E-Paper
Advertisement

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదా? హాస్పిటల్ బిల్స్ ఈఎంఐలో చెల్లించవచ్చు.. ఎలాగంటే?

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదా? హాస్పిటల్ బిల్స్ ఈఎంఐలో చెల్లించవచ్చు.. ఎలాగంటే?
Advertisement

Medical EMIs for hospital bills| కుటుంబంలో ఎవరికైనా అకస్మాత్తుగా అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళ్లడం తప్పనిసరి అవుతుంది. అయితే, చికిత్స ఖర్చులు లక్షల్లో ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ లేని కుటుంబాలు అప్పులు చేయడం లేదా పొదుపు మొత్తాన్ని ఖర్చు చేయడం వంటి పరిస్థితులను ఎదుర్కొంటాయి. ఇలాంటి సమయంలో హాస్పిటల్ బిల్లులను నెలవారీ వాయిదాల్లో చెల్లించే మెడికల్ ఈఎంఐలు కొంత ఉపశమనం కలిగించవచ్చు. అయితే, ఈ సౌకర్యాన్ని ఎంచుకునే ముందు వడ్డీ, ఇతర ఛార్జీలు, తిరిగి చెల్లించాల్సిన మొత్తం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మెడికల్ ఈఎంఐలు ఎందుకు ప్రాధాన్యం పొందుతున్నాయి?

భారతదేశంలో చాలామంది తమ వైద్య ఖర్చులను సొంత డబ్బుతోనే చెల్లిస్తున్నారు. 2021–22లో దేశ మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రజలు నేరుగా భరించిన ఖర్చు 39 శాతంగా నమోదైందని ఆర్థిక నిపుణుడు పరమ్‌దీప్ సింగ్ పేర్కొన్నారు. కేర్‌పే సహ వ్యవస్థాపకుడు, సీఈఓ గౌరవ్ గుప్తా కూడా డబ్బులు వెంటనే అందుబాటులో లేకపోవడంతో కొందరు చికిత్సను వాయిదా వేస్తున్నారని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి 10 మంది రోగుల్లో ఆరుగురు చికిత్సను ఆలస్యం చేస్తున్నారు. అలా ఆలస్యం చేసే వారిలో 93 శాతం మందికి వారి వద్ద ఆ సమయంలో నగదు అందుబాటులో లేకపోవడం కారణమని ఆయన వివరించారు.
మెడికల్ ఈఎంఐల ద్వారా పెద్ద మొత్తాన్ని ఒకేసారి చెల్లించకుండా, చిన్న మొత్తాలుగా నెలనెలా చెల్లించవచ్చు. అయితే, ఇది అప్పు తీసుకునే సదుపాయమే తప్ప ఉచిత వైద్య సేవ కాదు.

రూ.5 లక్షల హాస్పిటల్ బిల్లుకు ఎంత ఈఎంఐ చెల్లించాలి?

Advertisement

ఉదాహరణకు.. రూ.5 లక్షల వైద్య ఖర్చును 24 నెలల కాలానికి, ఏడాదికి 15 శాతం వడ్డీతో రుణంగా తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు నెలవారీ ఈఎంఐ సుమారు రూ.24,200 అవుతుంది. రెండేళ్లలో మొత్తం వడ్డీ దాదాపు రూ.82,000 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మొత్తం చెల్లింపు సుమారు రూ.5.82 లక్షలకు చేరుతుంది. ఇందులో ఇతర ఛార్జీలు కలిపితే ఖర్చు మరింత పెరగవచ్చు. అందువల్ల, ఈఎంఐ మీ నెలవారీ ఆదాయానికి సరిపోతుందో లేదో ముందుగా పరిశీలించాలి.

మెడికల్ ఈఎంఐ తీసుకునే ముందు ఏం పరిశీలించాలి?

ముందుగా రుణంపై ఎంత వడ్డీ పడుతుందో తెలుసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజులు, ఆలస్యంగా చెల్లిస్తే విధించే జరిమానాలు కూడా పరిశీలించాలి. జీరో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంటే దానిలో దాగి ఉన్న ఛార్జీలు ఏమైనా ఉన్నాయో అడగాలి. అలాగే, ముందుగానే పూర్తి బిల్లు చెల్లిస్తే తగ్గింపు లభిస్తుందా అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అందుబాటులో ఉన్న ఇతర ఆర్థిక సదుపాయాలను పోల్చి చూసి, అన్ని నిబంధనలు చదివిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

Advertisement

Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తొలిసారి తీసుకుంటున్నారా? ముందు ఈ 4 విషయాలు తప్పక చెక్ చేయండి

మెడికల్ ఈఎంఐలు హెల్త్ ఇన్సూరెన్స్‌కు ప్రత్యామ్నాయమా?

కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నిబంధనల ప్రకారం.. అర్హమైన వైద్య ఖర్చులను కవర్ చేయవచ్చు. మెడికల్ ఈఎంఐ మాత్రం చికిత్స కోసం తీసుకున్న అప్పును వాయిదాల్లో తిరిగి చెల్లించడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల, అత్యవసర వైద్య ఖర్చుల కోసం ఈఎంఐ ఉపయోగపడినా, భవిష్యత్తులో ఆర్థిక రక్షణ కోసం సరైన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

Also Read: భారీ ఖర్చు చేశాక పెళ్లి వాయిదా లేదా రద్దు అయిందా.. ఆర్థిక భద్రత కోసం ఇన్సూరెన్స్ ఉందిగా

Related News

ఎస్‌బీఐ కస్టమర్ల డేటా లీక్.. మీకూ అకౌంట్ ఉందా? వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి

రిటైర్మెంట్ తరువాత నెలవారీ అద్దె ఆదాయం కోసం షాప్ కొంటున్నారా? కొనేముందు ఈ లెక్కలు వేసుకోండి

అప్పట్లో సామాన్యులను లక్షాధిపతులను చేసిన ధీరుభాయ్.. ‘జియో’ IPOతో అది సాధ్యమేనా?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఏం జరిగింది? ఇద్దరు సీనియర్‌ అధికారులపై విచారణ పూర్తి! రేపో మాపో చర్యలు

40 ఏళ్ల వయసు నుంచి రిటైర్మెంట్ ప్లానింగ్.. ఇలా పెట్టుబడి చేస్తే రూ.3 కోట్ల రాబడి

దీపావళి ముందు తగ్గిన బంగారం ధరలు.. మరింత తగ్గుతాయా?

దేశంలో అతిపెద్ద జియో ఐపీఓ.. బుధవారం నుంచి ప్రారంభం, 22 శాతానికి చేరిన జీఎంపీ

Big Stories

Advertisement
×