Anaganaga Oka Raju: జాతి రత్నాలు సినిమా తర్వాత నవీన్ పోలిశెట్టి ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో నవీన్ కు తెలుగులో మంచి మంచి అవకాశాలు వచ్చాయి. జాతి రత్నాలు తరువాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందించింది. అదే సమయంలో నవీన్ ..అనగనగా ఒక రాజు అనే సినిమాను ప్రకటించాడు. మొదట ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించారు. కానీ, మధ్యలో కొన్ని విభేదాల వలన అయన ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.
ఇక కళ్యాణ్ శంకర్ బాధ్యతలను డైరెక్టర్ మారి అందుకున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. రెండేళ్ల క్రితమే మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక తాజాగా అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతి ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మొదట నవీన్ సరసన శ్రీ లీల నటిస్తున్నట్లు తెలిపారు ఆ తర్వాత ఆమె ప్లేస్ లో మీనాక్షి చౌదరి వచ్చి చేరింది.
ఇప్పటికీ ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా మేకర్స్ సంక్రాంతి ప్రోమో పేరుతో సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ ప్రోమోలో నవీన్ పోలిశెట్టి మీనాక్షి చౌదరి తమ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుందని తెలిపారు.
నవీన్ పోలిశెట్టి మీనాక్షి చౌదరి జ్యూవెలరీ యాడ్ లో నటిస్తున్నట్లు రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జనవరి 14న అనగనగా ఒక రాజు రిలీజ్ కానుందని చెప్పకోచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ రిలీజ్ కానుందని తెలుస్తుంది. మరి ఈ చిత్రంతో నవీన్ పోలిశెట్టి ఎలాంటి విజయాన్ని అనుకుంటాడు చూడాలి.