E-Paper
Advertisement

‘పెద్ది’ స్పెషల్ సాంగ్ నుంచి చివరి క్షణంలో తప్పుకున్న మృణాల్.. ఆ ఛాన్స్ ఎవరికంటే?

‘పెద్ది’ స్పెషల్ సాంగ్ నుంచి చివరి క్షణంలో తప్పుకున్న మృణాల్.. ఆ ఛాన్స్ ఎవరికంటే?
Advertisement

Peddi Movie: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలను మూటగట్టుకుంది. రామ్ చరణ్ కెరీర్‌లో 16వ చిత్రంగా (RC16) వస్తున్న ఈ సినిమా, ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. అయితే, తాజాగా ఈ సినిమాలోని ఒక ‘స్పెషల్ సాంగ్’ గురించి ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

Read also-Podarillu : ‘పొదరిల్లు’ మేకింగ్ వీడియో.. మహా అల్లరికి దండం పెట్టాల్సిందే..రచ్చ రచ్చే..

మృణాల్ ఠాకూర్ ఎగ్జిట్?

Advertisement

ఈ చిత్రంలో ఒక ప్రత్యేక గీతం కోసం చిత్ర యూనిట్ మొదట టాలీవుడ్ గోల్డెన్ లెగ్ మృణాల్ ఠాకూర్ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. సీతారామం సినిమాతో తెలుగులో స్టార్ డమ్ సంపాదించుకున్న మృణాల్, రామ్ చరణ్ సినిమాలో భాగమవ్వడంపై మెగా అభిమానులు కూడా చాలా ఉత్సాహం చూపించారు. కానీ, లేటెస్ట్ సమాచారం ప్రకారం మృణాల్ ఈ సాంగ్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ చివరి దశలో ఉండటం, ఆమె ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు కాలేదని సమాచారం. దీంతో ఈ క్రేజీ ఆఫర్ మరో భామ వద్దకు వెళ్ళింది.

తెరపైకి మానస వారణాసి

మృణాల్ తప్పుకోవడంతో, ఆ స్థానంలో ఎవరిని తీసుకోవాలనే విషయంలో దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘కపుల్ ఫ్రెండ్లీ’ షార్ట్ ఫిల్మ్ ద్వారా పాపులర్ అయిన మాజీ మిస్ ఇండియా మానస వారణాసిని ఈ స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసి ఇప్పటికే తన అందంతో, వ్యక్తిత్వంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇప్పుడు రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ సినిమాలో మెరిసే అవకాశం రావడం ఆమె కెరీర్‌కు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Read also-అల్లు అర్జున్, అట్లీ టైటిల్ వచ్చేసింది.. ఇదేంటీ ‘రాకాసా’కు సీక్వెల్?

‘పెద్ది’ సినిమా విశేషాలు

ఈ సినిమా కేవలం ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు, భావోద్వేగాలతో కూడిన కథ అని సమాచారం. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన అందించిన ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పుడు చర్చల్లో ఉన్న స్పెషల్ సాంగ్ కూడా రెహమాన్ మార్క్ మాస్ బీట్‌తో ఉండబోతుందట. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే కన్నడ లెజెండరీ నటుడు శివ రాజ్‌కుమార్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఒక స్పెషల్ సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క పాటను కూడా పూర్తి చేసి, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్న ఈ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. ఒకవేళ మానస వారణాసి ఎంట్రీ నిజమైతే, ఈ స్పెషల్ సాంగ్ ప్రేక్షకులకు మరింత కొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయం.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×