E-Paper
Advertisement

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!
Advertisement

Philips 50 Inch QLED TV: ప్రస్తుత డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలో ఇంట్లోనే థియేటర్ ఫీల్ పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం.. కేవలం సాధారణ డిస్‌ప్లే సరిపోదు. అద్భుతమైన పిక్చర్ క్వాలిటీతో.. పాటు లౌడ్ అండ్ క్లియర్ ఆడియో ఉండాలి. ఈ అవసరాలను పూర్తిగా తీర్చడానికి ప్రముఖ గ్లోబల్ బ్రాండ్ ఫిలిప్స్ మార్కెట్లోకి తెచ్చిన ఈ మోడల్ క్యూఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ ఇప్పుడు టెక్కీలు, మూవీ లవర్స్ మధ్య హాట్ టాపిక్‌గా మారింది. కేవలం రూ.34,999 బడ్జెట్‌లో లభిస్తున్న ఈ టీవీ, ప్రీమియం సెగ్మెంట్ ఫీచర్లను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. తక్కువ ధరలో బెస్ట్ మోడల్ కావాలనుకునే వారికి ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1.అల్ట్రా-హెచ్‌డి క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లే :

ఈ టీవీ మెయిన్ అట్రాక్షన్ దీని 50 ఇంచుల క్యూఎల్ఈడీ స్క్రీన్. క్యూఎల్‌ఈడీ టెక్నాలజీ కారణంగా కలర్స్ చాలా వైబ్రెంట్‌గా, రిచ్‌గా , సహజంగా కనిపిస్తాయి. దీనికి తోడు ‘వైడర్ కలర్ గామట్’ సపోర్ట్ ఉండటం వల్ల ప్రతి సీన్‌లోనూ షేడ్స్ చాలా స్పష్టంగా బయట పడతాయి. అలాగే డాల్బీ విజన్, HDR 10+ సపోర్ట్ ద్వారా వీడియో కంటెంట్ నెక్స్ట్ లెవెల్ విజువల్ ట్రీట్‌ను ఇస్తుంది.

2.120Hz రిఫ్రెష్ రేట్ , గేమింగ్ :

Advertisement

సాధారణంగా ఈ బడ్జెట్‌లో 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే లభిస్తుంది. కానీ ఫిలిప్స్ ఇందులో ఏకంగా 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించింది. దీని వల్ల ఫాస్ట్-మూవింగ్ యాక్షన్ సీన్స్, స్పోర్ట్స్ మ్యాచ్‌లు, నెక్స్ట్-జెన్ గేమింగ్ సమయంలో పిక్చర్స్ ఎంతో స్మూత్‌గా, బ్లర్ లేకుండా కనిపిస్తాయి. అంతే కాకుండా ఇది గేమర్స్‌కు ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది.

3.30W డాల్బీ అట్మాస్ సౌండ్ , ఆడియో:

మంచి విజువల్స్‌కు తగినట్లుగా పవర్ ఫుల్ సౌండ్ లేకపోతే సినిమా కిక్ రాదు. ఈ సమస్య లేకుండా ఫిలిప్స్ టీవీలో బిల్ట్-ఇన్ స్పీకర్లతో 30W అవుట్‌పుట్‌ను అందించారు. దీనికి డాల్బీ అట్మాస్ ( టెక్నాలజీ తోడవ్వడంతో సౌండ్ కేవలం ముందు నుంచే కాకుండా రూమ్ మొత్తం చుట్టుముట్టి పైనుంచి వస్తున్న ఫీల్ కలుగుతుంది.

Advertisement

Also Read: ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

4.గూగుల్ టీవీ ఓఎస్ , 32 GB స్టోరేజ్:

ఈ స్మార్ట్ టీవీ గూగుల్ టీవీ , ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. దీని ద్వారా.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. వంటి అన్ని పాపులర్ ఓటీటీ యాప్స్‌ను ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అంతే కాకుండా .. ఇందులో లభించే భారీ 32 GB స్టోరేజ్ ద్వారా మీకు నచ్చిన యాప్స్ , గేమ్‌లను ఎలాంటి స్పేస్ ప్రాబ్లమ్ లేకుండా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీని అల్ట్రా నారో బెజెల్ డిజైన్ ఈ టీవీకి మరింత మోడర్న్ లుక్‌ను తెచ్చిపెడుతుంది.

మీ బడ్జెట్ రూ. 35,000 లోపు ఉండి..లేటెస్ట్ ప్రీమియం ఫీచర్లు కలిగిన పెద్ద స్క్రీన్ టీవీ కావాలనుకుంటే.. ఈ మోడల్ మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

Related News

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

Big Stories

Advertisement
×