Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో భాగంగా బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ పై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం సాధించినప్పటికీ.. చెత్త ఫీల్డింగ్ చేసిందని మరోసారి రుజువు అయింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్ కూడా చెత్త ఫీల్డింగ్ చేసింది. ముఖ్యంగా షాహిన్ అఫ్రిదికి సంబంధించిన క్యాచ్ ను మూడు సార్లు బంగ్లాదేశ్ ఆటగాళ్లు మిస్ చేయడం విశేషం. మరోవైపు పాకిస్తాన్ చెత్త ఫీల్డింగ్ కారణంగా రనౌట్ మిస్ చేశారు.
Also Read : IND vs SL: నేడు శ్రీలంకతో మ్యాచ్…టీమిండియాకు మంచి ప్రాక్టీస్…బలాబలాలు ఇవే
బంగ్లాదేశ్ బ్యాటర్లు తౌహిద్ హృదయ్, సైఫ్ హాసన్ బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే హృదయ్ షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో బ్యాక్ వర్డ్ పాయింట్ వైపు ఆడాడు. దీంతో సయిమ్ అయూబ్ వికెట్ కీపర్ వైపు విసరకుండా బౌలర్ వైపు విసిరాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఫీల్డర్ మిడ్ నుంచి త్రోను విసిరివేస్తే.. అది తాకలేదు. ఒకవేళ వికెట్ కీపర్ వైపు విసిరివేసినట్టయితే అది ఔట్ అయ్యేది. దీంతో సైఫ్ హాసన్ ఔట్ కాకుండా బ్రతికించాడు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఇంత చెత్త ఫీల్డింగ్ చేస్తుందా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అఫ్రిదిని స్మాష్ చేస్తుండగానే.. తౌహిద్ హృదయ్ ఆ తరువాత బంతికే ఔట్ గా వెనుదిరిగాడు. ఈమ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ చేసిన బంగ్లాదేశ్ పాకిస్తాన్ ని కట్టడి చేయడంలో అద్భుతమే సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో 135/8 పరుగులు చేసింది పాకిస్తాన్ జట్టు. బంగ్లాదేశ్ 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. సులువుగా విజయం సాధిస్తుందనుకున్న సమయంలో పాకిస్తాన్ బౌలర్లు కీలకంగా బౌలింగ్ చేసి వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ పై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ 4, ఫఖర్ జమాన్ 13, సైమ్ అయూబ్ 0, సల్మాన్ అఘా 19, హుస్సెన్ తలత్ 3, మహ్మద్ హారీస్ 12, షాహిన్ అఫ్రిది 19 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే షాహిన్ అఫ్రిదికి 3 క్యాచ్ లు మిస్ అయ్యాయి. చివరికీ తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో షాహిన్ అఫ్రిది క్యాచ్ ని జాకీర్ అలీ పట్టడంతో దీంతో షాహిన్ అఫ్రిది వెనుదిరిగాడు. చివరికీ తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో షాహిన్ అఫ్రిది క్యాచ్ ని జాకీర్ అలీ పట్టడంతో దీంతో షాహిన్ అఫ్రిది వెనుదిరిగాడు. మహ్మద్ నవాజ్ 25 పరుగులు చేయడంతో పాకిస్తాన్ ఆమాత్రం స్కోర్ చేయగలిగింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో సైఫ్ హాసన్ 17, హొస్సెస్ ఇమామ్ 0, హృదయ్ 5, హాసన్ 11, నురుల్ హాసన్ 16, షమీమ్ హోస్సెన్ 30, జాకీర్ అలీ వికెట్ కీపర్, కెప్టెన్ 5, హాసన్ షకీబ్ , రిషద్ హోస్సెన్ 16, తస్కిన్ అహ్మద్ 4 కావడం.. ముస్తాఫిర్ అజార్ 6 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ జట్టు 11 పరుగుల తేడాతో ఓటమి పాలవ్వడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. చివరికీ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఈనెల 28న ఫైనల్ మ్యాచ్ జరుగబోతుంది.