E-Paper
Advertisement

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు
Advertisement

Credit card : ఒకప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించే క్రెడిట్ కార్డులు ఇప్పుడు కోట్లాది మంది జీవితాల్లో విడదీయరాని భాగంగా మారిపోయాయి. ఆన్‌లైన్ షాపింగ్ నుంచి విమాన టికెట్ల బుకింగ్ వరకు, EMIల నుంచి క్యాష్‌బ్యాక్ ఆఫర్ల వరకు ప్రతి అవసరంలోనూ క్రెడిట్ కార్డులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చేతిలో డబ్బు లేకపోయినా కొనుగోళ్లు చేసే వెసులుబాటు కల్పించడం వల్ల వీటి వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే ఈ సౌకర్యం వెనుక ఒక పెద్ద బాధ్యత కూడా దాగి ఉంటుంది. సరైన అవగాహన లేకుండా క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే అది ఆర్థిక స్వేచ్ఛను ఇవ్వడం కంటే అప్పుల భారాన్ని పెంచే ప్రమాదం ఉంది.

చాలా మంది కార్డు బిల్లు వచ్చిన తర్వాత పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా కేవలం కనీస బకాయిని మాత్రమే చెల్లిస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఆలస్య రుసుములు తప్పించుకున్నామనిపించినా, మిగిలిన మొత్తంపై అధిక వడ్డీ కొనసాగుతూనే ఉంటుంది. మొదట చిన్న మొత్తంగా కనిపించే ఈ బకాయి, కాలక్రమేణా భారీ అప్పుగా మారి ఆర్థిక ఒత్తిడికి కారణమవుతుంది. క్రెడిట్ కార్డుకు నిర్ణయించిన పరిమితి ఉన్నప్పటికీ, కొందరు దాదాపు మొత్తం లిమిట్‌ను వినియోగించడం అలవాటు చేసుకుంటారు. దీనివల్ల క్రెడిట్ వినియోగ రేషియో పెరుగుతుంది. ఆర్థిక సంస్థలు ఈ అంశాన్ని చాలా ప్రాముఖ్యంగా పరిగణిస్తాయి. పరిమితికి దగ్గరగా లేదా పూర్తిగా కార్డు వినియోగించడం వల్ల సిబిల్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో వ్యక్తిగత రుణం లేదా గృహ రుణం పొందాలనుకున్నప్పుడు ఇది అడ్డంకిగా మారవచ్చు.

Advertisement

క్రెడిట్ కార్డు బిల్లులను గడువులోగా చెల్లించడం అత్యంత ముఖ్యమైన విషయం. ఒక రోజు లేదా రెండు రోజుల ఆలస్యం కూడా కొన్నిసార్లు జరిమానాలు, అదనపు వడ్డీ భారాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా, చెల్లింపు చరిత్ర దెబ్బతింటే సిబిల్ స్కోర్ కూడా తగ్గే ప్రమాదం ఉంటుంది. మంచి ఆర్థిక గుర్తింపు కోసం సమయానికి చెల్లింపులు చేయడం తప్పనిసరి. అత్యవసర సమయంలో ఏటీఎం నుంచి నగదు తీసుకోవడానికి కొందరు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తారు. కానీ ఇది అత్యంత ఖరీదైన ఎంపికల్లో ఒకటి. అక్కడ డబ్బు తీసుకున్న క్షణం నుంచే వడ్డీ లెక్కించడం ప్రారంభమవుతుంది. అదనంగా నగదు ఉపసంహరణ ఛార్జీలు కూడా చెల్లించాల్సి వస్తుంది. అందుకే అత్యవసర పరిస్థితులు తప్ప ఈ సదుపాయాన్ని ఉపయోగించకపోవడం మంచిది.

Also Read : నెట్ ఫ్లిక్స్ లో దాగి ఉన్న హిడెన్ జెమ్స్ ఈ విజువల్ వండర్స్… ఒక్కటన్నా చూశారా ?

Advertisement

మరో సాధారణ తప్పు అవసరం లేకపోయినా అనేక క్రెడిట్ కార్డులను కలిగి ఉండటం. ఎక్కువ కార్డులు ఉంటే ఖర్చులను ట్రాక్ చేయడం కష్టమవుతుంది. ప్రతి కార్డు బిల్లింగ్ తేదీ, చెల్లింపు గడువు, వార్షిక రుసుములు వేర్వేరుగా ఉండటం వల్ల ఏదైనా చెల్లింపును మరిచిపోయే అవకాశం పెరుగుతుంది. ఫలితంగా అనవసర జరిమానాలు, వడ్డీ భారం, సిబిల్ స్కోర్ నష్టం లాంటి సమస్యలు ఎదురవుతాయి.

Related News

స్టాక్‌మార్కెట్‌లో బ్లాక్ మండే.. కొంప ముంచిన ఆ రంగాల షేర్లు, 4 లక్షల కోట్ల సంపద ఆవిరి

భారీ ఖర్చు చేశాక పెళ్లి వాయిదా లేదా రద్దు అయిందా.. ఆర్థిక భద్రత కోసం ఇన్సూరెన్స్ ఉందిగా

ఆస్తులు బోలెడున్నా చేతిలో నగదు ఉండదు.. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక కష్టాలను నివారించడానికి ఇలా చేయండి

పెళ్లిలో లభించిన బహుమతులుపై ట్యాక్స్ కట్టాలా? ఆదాయపు పన్ను నిబంధనలు ఇవే..

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

Big Stories

Advertisement
×