E-Paper
Advertisement

Today Gold Rate: తగ్గినట్టే తగ్గి.. ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు, ఈసారి ఎంతంటే?

Today Gold Rate: తగ్గినట్టే తగ్గి.. ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు, ఈసారి ఎంతంటే?
Advertisement

Today Gold Rate: బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. తగ్గిందని సంతోషించేలోపే మళ్లీ అందలం ఎక్కి కూర్చున్నది. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,440 కాగా.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,880 వద్ద పలుకుతోంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,04,900 ఉండగా.. శుక్రవారం రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,05,300 వద్ద ఉంది. అంటే ఒక్కరోజుకు రూ.440 పెరిగిందని చెప్పవచ్చు.

కనికరించని పసిడి ధరలు..
గురువారం బంగారం ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు చాలా సంతోషించారు. కానీ ఆ ఆనందం మున్నాళ్ల ముచ్చటే అన్నట్లుగా అయిపోయింది. తగ్గింది అని అనుకునేలోపే మళ్లీ పెరిగిపోయింది. దీంతో పాపం పసిడి ప్రియులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బంగారం ధరలు ఒక్కరోజూ తగ్గితే వారం రోజులు పెరుగుతూ పోతుంది. పసిడి ప్రియులకు బంగారంపై ఆశ చచ్చిపోకుండా మధ్యలో ఒక్కసారిగా తగ్గుతుంది. మళ్లీ ఏదావిధిగా పెరిగిపోతుంది. దీంతో బంగారం కొనాలని అనుకునేవారు బంగారం కొనాలా..? వద్దా..? ముందు ముందు తగ్గుతదా? లేదా ఇంకా పెరుగుతదా? అనే ఆలోచనలో ఉన్నారు.

Advertisement

బంగారం పెరుగుటకు అసలు కారణం..
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అంతేకాకుండా బంగారం పెట్టుబడిగా పెట్టడం వల్ల పెట్టుబడిదారుల డిమాండ పెరిగి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య సుంకాల యుద్ధాలు బంగారం ధరలను పతనం చేస్తు్న్నాయి.

రాష్ట్రంలో బంగారు ధరలు..

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,14,880 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,05,300 వద్ద ఉంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,880 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,05,300 వద్ద కొనసాగుతుంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,880 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,05,300 వద్ద పలుకుతుంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,030 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,05,450 వద్ద ఉంది.

Also Read: స్థానిక సంస్థల ఎన్నికలకు ముహుర్తం ఖరారు.. బీసీలకు 42% రిజర్వేషన్

నేటి సిల్వర్ ధరలు ఇలా..
బంగారం ధరల బాటలోనే సిల్వర్ కూడా నడుస్తోంది. వాటికి ఏమాత్రం తగ్గకుండా సమానంగా సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి.
గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 1,50,000 కాగా శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ.1,53,000 వద్ద కొనసాగుతుంది. అంటే ఒక్కరోజే సిల్వర్ ధరలు కేజిపై రూ.3,000 పెరిగింది. అలాగే కలకత్త, ముంభై, ఢీల్లిలో కేజీ సిల్వర్ ధరలు రూ. 1,43,000 వద్ద కొనసాగుతోంది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×