E-Paper
Advertisement

DMart Discounts: డిమార్ట్ లో బంపర్ ఆఫర్లు.. ఆ వస్తువులపై ఏకంగా 80 శాతం డిస్కౌంట్లు!

DMart  Discounts: డిమార్ట్ లో బంపర్ ఆఫర్లు.. ఆ వస్తువులపై ఏకంగా 80 శాతం డిస్కౌంట్లు!
Advertisement

DMart May 2026 Sale: ప్రముఖ వన్ స్టాప్ సూపర్ మార్కెట్ డిమార్ట్ మే నెలకు సంబంధించి వినియోగదారులను ఆకట్టుకునేలా భారీ క్లియరెన్స్ సేల్‌ ను  నిర్వహిస్తోంది. ముఖ్యంగా మే రెండో, మూడో వారాల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉండటంతో స్టోర్లలో కొనుగోలుదారుల రద్దీ పెరుగుతోంది. కిరాణా వస్తువులు, గృహోపకరణాలు, వంటసామాగ్రి, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ప్రకటించింది.

ఆ వస్తువులపై ఏకంగా 80 శాతం డిస్కౌంట్

ఈ సేల్‌ లో కొన్ని వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ముఖ్యంగా ఇంటి అవసరాలకు ఉపయోగించే వస్తువులు, కిచెన్ ఐటమ్స్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులపై ప్రత్యేక ధరలు అందుబాటులో ఉన్నాయి. పాత స్టాక్ క్లియర్ చేయడానికి కంపెనీ ఈ భారీ తగ్గింపులను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. తక్కువ ధరకే ఎక్కువ వస్తువులు కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది.

సగం ధరలకే వస్తువులు

Advertisement

అటు హాఫ్ ప్రైస్ స్టోర్ పేరుతో మరో ప్రత్యేక ఆఫర్ కూడా కొనసాగుతోంది. ఈ విభాగంలో ప్లాస్టిక్ ఆర్గనైజర్లు, హ్యాంగర్లు, సోఫా కవర్లు, స్టోరేజ్ బాక్సులు, కిచెన్ యుటెన్సిల్స్ లాంటి గృహ అవసరాల వస్తువులపై 50 శాతం వరకు తగ్గింపులు అందిస్తున్నారు. కొత్త ఇంటి సామాను కొనాలనుకునేవారికి ఈ ఆఫర్లు ఉపయోగపడనున్నాయి.

కిరాణా సామాన్లపై భారీగా తగ్గింపు

కిరాణా సామాన్ల పైనా డిమార్ట్ భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. బ్రాండెడ్ వంట నూనెలు, నెయ్యి, పప్పులు, బియ్యం, డ్రై ఫ్రూట్స్ లాంటి నిత్యావసర వస్తువులపై ధరలు తగ్గించారు. అదనంగా డిమార్ట్ ప్రీమియా బ్రాండ్ ఉత్పత్తులపై కూడా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. కుటుంబ అవసరాల కోసం నెలవారీ షాపింగ్ చేసే వారికి ఖర్చు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.

Advertisement

పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ పైనా ఆకట్టుకునే డీల్స్ అందిస్తోంది డిమార్ట్. ఎంపిక చేసిన హెయిర్ కేర్, స్కిన్ కేర్ ఉత్పత్తులపై బైవన్ గెట్ వన్ ఆఫర్లు కొనసాగుతున్నాయి. షాంపూ, సబ్బులు, ఫేస్ వాష్, క్రీములపై మంచి ఆఫర్లు ఉన్నాయి. యువత, మహిళలు ఎక్కువగా ఈ ఆఫర్లను ఉపయోగించుకుంటున్నారు.

ఆన్ లైన్ షాపింగ్ పైనా ఆఫర్లు   

ఆన్‌ లైన్‌ లో షాపింగ్ చేసే వారి కోసం కూడా ప్రత్యేక తగ్గింపులు ఉన్నాయి. డిమార్ట్ రెడీ ద్వారా కిరాణా వస్తువులు, డ్రై ఫ్రూట్స్, గృహోపకరణాలపై 20 శాతం వరకు తగ్గింపులు అందిస్తున్నారు. హోం డెలివరీ సౌకర్యం ఉండటంతో చాలామంది ఆన్‌లైన్ ఆర్డర్లకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు, డిజిటల్ పేమెంట్ చేసే వారికి క్యాష్‌ బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. పేటీఎం UPI ద్వారా చెల్లిస్తే రూ.200 వరకు క్యాష్‌ బ్యాక్ పొందే అవకాశం అందిస్తున్నారు. కొన్ని బ్యాంక్ వోచర్లు, మ్యాజిక్‌ పిన్ లాంటి ఆఫర్ల ద్వారా అదనపు తగ్గింపులు కూడా లభిస్తున్నాయి.  ఈ ఆఫర్లు స్టోర్లలో మాత్రమే కాకుండా ఆన్‌ లైన్‌ లో కూడా అందుబాటులో ఉండటంతో వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.

Read Also: ఏపీలో ఎక్కువ.. అండమాన్ లో తక్కువ.. ఇవాళ్టి పెట్రోల్, డీజిలో రేట్లు ఇవే!

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×