E-Paper
Advertisement

బంగారం-సిల్వర్ ధరల్లో హెచ్చుతగ్గులు.. మార్కెట్ వర్గాలు ఏమంటున్నాయి, కొనుగోలు ఇదే సరైన సమయమా!

బంగారం-సిల్వర్ ధరల్లో హెచ్చుతగ్గులు.. మార్కెట్ వర్గాలు ఏమంటున్నాయి, కొనుగోలు ఇదే సరైన సమయమా!
Advertisement

Gold-Silver Prices Today: ఇరాన్ యుద్ధం చివరి అంకానికి చేరింది. మళ్లీ మార్కెట్లో బంగారం, సిల్వర్ ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకే అవకాశం ఉందా? కొనుగోలుకు ఇదే సరైనా సమయమా? బులియన్ మార్కెట్ వర్గాలు ఏమంటున్నాయి? ఈ వారం కాకున్నా రానున్న రోజుల్లో పసిడి, సిల్వర్ ధరలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు.

బంగారం-సిల్వర్ ధరల్లో హెచ్చుతగ్గులు

Advertisement

ఇరాన్ యుద్ధం క్లైమాక్స్‌కు చేరింది. హోర్ముజ్ జలసంధి చుట్టూ కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడుదారులు డాలర్‌ వైపు మొగ్గు చూపారు. దీనివల్ల మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారింది. దీనికితోడు డాలర్, యూఎస్ బాండ్ దిగుబడులలో విలువైన లోహాల లాభాలు మరింత తగ్గాయని అంటున్నారు మార్కెట్ వర్గాలు.

వచ్చేవారం నుంచి బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. భారత్‌లో బంగారం ధరల విషయానికి వద్దాం. గడిచిన మూడు రోజులుగా మెటల్ ధరలు కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన మూడు రోజుల్లో బంగారం ధరలు దాదాపు మూడు వేల వరకు పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

కొనుగోలు ఇదే సరైన సమయమా! మార్కెట్ వర్గాలు ఏమంటున్నాయి?

అంతర్జాతీయ అనిశ్చితులు తగ్గుతాయన్న సంకేతాలు, మరోవైపు అక్షయ తృతీయ సమీపిస్తున్న తరుణంలో పసిడికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. బులియన్ వెబ్‌సైట్ ధరల ప్రకారం శుక్రవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ బంగారం మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,55,580గా ఉంది.

అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,610గా ఉంది. వెండి ధర దాదాపు స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,74,900ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుదల కనిపించింది. బంగారం అసోసియేషన్ వివరాల మేరకు 24 క్యారెట్ల బంగారం ధర కలిపి 10 గ్రాములకు రూ. 1,57,800 వద్ద కొనసాగుతోంది.

ALSO READ: సింగిల్ ఇన్వెస్ట్మెంట్ నెల నెలా ఆదాయం.. పోస్ట్ ఆఫీస్ మంథ్లీ ఇన్ కమ్ స్కీమ్.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

ఈ ధర మునుపటి ముగింపు ధర కంటే దాదాపు రూ. 200 తక్కువ. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వివరాల మేరకు.. శుక్రవారం ఉదయం 10 గ్రాముల బంగారం ధర రూ. 1,53,106 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్‌-MCX లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.330.00 తగ్గి ట్రేడింగ్ జరుగుతోంది. పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడంతో గోల్డ్, సిల్వర్ ధరలు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నాయి.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×