Sai Durga Tej : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లిళ్ల తంతు కొనసాగుతుందన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఎన్ని హీరోలు అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలోని యంగ్ హీరోలు అందరూ కూడా పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే ఇప్పుడు బ్యాచిలర్స్ గా ఉన్న మరికొందరు హీరోలు కూడా పెళ్లి బాట పట్టినట్లు గత రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మూగబోతున్నాయి అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతున్నారని ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది.. మరి తేజు చేసుకోబోతున్న అమ్మాయి ఈమెనే అని ఓ వార్త ప్రచారంలో ఉంది.. మరి ఆమె ఎవరో ఒకసారి తెలుసుకుందాం..
మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మూగబోతున్నాయి అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఇటీవలే అల్లు శిరీష్ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు ఇప్పుడు మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా పెళ్లి పీటలు లెక్క పోతున్నాడు అని గత రెండు రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. మొన్నటి వరకు ఈ హీరో నిహారిక ని పెళ్లి చేసుకోబోతున్నాడు అని వార్తలు వినిపించాయి. ఇప్పుడేమో మరి కొత్త అమ్మాయితో పెళ్లి పీటలు లేకపోతున్నాడు అంటూ మరో వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అయితే ఈ ఫ్యామిలీ మెంబర్స్ చూసిన ఒక ఉద్యోగం చేసుకునే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. సాయి దుర్గా తేజ్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు, ఆయన చిన్ననాటి స్నేహితురాలే అని వినికిడి. ఇప్పటివరకు ఫ్రెండ్స్ లాగా ఉన్నాయి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దాంతో త్వరలోనే ఇద్దరు పెళ్లి జరగనుందని టాక్ వినిపిస్తోంది. నవంబర్లో నిశ్చితార్థం చేసుకొని డిసెంబర్ లో పెళ్లి చేసే ఆలోచనలో మెగా ఫ్యామిలీ కూడా ఉన్నట్లు ఓ వార్త వినిపిస్తుంది. అతి త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రానుంది.
మెగా హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం భారీ యాక్షన్ చిత్రమ్ సంబరాల ఏటిగట్టు మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ మూవీ ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ని అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక దీంతోపాటు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. మొత్తానికి సాయి ధరమ్ తేజ్ వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతూ వస్తున్నాడు.. మరి పెళ్లి తర్వాత ఇతని జీవితం ఎలా మారుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..