E-Paper
Advertisement

Home Car Loans Less: చౌకగా గృహ, వాహన రుణాలు.. తగ్గనున్న ఈఎంఐ భారం

Home Car Loans Less: చౌకగా గృహ, వాహన రుణాలు..  తగ్గనున్న ఈఎంఐ భారం
Advertisement

Home Car Loans Less: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25% శాతానికి చేరుకుంది. రెపో రేటు తగ్గడంతో గృహ, వాహన రుణాల వడ్డీలు తగ్గనున్నాయి. ఈ ఏడాది ఐదోసారి ఆర్బీఐ రెపో రేటును సవరించింది. అలాగే బ్యాంకులు రుణాల వడ్డీలను మరింత తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. గృహ, ఆటో, వ్యక్తిగత రుణగ్రహీతలకు ఆర్బీఐ ఉపశమనం కలిగించిందని నిపుణులు చెబుతున్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 5.25 శాతానికి చేరింది. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు కోవిడ్-19 సమయంలో ఉన్న స్థాయికి తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో సహా అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుతం 7.35 శాతం నుంచి హోమ్ లోన్స్ జారీ చేస్తున్నారు. రెపో రేటు తగ్గింపుతో గృహ రుణాల వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గి 7.1 శాతానికి చేరుకుంటుందని కస్టమర్లు ఆశిస్తున్నారు.

తగ్గనున్న ఈఎంఐ భారం

Advertisement

15 ఏళ్లకు రూ.1 కోటి గృహ రుణం తీసుకుంటే.. 0.25 శాతం బేసిస్ పాయింట్ల తగ్గింపుతో నెలకు దాదాపు రూ.1,440 ఈఎంఐ తగ్గుతుందని విశ్లేషకులు తెలిపారు. బ్యాంకర్ల అంచనాల ప్రకారం.. నూతన హోమ్ లోన్లకు వడ్డీ రేటు 7.1 శాతంగా నిర్ణయిస్తే బెంచ్‌మార్క్‌పై స్ప్రెడ్‌లను సవరించాల్సి ఉంటుందని అంటున్నారు. దీంతో కొత్తగా లోన్ తీసుకునేవారికి ఇప్పటికే లోన్ కలిగిన ఫ్లోటింగ్ రేటు కస్టమర్ల కంటే ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

ఆర్‌బీఐ తటస్థ వైఖరిని కొనసాగిస్తూ.. ఓపెన్ మార్కెట్ లో తగినంత డబ్బు ఉంచుతాయని పేర్కొంది. రెపో రేట్ తగ్గింపు చివరి స్థాయి వ్యక్తుల వరకు చేరాలని ఆర్బీఐ ఆదేశించిందన్నారు.

Advertisement

Also Read: Gold Rate Dropped: గుడ్‌న్యూస్..! భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

ఆర్‌బీఐ రూ. 1 ట్రిలియన్ ఓపెన్ మార్కెట్  కొనుగోళ్లు, మూడేళ్ల యూఎస్ డాలర్లు/రూపాయి బై-సెల్ స్వాప్ ప్రణాళికలను ఆవిష్కరించింది. ఇది దాదాపు రూ. 1.45 ట్రిలియన్ లిక్విడిటీ ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని ప్రోత్సహించడానికి ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి తగ్గించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×