OTT Movie : థ్రిల్లర్ సినిమాలకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఈ సినిమాలు కిల్లర్స్, పోలీసులు, ఇన్వెస్టిగేషన్ లతో ఉత్కంఠభరితంగా ఉంటాయి. అయితే కొన్ని సినిమాలలో అనుకోకుండా దేవుడి లాంటి మనుషులు కూడా క్రిమినల్స్ గా మారిపోతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మరాఠీ మూవీలో పిల్లలకి పాఠాలు చెప్పే ఒక మంచి వ్యక్తి, అనుకోకుండా ఒక మర్డర్ చేస్తాడు. దీంతో స్టోరీ ఊహించని మలుపులతో ఉత్కంఠంగా సాగుతుంది. ఇందులో మహేష్ మంజ్రేకర్ ప్రధాన పాత్రలో యాక్టింగ్ ఇరగాదీశాడు. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
2025లో విడుదలైన ఈ మరాఠీ మూవీ పేరు ‘Devmanus’. అంటే దేవుడి లాంటి మనిషి అని అర్థం. 2022 హిందీ మూవీ ‘Vadh’కి ఇది రీమేక్. మరాఠీ సినిమాలో ఎమోషనల్ డెప్త్‌తో హైలైట్ అయింది. తేజస్ ప్రభా విజయ్ దేవస్కర్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో మహేష్ మంజ్రేకర్, రేనుకా షాహానే, సుబోధ్ భవే, సిద్ధార్థ్ బోడ్కే లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 25న థియేటర్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. ఐయండిబిలో 6.7/10 రేటింగ్ పొందింది.
కేశవ్ అనే ఉపాధ్యాయుడు తన భార్య లక్ష్మీతో కలిసి మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో ప్రశాంతంగా జీవిస్తుంటాడు. కేశవ్ ప్రతి సంవత్సరం పంధర్పుర్ తీర్థయాత్ర చేస్తూ, దేవుని భక్తిలో కూడా మునిగి ఉంటాడు. అతని జీవితం ఇలా సాగుతుండగా, ఒక రోజు గ్రామంలోకి దీపక్ అనే వ్యాపారవేత్త విలన్ గా ఎంట్రీ ఇస్తాడు. దీపక్ గ్రామంలో భూములు కొనాలని ప్లాన్ చేస్తాడు, కానీ కేశవ్ ఆశ్రమంకు కనెక్టెడ్ భూములను కూడా టార్గెట్ చేస్తాడు. దీపక్‌కు కేశవ్ భార్య లక్ష్మీపై మొహం పెంచుకుంటాడు. అతను లక్ష్మీని బెదిరిస్తూ, భూములు ఇవ్వమని ఒత్తిడి తెస్తాడు. వీళ్ళు లొంగకపోయేసరికి, దీపక్ మరిన్ని ఇబ్బందులు పెట్టడానికి ప్లాన్ చేస్తాడు.
Read Also : 18 ఏళ్ల వయసులో ఉరి… బ్రిటిష్ వాళ్ళను వణికించిన చిచ్చరపిడుగు… ఓటీటీలోకి వచ్చేసిన ఖుదిరామ్ బోస్ బయోపిక్
కేశవ్ దీపక్‌ను ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ దీపక్ డబ్బు అహంకారంతో వీళ్ళను అవమానిస్తాడు. ఒక రాత్రి, దీపక్ లక్ష్మీని బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాడు. కేశవ్ అక్కడికి చేరుకుని, దీపక్‌ను ఆపడానికి పోరాడతాడు. కానీ ఆ కోపంలో, కేశవ్ దీపక్‌ను కత్తితో పొడిచి చంపేస్తాడు. ఈ హత్య అనుకోకుండా జరిగిపోతుంది. కేశవ్ శవాన్ని దాచడానికి ప్లాన్ చేస్తాడు. అతను దీపక్ శవాన్ని ఒక పాత బావిలో పడేసి మట్టితో కప్పేస్తాడు. కేశవ్ ఏమీ తెలియనట్టు సైలెంట్ గా ఉండిపోతాడు. కానీ దీపక్ మిస్సింగ్ కేసును పోలీస్ ఇన్స్పెక్టర్ రవి దేశ్ముఖ్ దర్యాప్తు చేయడం మొదలుపెడతాడు. ఈ దర్యాప్తులో అసలు విషయం బయట పడుతుందా ? కేశవ్ జైలుకు వెళ్తాడా ? ఈ కథ ముగింపు ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.