E-Paper
Advertisement

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం
Advertisement

SIP : మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే లక్షలాది మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. జీతం వచ్చిన వెంటనే నెల మొదట్లో SIP చేయాలా? లేదా నెలాఖరులో పెట్టుబడి పెడితే ఎక్కువ యూనిట్లు వస్తాయా? ఒక నిర్దిష్ట తేదీని ఎంచుకుంటే రాబడులు భారీగా పెరుగుతాయా? వైట్‌ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ నిర్వహించిన అధ్యయనం ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. 1993 నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు దశాబ్దాల సెన్సెక్స్ చరిత్రను విశ్లేషించిన ఈ అధ్యయనం SIP పెట్టుబడిదారులు ఎక్కువగా నమ్మే ఒక అపోహను పూర్తిగా చెదరగొట్టింది.

30 ఏళ్ల డేటా ఏం చెబుతోంది ?

సాధారణంగా మార్కెట్‌లో నెలాఖరులో అమ్మకాలు పెరగడం లేదా తాత్కాలిక ఒత్తిడి కారణంగా నెట్‌ అసెట్‌ వ్యాల్యు(NAV)లు తగ్గుతాయని, అప్పుడు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ 30 సంవత్సరాల డేటా మాత్రం ఇది రాంగ్‌ అని చెబుతోంది. మూడు దశాబ్దాలుగా ప్రతి నెలా వేర్వేరు తేదీల్లో SIPలు చేసినట్లయితే ఫలితాలు డిఫరెంట్‌గా వచ్చాయి. గత 10 సంవత్సరాల రోలింగ్ రాబడులను పరిశీలించినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి.

Advertisement

Also Read : రెండ్రోజుల బ్యాటరీ లైఫ్‌… కొత్తగా లాంచ్ అయిన ఈ ఇయర్‌బడ్స్ ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే భయ్యా

నెల మొదటి ఐదు రోజుల్లో పెట్టుబడి పెట్టిన వారి సగటు ఎక్స్‌టెండెడ్‌ ఇంటర్నెల్‌ రేట్‌ ఆఫ్‌ రిటర్న్(XIRR) దాదాపు 15.22 శాతంగా నమోదైంది. నెల మధ్యలో 12 నుంచి 15వ తేదీ మధ్య పెట్టుబడి పెట్టిన వారికి సగటు రాబడి 15.26 శాతంగా ఉంది. ఇక నెలాఖరులో 25 నుంచి 28వ తేదీ మధ్య SIPలు చేసిన వారి సగటు రాబడి 15.24 శాతంగా నమోదైంది. ఈ సంఖ్యలను పరిశీలిస్తే తేదీల మధ్య తేడా కేవలం 0.02 నుంచి 0.04 శాతం మాత్రమేనని స్పష్టమవుతోంది.

Advertisement

Also Read : భారతదేశంలో స్కైడైవింగ్… ఎక్కడెక్కడ చేయవచ్చో తెలిస్తే సాహస ప్రియులు ఎగిరి గంతేస్తారు

మార్కెట్‌ హెచ్చుతగ్గులు సహజమేనా ?

ఈ అధ్యయనం మొత్తం విశ్లేషిస్తే మనకు అర్థమయ్యే విషయం ఒక్కటే. SIP విజయాన్ని నిర్ణయించేది తేదీ కాదు.. మనం పెట్టుకునే కాలవ్యవధి. మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలం క్రమశిక్షణతో కొనసాగించే పెట్టుబడే అసలైన సంపదను సృష్టిస్తుంది. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు పడిపోతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ ప్రతి నెలా నాన్‌స్టాప్‌గా పెట్టుబడి పెడితే కాస్ట్ యావరేజింగ్ అనే ఫార్ములా ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గులు సహజంగానే ఉంటాయి.

Also Read : ట్రూ హర్రర్ మూవీ లవర్సా… ఈ ఇండోనేషియన్ సూపర్ నేచురల్ మూవీస్ ను డోంట్ మిస్

Tags

Related News

ఫుడ్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. SBI ఎటర్నల్ కార్డ్ లాంచ్.. ఉచితంగా జొమాటో గోల్డ్ సేవలు!

బంగారం-వెండి వస్తువుల ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

చిన్న వయసులోనే కోటీశ్వరుడు అవ్వడం ఎలా? ఇదిగో అత్యుత్తమ ప్లాన్.. రూ.10 వేలు ఉంటే చాలు!

పోటీకి మేం సిద్ధమే.. మస్క్ ఆరోపణలపై రిలయన్స్ స్ట్రాంగ్ కౌంటర్

మధ్యతరగతి రిటైర్మెంట్ కోసం రూ.1 కోటి సరిపోతుందా? భవిష్యత్తు కోసం మేజిక్ ఫిగర్ ఎంత?

భార్య లోన్ కట్టకపోతే భర్త పెన్షన్ డబ్బులు కట్ చేసిన బ్యాంక్.. కోర్టు తీర్పు ఇదే

తప్పుడు అకౌంట్‌కు యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ అయిందా? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయండి!

డబ్బులు కావాలని ఫోన్ చేస్తే.. బంధువులు, స్నేహితులకు ‘నో’ చెప్పడం ఎలా?

Big Stories

Advertisement
×