీ సైకో… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా

OTT Movie : మనుషులపై మోహం… ఏ మగాడినీ వదలని ఏలియన్… చిన్నపిల్లలతో చూడకూడని మూవీ

Big Stories

×