E-Paper
Advertisement

India Currency: దేశంలో రూ.40 లక్షల కోట్ల కరెన్సీ.. తెలుగు రాష్ట్రాల్లో అధికంగా రూ.100 నోట్లు

India Currency: దేశంలో రూ.40 లక్షల కోట్ల కరెన్సీ.. తెలుగు రాష్ట్రాల్లో అధికంగా రూ.100 నోట్లు
Advertisement

India Currency: దేశ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అలాగే చలామణిలో ఉన్న కరెన్సీ రూ. 40 లక్షల కోట్లకు చేరుకుంది. ఎస్బీఐ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా కరెన్సీ, యూపీఐ లావాదేవీలలో ఒకేసారి పెరుగుదల కనిపించిందన్నారు. ఎస్బీఐ సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో దాదాపు రూ.40 లక్షల కోట్ల నగదు ఉందని తెలిపింది. ఇది గత సంవత్సరం కంటే 5.3 శాతం ఎక్కువని పేర్కొంది. ఏప్రిల్ 2025 నుండి జనవరి 2026 వరకు చలామణిలో ఉన్న కరెన్సీ రూ. 2.76 లక్షల కోట్లు పెరిగింది. అంతకు ముందు ఇదే సమయానికి చలామణిలో ఉన్న కరెన్సీ రూ. 88,817 కోట్ల పెరుగుదల నమోదు చేసింది.

97 శాతం ప్రజల వద్దే కరెన్సీ

చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో దాదాపు 97.6 శాతం ప్రజల వద్దే ఉంది. దీని విలువ రికార్డు స్థాయిలో రూ. 39 లక్షల కోట్లకు పెరిగి 11.5 శాతం వార్షిక వృద్ధిని నమోదయ్యింది. 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రజల వద్ద కరెన్సీ పెరగనుందని నివేదికలు చెబుతున్నాయి. 2021లో రూ.4.6 లక్షల కోట్ల నగదు ఉండగా, కరోనా తర్వాత కరెన్సీ చలామణి తగ్గింది. కరెన్సీ వినియోగం పెరుగుతున్నప్పటికీ.. కరెన్సీ-జీడీపీ నిష్పత్తి క్రమంగా తగ్గుతుంది. 2021లో 14.4 శాతం నుంచి 2026లో దాదాపు 11 శాతానికి ఈ నిష్పత్తి తగ్గింది.

Advertisement

ఏటీఎం విత్ డ్రాలు జీడీపీలో ఒక శాతంగా ఉన్నాయి. మొత్తం ఆర్థిక లావాదేవీలలో డిజిటల్ చెల్లింపులు పెరిగాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. అదే సమయంలో, యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. నెలవారీ యూపీఐ లావాదేవీలు రూ. 28.3 లక్షల కోట్లుగా ఉన్నాయి. యూపీఐ విలువ ఆర్థిక వ్యవస్థలోని మొత్తం కరెన్సీ స్టాక్‌లో దాదాపు 70 శాతంగా ఉంది.

18 వేల జీఎస్టీ నోటీసులు

2022- 2025 మధ్య రూ. 40 లక్షల పరిమితి మించిన యూపీఐ లావాదేవీలకు కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖ జులై 2025లో సుమారు 18,000 జీఎస్టీ నోటీసులు జారీ చేసింది. అభివృద్ధి చెందుతున్న ద్రవ్య డిమాండ్ డైనమిక్స్. SBI రీసెర్చ్ FY18 నుండి FY26 (Q3) వరకు అంచనా వేసిన ఆగ్మెంటెడ్ ద్రవ్య డిమాండ్ ఫంక్షన్, GDP వృద్ధి ద్రవ్య డిమాండ్‌తో సానుకూలంగా సంబంధం కలిగి ఉన్నప్పటికీ, గుణకం గణాంకపరంగా చాలా తక్కువగా ఉందని చూపించింది.

Advertisement

మార్చి 2025 నాటికి, మొత్తం కరెన్సీ విలువలో రూ. 500 నోట్ల వాటా 86 శాతానికి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2025-జనవరి 2026) ఈ వాటా మరో 4.4 శాతం పెరిగి ఉండవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది.

Also Read:మోటోరోలా ఫ్లిప్ ఫోన్‌పై రూ.5000 డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్

ఏపీ, తెలంగాణలో రూ.100 నోట్ల వినియోగం

దేశంలో డిజిటల్‌ చెల్లింపుల విప్లవం కొనసాగుతున్నా, కరెన్నీ చలామణి కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. 2026 జనవరి చివరికి కరెన్సీ రూ.40 లక్షల కోట్లకు చేరినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ తాజా నివేదికలో వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రూ.100 నోట్ల వినియోగం ఉందని తెలిపింది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో ఏటీఎంల నుంచి కరెన్సీ విత్ డ్రా పెరిగిందని, ఏపీలో విత్ డ్రా తగ్గుతుందని తెలిపింది. 2022-23లో ఏపీలో ఒక్కో ఏటీఎం నుంచి సగటున నెలకు రూ.1.57 కోట్లు విత్‌డ్రా అయ్యాని తెలిపింది. 2025-26 డిసెంబరుకు ఇది రూ.1.34 కోట్లకు చేరింది. తమిళనాడులో రూ.200 నోట్ల వినియోగం పెరిగిందని నివేదికలో పేర్కొంది.

 

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×