E-Paper
Advertisement

సింగిల్ ఇన్వెస్ట్మెంట్ నెల నెలా ఆదాయం.. పోస్ట్ ఆఫీస్ మంథ్లీ ఇన్ కమ్ స్కీమ్.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

సింగిల్ ఇన్వెస్ట్మెంట్ నెల నెలా ఆదాయం.. పోస్ట్ ఆఫీస్ మంథ్లీ ఇన్ కమ్ స్కీమ్.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Advertisement

POMIS Details: సేఫ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అనగానే పోస్ట్ ఆఫీస్ పథకాలే గుర్తొస్తాయి. కేంద్ర ప్రభుత్వం మద్దతు, ఆకర్షణీయమైన వడ్డీ వస్తుండడంతో.. ఎక్కువ మంది ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఒకేసారి ఇన్వెస్ట్ చేసి నెల నెలా వడ్డీని ఆదాయంగా పొందే స్కీమ్ అందుబాటులో ఉంది. ఇదే “పోస్ట్ ఆఫీస్ మంథ్లీ ఇన్ కమ్ స్కీమ్”. ఈ పథకంలో ఎంత పెట్టుబడి పెట్టాలి? లాభాలు ఎలా ఉంటాయి? ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి? ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీస్ మంథ్లీ ఇన్ కమ్ స్కీమ్ లో తక్కువ రిస్క్, మంచి రాబడి ఉంటుంది. పెట్టుబడిదారులు ఒకేసారి డిపాజిట్‌ చేసి.. నెల నెలా ఆదాయం పొందవచ్చు. ఇన్వెస్ట్మెంట్ మొత్తంపై వచ్చిన వడ్డీని ప్రతి నెలా ఖాతాదారుడి అకౌంట్ కు జమ చేస్తారు.

పోస్ట్ ఆఫీస్ మంథ్లీ ఇన్ కమ్ స్కీమ్ ముఖ్యాంశాలు

Advertisement

ఈ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలు. మినిమమ్ ఒకరు, మ్యాగ్జిమమ్ ముగ్గురు ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. పెట్టుబడి సమయంలో ఖాతాదారుడు మరణిస్తే..నామినీకి అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఈ అకౌంట్ ను దేశంలోని ఏ పోస్ట్ ఆఫీస్‌ కైనా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. ఈ పథకంపై వచ్చే ఆదాయానికి TDS లేదా పన్ను మినహాయింపు లేదు. ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉండవు. అయితే కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండడంతో మీ పెట్టుబడికి ఎలాంటి ఢోకా లేదు. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ ఉండదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పెట్టుబడిదారుడు నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు. ఒకే ఖాతాను జాయింట్ హోల్డర్లు ఓపెన్ చేయవచ్చు. డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌తో సహా డబ్బు లావాదేవీలు చాలా సులభంగా ఉంటాయి. నెలవారీ ఆదాయం కోరుకునే, రిస్క్ తీసుకోలేని పెట్టుబడిదారులు, సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్.

అర్హులెవరంటే?

  • భారతీయులై ఉండాలి.
  • గార్డియన్ ద్వారా మైనర్లు అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు.
  • ఎన్ఆర్ఐలు అర్హులు కాదు.

ఎంత వరకు డిపాజిట్ చేయవచ్చు?

పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం కింద, సింగిల్ అకౌంట్ హోల్డర్లు గరిష్టంగా రూ. 9 లక్షల వరకు, జాయింట్ అకౌంట్ హోల్డర్స్ రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అవసరమైన కనీస పెట్టుబడి రూ. 1,000.

నెలకు ఎంత ఆదాయం

  • పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ స్కీమ్ ప్రస్తుతం సంవత్సరానికి 7.4% వడ్డీ అందిస్తున్నారు. వడ్డీ ప్రతి నెలా ఖాతాలో జమ చేస్తారు. వార్షిక వడ్డీని 12 నెలలకు విభజించి ఖాతాదారుడికి చెల్లిస్తారు.
Advertisement

Also Read: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు.. తెలుసుకోవాల్సిన విషయాలివే

పెట్టుబడి మొత్తం – 7.4% వడ్డీతో నెలవారీ ఆదాయం

  • రూ. 1 లక్ష – రూ. 617
  • రూ. 2 లక్షలు- రూ. 1,233
  • రూ. 5 లక్షలు- రూ. 3,083
  • రూ. 9 లక్షలు- రూ. 5,550
  • రూ. 15 లక్షలు- రూ. 9,250
  • ఈ అకౌంట్ ఎలా తెరవాలి?

1. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ను ఓపెన్ చేయండి.
2. పోస్ట్ ఆఫీస్ నుంచి మంథ్లీ ఇన్ కమ్ స్కీమ్ అప్లికేషన్ ఫామ్ తీసుకోండి.
3. ఈ ఫామ్ ను నింపి మీ గుర్తింపు కార్డు, నివాస ధృవీకరణ పత్రాల ఫొటోకాపీ, 2 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను సబ్మిట్ చేయండి. ధృవీకరణ కోసం ఒరిజినల్స్ తప్పకుండా తీసుకువెళ్లండి.
4. అప్లికేషన్ పై సాక్షి సంతకరం లేదా నామినీ సంతకాలను ఉండాలి.
5. స్టార్టింగ్ డిపాజిట్‌ నగదు లేదా చెక్కు ద్వారా చేయవచ్చు. ప్రాసెసింగ్ పూర్తైన తర్వాత, పోస్ట్ ఆఫీస్ అధికారి కొత్త అకౌంట్ వివరాలను అందిస్తారు.

 

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×