Bank Customers Shock: ఖాతాదారులపై ఎడాపెడా వడ్డన మొదలు పెడుతున్నాయి బ్యాంకులు. తొలుత ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఖాతాదారులకు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఏటీఎం డెబిట్ కార్డు ఛార్జీలే కాదు, నెల వారీ ఏటీఎం విత్ డ్రాయల్ పరిమితిలో కోత విధించింది. అకౌంట్లో సరిపడా బ్యాలెన్స్ లేకున్నా పెనాల్టీలు వేయాలని డిసైడ్ అయ్యింది. తీసుకున్న నిర్ణయం సెప్టెంబర్ ఒకటి అనగా మంగళవారం అమల్లోకి వచ్చాయి. ఈ బ్యాంకు దారిలో మరికొన్ని బ్యాంకులు రెడీ అవుతున్నాయి.
తమ ఖాతాదారులకు ఊహించని షాక్ ఇచ్చింది కెనరా బ్యాంక్. ఏటీఎం లావాదేవీల ఛార్జీలు పెంచేసింది. ఏటీఎం కార్డుకు నెలలవారీ ఇచ్చే విత్‌డ్రా ఉచిత లావాదేవీలను తగ్గించింది. డెబిట్ లేదా పొదుపు ఖాతాలో సరిపడిన బ్యాలెన్స్ లేకుండా విత్‌డ్రాకు ప్రయత్నిస్తే పెనాల్టీలు వేయాలని డిసైడ్ అయ్యింది. కొత్త నిబంధనలు మంగళవారం అనగా సెప్టెంబర్ ఒకటి, 2026 నుంచే అమలులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది.
కెనరా బ్యాంక్ ఏటీఎంలకు ఉచిత లావాదేవీల పరిమితి నెలకు 6 ట్రాన్సాక్షన్లు ఉండేవి. ఇప్పుడు ఐదుకు కుదించింది. ఐదు ట్రాన్సాక్షన్లు దాటిన తర్వాత ఖాతాదారులు ఛార్జీలు చెల్లించాలి. ఫైనాన్షియల్, నాన్- ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు అన్నింటికీ వర్తిస్తుంది. అంతేకాదు బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్మెంట్ చేసినా ట్రాన్సాక్షన్‌గా లెక్కిస్తామని తేల్చేసింది.
ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు సేవింగ్స్ అకౌంట్లో సరి పడా డబ్బులు ఉండాలి. ఈ విషయంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వస్తే భారీగా పెనాల్టీ విధించనుంది. నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత రూ.17 ప్లస్ జీఎస్టీ వసూలు చేసేది. ఇకపై ఆ పరిమితి కాస్త రూ.23 ప్లస్ జీఎస్టీకి పెంచింది.
నెలవారీ ఉచిత లిమిట్ దాటిన తర్వాత నగదు విత్ డ్రా చేస్తే ట్రాన్సాక్షన్‌కు రూ.23 ప్లస్ GST ఛార్జీ పడనుంది. ఇప్పటి వరకు రూ.20 ఛార్జీ వసూలు చేసేది. సీనియర్ సిటిజన్లకు కాస్త ఊరట లభించింది. వారికి నెలకు లభించే ఉచిత లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పులు లేవు. నెలకు 8 వరకు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. ఆ పరిమితి దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ.5 ప్లస్ జీఎస్టీ పడుతుంది.
కెనరా బ్యాంక్ క్లాసిక్, స్టాండర్డ్, ప్లాటినం, బిజినెస్, సెలెక్ట్, గ్రీన్ పిన్ జనరేట్ చేసేందుకు ఉచిత ట్రాన్సాక్షన్ లిమిట్ దాటినా రూ.23 ఛార్జీతోపాటు వసూలు చేసేవారు. దాన్ని రూ.5 లకు కుదించింది. మెట్రో నగరాల్లో కెనరా బ్యాంక్ ఏటీఎంల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలు, ఇతర బ్యాంక్ ఏటీఎంల్లో నెలకు 3 వరకు ఉచిత లావాదేవీలు చేయవచ్చు. కెనడా బ్యాంకు దారిలో మరి కొన్ని బ్యాంకులు తమతమ ఖాతాదారులపై వడ్డించేందుకు రెడీ అవుతున్నాయ. కాకపోతే ఎంత పెంచాలన్నదానిపై తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.
ALSO READ: ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే