2026 Kia Seltos Mileage Details: న్యూ జెనరేషన్ కియా సెల్టోస్ భారత మార్కెట్లోకి వచ్చిన తర్వాత.. మైలేజీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 2026 జనవరిలో విడుదలైన ఈ SUV ప్రస్తుతం రూ. 10.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. పనితీరు, ఫీచర్లు మాత్రమే కాదు, ఇంధన సామర్థ్యంపైనా ఈ మోడల్ మంచి బ్యాలెన్స్ చూపిస్తోంది.
కొత్త సెల్టోస్ లో మూడు ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, అలాగే 1.5 లీటర్ డీజిల్. వీటిలో డీజిల్ వేరియంట్ మైలేజ్ పరంగా ప్రత్యేకంగా నిలుస్తోంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ సుమారు 114 bhp పవర్, 250 Nm టార్క్ ఇస్తుంది. ఇది 6 స్పీడ్ iMT గేర్ బాక్స్ తో కలిపి సుమారు 19.4 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం డీజిల్ ధరలను లెక్కలోకి తీసుకుంటే, రూ.100తో దాదాపు 22 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉంది. దీని వల్ల లాంగ్ డ్రైవ్స్ చేసే వారికి ఇది మంచి ఆప్షన్ గా మారుతుంది.
అదే డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ కూడా 17.8 కి.మీ మైలేజ్ ఇస్తూ, మంచి పని తీరును చూపుతోంది. మరోవైపు పెట్రోల్ వేరియంట్లు కూడా మంచి మైలేజ్ ఇస్తున్నాయి. బేస్ పెట్రోల్ ఇంజన్ 133 bhp పవర్ ఇస్తూ, మాన్యువల్, iVT గేర్ బాక్స్ లతో సుమారు 16.5 కి.మీ మైలేజ్ అందిస్తుంది. టర్బో పెట్రోల్ వేరియంట్ మరింత పవర్ ఫుల్‌గా ఉండి 158 bhp పవర్, 253 Nm టార్క్ ఇస్తుంది. ఇది iMTతో 15.6 కి.మీ, DCTతో 17.5 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది.
ARAI-tested mileage of the @KiaInd Seltos is out – and the numbers tell an interesting story !
✅ Diesel MT sits right on top
✅ Turbo iMT ends up at the bottom👉 Surprise? The Turbo DCT is more efficient than iMT – not what most would expect.
👉 Diesel still leads… pic.twitter.com/MiKsEUWnPF— Vahan Warta (वाहन वार्ता ) (@VahanWarta) April 22, 2026
ఫీచర్ల విషయంలో కూడా ఈ SUV ముందుంది. పనోరమిక్ సన్ రూఫ్, 10.1 అంగుళాల టచ్ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ADAS లాంటి ఆధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. టెక్నాలజీతో పాటు సేఫ్టీ విషయంలో కూడా ఆకట్టుకుంటుంది. ఈ మోడల్‌కు 5 స్టార్ BNCAP రేటింగ్ కూడా అభించింది. భద్రత కోసం ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, హిల్ హోల్డ్ అసిస్ట్, TPMS, ISOFIX మౌంట్స్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు కూడా ఉంటాయి. ఈ SUVను కుటుంబాలకు సేఫ్ ఆప్షన్‌గా మార్చుతున్నాయి.
మార్కెట్లో ఇది హ్యుండాయ్ క్రెటా, హోండా ఎలావేట్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ లాంటి మోడళ్లతో పోటీ పడుతోంది. ఈ విభాగంలో ఇప్పటికే గట్టి పోటీ ఉన్నప్పటికీ, మైలేజ్, ఫీచర్లు, సేఫ్టీ కలిసి సెల్టోస్ ను మంచి ఆల్ రౌండ్ గా నిలబెడుతున్నాయి. న్యూ జెనరేషన్ సెల్టోస్‌లో డీజిల్ మాన్యువల్ వేరియంట్ ఖర్చు పరంగా అత్యంత బెసట్ ఆప్షన్ గా నిలుస్తోంది. రోజువారీ వినియోగంతో పాటు దీర్ఘ ప్రయాణాలకు కూడా సరైన SUVగా చెప్పవచ్చు.
Read Also: ప్రీమియం నుంచి బడ్జెట్ వరకు.. కొత్త టెక్నాలజీతో రాబోయే 4 అద్భుతమైన కార్లు!