E-Paper
Advertisement

ఒలింపిక్స్ వివాదం వెనుక అసలు కథ… 6.2 రేటింగ్ ఉన్న మైండ్ బెండింగ్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ

ఒలింపిక్స్ వివాదం వెనుక అసలు కథ… 6.2 రేటింగ్ ఉన్న మైండ్ బెండింగ్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ
Advertisement

Untold Raygun OTT : ఒలింపిక్స్‌లో ఒక్క పాయింట్ కూడా సాధించలేదు… కానీ ప్రపంచం మొత్తం ఆమె గురించే మాట్లాడుకుంది. ఆమె చేసిన డ్యాన్స్ మూవ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, మీమ్స్, ట్రోలింగ్, విమర్శలు వరదలా వచ్చాయి. అసలు ఆమె ఒలింపిక్స్‌కు ఎలా అర్హత సాధించింది ? ఏదైనా మోసం జరిగిందా ? లేక నిజంగానే అర్హత సాధించిందా ? 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రేకింగ్ అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియన్ బీ-గర్ల్ రాచెల్ గన్, అలియాస్ రేగన్ కథ ఇప్పుడు ఓటీటీలో డాక్యుమెంటరీగా మారింది. ‘Untold Raygun: Breaking Badly’ పేరుతో వచ్చిన ఈ స్పోర్ట్స్ డాక్యుమెంటరీలో ఆమె ఒలింపిక్స్‌కు చేరిన ప్రయాణం, ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన తీరు, ఆ తర్వాత ఎదుర్కొన్న ట్రోలింగ్, తప్పుడు ప్రచారం, మానసిక ఒత్తిడి వంటి విషయాలను ఆమె స్వయంగా చెబుతుంది. మరి ప్రపంచం ఆమెను ఎందుకు టార్గెట్ చేసింది ? ఆ వివాదం వెనుక ఉన్న అసలు కథ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

రాచెల్ గన్ యూనివర్సిటీ అకడమిక్‌ గా పని చేసిన వ్యక్తి. బ్రేకింగ్‌ లోకి అడుగు పెట్టిన ఆమె క్రమంగా ఈ డాన్స్ కల్చర్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 2023 WDSF ఓషియానియా బ్రేకింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచి, ఆస్ట్రేలియా తరఫున పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 2024లో బ్రేకింగ్ తొలిసారి ఒలింపిక్స్‌లో భాగం కావడంతో ఆమెపై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Advertisement

కానీ పారిస్‌లో ఆమె చేసిన పెర్ఫార్మెన్స్ ఊహించని విధంగా వైరల్ అయింది. కంగారూ హాప్, స్ప్రింక్లర్ లాంటి మూవ్స్‌తో చేసిన ఆమె రొటీన్‌ కు ఒక్క జడ్జి ఓటు కూడా రాలేదు. అయినా ఆమె ఒక్క రాత్రిలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సరదా మీమ్స్ కాస్తా తీవ్రమైన ట్రోలింగ్‌ గా మారాయి. ఆమె ఒలింపిక్స్‌కు ఎలా ఎంపికైందనే విషయంలో తప్పుడు ఆరోపణలు, కుట్ర సిద్ధాంతాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

డాక్యుమెంటరీ ఇక్కడే ఆసక్తికరంగా మారుతుంది. రేగన్ తన అనుభవాన్ని, ఒలింపిక్ వేదికపైకి వెళ్లే ముందు ఎదురైన భయాన్ని, వైరల్ అయిన తర్వాత తనపై పడిన మానసిక భారాన్ని వివరిస్తుంది. కుటుంబ సభ్యులు, భర్త శామ్యూయేల్ ఫ్రీ, ఆమెకు పరిచయమైన ఇతర బీ-గర్ల్స్ కూడా తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అయితే ఈ కథ ఆమె ఓడిపోయిందా లేదా అన్న విషయం గురించి కాదు. ఒక వ్యక్తి ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఒక మీమ్‌గా మారినప్పుడు అతని జీవితంపై ఆ ప్రభావం ఎలా పడుతుంది అనే పాయింట్ తో నడుస్తుంది.

Advertisement

Also Read : వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

తెలుగులో అందుబాటులో ఉందా?

చాప్‌మన్ వే, మాక్‌లైన్ వే దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ సుమారు 72 నిమిషాల నిడివి ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఇంగ్లీష్ భాషలో రూపొందింది. ప్రస్తుతం తెలుగు ఆడియో లేదు. ఒలింపిక్స్, డ్యాన్స్, సోషల్ మీడియా వివాదాలు వంటి ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ డాక్యుమెంటరీలో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. అందుకే ఇదొక డిఫరెంట్ స్పోర్ట్స్ డ్రామా. ముఖ్యంగా వైరల్ అయిన కొన్ని నిమిషాల వెనుక ఒక మనిషి ఎంతటి ఒత్తిడిని ఎదుర్కొన్నాడో తెలుసుకోవాలంటే దీన్ని చూడొచ్చు.

Tags

Related News

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

Big Stories

Advertisement
×