E-Paper
Advertisement

ఆల్కహాల్‌తో కలిపి పొరపాటున కూడా.. ఈ స్నాక్స్ తినొద్దు

ఆల్కహాల్‌తో కలిపి పొరపాటున కూడా.. ఈ స్నాక్స్ తినొద్దు
Advertisement

Foods to avoid with alcohol: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. కానీ అప్పుడప్పుడు తీసుకునే వారు కూడా కొన్ని తప్పులు చేయడం వల్ల ఆ ప్రభావం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా.. మద్యం తాగేటప్పుడు మనం తీసుకునే స్నాక్స్ లేదా ఆహారం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు ఆల్కహాల్‌తో కలిసినప్పుడు జీర్ణక్రియను దెబ్బతీయడమే కాకుండా.. తీవ్రమైన అసిడిటీ,తలనొప్పి, డీహైడ్రేషన్‌కు దారి తీస్తాయి. హ్యాంగోవర్ వంటి సమస్యలను తగ్గించుకోవడానికి డ్రింక్ చేసినప్పుడు ఏ ఏ ఆహారాలకు దూరంగా ఉండాలో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

మద్యం తాగేటప్పుడు దూరంగా ఉండాల్సిన ఆహారాలు:

Advertisement

మద్యం తాగడం వల్ల శరీరం సహజంగానే డీహైడ్రేషన్‌కు గురవుతుంది.ఈ సమయంలో మనం ఎంచుకునే ఆహారం ఆ ప్రభావాన్ని తగ్గించాలి కానీ, పెంచకూడదు. చాలా మంది చికెన్ ఫ్రై, చిప్స్ లేదా మసాలా వంటకాలను ‘చాఖ్నా’గా తీసుకుంటారు. కానీ సైన్స్ ప్రకారం ఇవి మీ శరీరానికి చాలా హాని చేస్తాయి.

1. ఉప్పగా ఉండే పదార్థాలు:
మద్యం తాగేటప్పుడు చిప్స్, సాల్టెడ్ పల్లీలు లేదా ఉప్పు ఎక్కువగా ఉన్న స్నాక్స్ తినడం మనకు అలవాటు. ఉప్పు శరీరంలో డీహైడ్రేషన్‌ను పెంచుతుంది. ఇది మిమ్మల్ని మరింత ఎక్కువగా మద్యం తాగేలా ప్రేరేపిస్తుంది. దీని వల్ల మరుసటి రోజు విపరీతమైన తలనొప్పి, అలసట వచ్చే అవకాశం ఉంది.

Advertisement

2. పాల పదార్థాలు:
మద్యం తాగడానికి ముందు లేదా తాగేటప్పుడు పాలు, పెరుగు, చీజ్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ పొట్టలోని లైనింగ్‌ను ఇబ్బంది పెడుతుంది. దీనికి పాలు తోడైతే గ్యాస్, కడుపు ఉబ్బరం, వాంతులు అయ్యే ప్రమాదం ఉంది.

3. కెఫీన్ ఉన్న డ్రింక్స్:
చాలా మంది ఎనర్జీ డ్రింక్స్ లేదా కాఫీని మద్యంతో కలిపి తీసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన కాంబినేషన్. ఆల్కహాల్ మిమ్మల్ని నిద్రపోయేలా చేస్తే, కెఫీన్ మిమ్మల్ని నిద్రలేకుండా ఉంచుతుంది. దీని వల్ల మీరు ఎంత తాగుతున్నారో మీ మెదడు గుర్తించలేదు. ఇది ఆల్కహాల్ పాయిజనింగ్‌కు దారి తీయవచ్చు.

4. సిట్రస్ పండ్లు:
నిమ్మకాయ, ఆరెంజ్ వంటి పుల్లని పండ్లలో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మద్యంలో కూడా అసిడిక్ గుణాలు ఉండటం వల్ల.. ఇవి రెండూ కలిస్తే తీవ్రమైన గుండెల్లో మంట, అసిడిటీకి కారణమవుతాయి.

Also Read: రాలిన జుట్టు మళ్ళీ మొలవాలంటే.. ఈ హోమ్ మేడ్ హెయిర్ స్ప్రేలను వాడాల్సిందే..

5. చాక్లెట్లు :
చాక్లెట్‌లో ఉండే కెఫీన్ , ఫ్యాట్ మద్యంతో కలిసినప్పుడు గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలను కలిగిస్తాయి. ఇది మీ కడుపులోని యాసిడ్ రిఫ్లక్స్‌ను ప్రేరేపిస్తుంది. దీనివల్ల అసౌకర్యంగా అనిపిస్తుంది.

6. స్పైసీ, ఫ్రైడ్ ఫుడ్ :
నూనెలో వేయించిన చికెన్, ఫ్రైస్ వంటివి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి కాలేయం పై అదనపు భారాన్ని పెంచుతాయి. మద్యంతో పాటు ఇవి తీసుకుంటే కడుపులో మంట, అజీర్తి తప్పవు.

ఏమి తీసుకోవాలి?
మద్యం సేవించేటప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాలి. దోసకాయ ముక్కలు, ఉడకబెట్టిన గుడ్లు లేదా తక్కువ మసాలా ఉన్న గ్రిల్డ్ చికెన్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం బెస్ట్.

Related News

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

Big Stories

Advertisement
×