E-Paper
Advertisement

బంగారం పైపైకి.. సామాన్యుడు కిందికి.. సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న పసిడి, వెండి ధరలు!

బంగారం పైపైకి.. సామాన్యుడు కిందికి.. సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న పసిడి, వెండి ధరలు!
Advertisement

Gold Rate Today: ప్రస్తుతం పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు భారత్‌లో పసిడి రేట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ మేఘాలు పూర్తిగా వీడకముందే పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన మార్గంగా భావించి పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ డిమాండ్ భారీగా పెరిగింది. అయితే, ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను చూస్తుంటే పసిడి ధరలు త్వరలోనే మరిన్ని రికార్డులను తిరగరాసేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకుంటే, ధరల హెచ్చుతగ్గులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,840 ఉండగా.. నేడు బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,820 వద్ద పలుకుతుంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,350 కాగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,000 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.3,980 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,53,820 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,000 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,820 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,000 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,53,820 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,000 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,970 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,41,150 వద్ద ఉంది.

నేటి సిల్వర్ ధరలు..
వామ్మో.. నేడు పసిడి ధరలే కాదు.. సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం ట్రంప్ యుద్ధం విరమణ ప్రకటన ద్వారా చమురు ధరలు తగ్గుతుంటే.. పసిడి, సిల్వర్ ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,55,000 వద్ద ఉండగా.. నేడు బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,65,000 వద్ద కొనసాగుతుంది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ రూ. 2,60,000 వద్ద పలుకుతోంది.

Also Read: కొత్త ఐటీ రూల్స్.. ఉద్యోగుల పంట పండినట్లే.. వామ్మో ఎన్ని ప్రయోజనాలో..!

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×